Meera Vasudevan: 3 పనికిరాని పెళ్లిళ్లు, 17 ఏళ్లు వృథా, నా కొడుకుతో తరచూ చెప్తాను: తెలుగు హీరోయిన్ మీరా వాసుదేవన్
Meera Vasudevan About 3 Marriages Wasting 17 Years: జేడీ చక్రవర్తి గోల్‌మాల్ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీరా వాసుదేవన్ తాజాగా తన జీవితంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 3 సార్లు పనికిరాని పెళ్లిళ్లు చేసుకున్నానని, దానివల్ల 17 ఏళ్ల టైమ్ వేస్ట్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు మీరా వాసుదేవన్
Meera Vasudevan On Marriages 3 Times Wasting 17 Years: సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన ప్రతిభ ఉండి కూడా, వ్యక్తిగత జీవితంలోని సమస్యల వల్ల కెరీర్‌లో అనుకున్న స్థాయికి చేరలేకపోయిన నటీమణులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు మీరా వాసుదేవన్. ప్రస్తుతం 44 ఏళ్ల వయసున్న మీరా, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన మూడు విఫల వివాహాల గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

తెలుగు హీరోయిన్ మీరా
తనను కనీసం గౌరవించని మనుషుల కోసం జీవితాన్ని పణంగా పెట్టానని తెలుగు హీరోయిన్ మీరా వాసుదేవన్ చెప్పారు. జేడీ చక్రవర్తి హీరోగా చేసిన గోల్‌మాల్ అనే సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచయమైంది మీరా వాసుదేవన్. 2001లో సీరియల్ ద్వారా బుల్లితెరపై నటిగా ఇంట్రడ్యూస్ అయిన మీరా ఐ లవ్యూ అంజలి అనే మూవీలోనూ మెరిసింది.
తెలుగు, మలయాళ, తమిళ, హిందీ సినిమాల్లో రాణిస్తున్న మీరా వాసుదేవన్ రెండో భర్త జాన్ కొక్కెన్.. తెలుగులో 'కేజీఎఫ్', 'పుష్ప', 'వీరసింహారెడ్డి' వంటి భారీ చిత్రాలలో పవర్ ఫుల్ విలన్ పాత్రలు పోషించి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. "నన్ను గౌరవించని వారి కోసం సమయం వృథా చేశా" అని ప్రముఖ యాంకర్ ధన్య వర్మతో జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మీరా వాసుదేవన్ తన మనసులోని బాధను పంచుకున్నారు.
3 పనికిరాని పెళ్లిళ్లు
"నేను నా కొడుకుతో తరచూ ఒక మాట చెబుతుంటాను. మూడు పనికిరాని పెళ్లిళ్ల కోసం నా జీవితంలో 17 ఏళ్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్నాను. అదే సమయాన్ని తెలివిగా వాడుకుని ఉంటే, కెరీర్‌లో ఎంతో సాధించేదాన్ని. నాకు ఇష్టమైన సినిమా, ఫిట్‌నెస్ లేదా మంచి స్నేహితులను సంపాదించుకోవడంపై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది" అని మీరా వాసుదేవన్ పేర్కొన్నారు.
తనను ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోని, గౌరవించని వ్యక్తులతో రిలేషన్‌షిప్‌లో ఉండి తప్పు చేశానని మీరా వాసుదేవన్ అంగీకరించారు. ఆ సమయాన్ని తన తల్లిదండ్రులు, సోదరితో గడిపి ఉంటే ఎంతో సంతోషంగా ఉండేదాన్నని గుర్తుచేసుకున్నారు. దీంతో మీరా వాసుదేవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మీరా వాసుదేవన్ మూడు పెళ్లిళ్ల కథ ఇదీ..
మీరా వాసుదేవన్ వైవాహిక జీవితం మొదటి నుంచీ వివాదాలు, మనస్పర్థలతోనే సాగింది. ఆమె 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను వివాహం చేసుకున్నారు. అయితే వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు, 2010 జూలైలో వీరిద్దరు విడిపోయారు.
ఆ తర్వాత 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు జన్మించిన తర్వాత, 2016లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఇక 2024 మే నెలలో సినిమాటోగ్రాఫర్ విపిన్ పుతియాంకమ్‌ను మీరా వాసుదేవన్ మూడో వివాహం చేసుకోగా, ఆ బంధం కూడా కేవలం ఏడాదిలోనే ముగిసిపోయింది. 2025 ఆగస్టులో వీరిద్దరూ విడిపోయారు.
గతాన్ని మర్చిపోయి ముందడుగు
తన జీవితంలో జరిగిన పొరపాట్లను ఒప్పుకోవడానికి మీరా వాసుదేవన్ వెనుకాడలేదు. ఈ ఏడాది ప్రారంభంలో 'మూవీ వరల్డ్ మీడియా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మీరా వాసుదేవన్ ఇవే విషయాలను ప్రస్తావించారు.
"నా జీవితంలో కొన్ని తప్పులు జరిగాయి, వాటిని నేను దాచాలనుకోవడం లేదు. ఇప్పుడు నేను గతాన్ని వదిలేసి ముందుకు సాగాలి. ప్రస్తుతం నా కెరీర్‌తో చాలా బిజీగా ఉన్నాను, నా జీవితంలో ఇదొక అందమైన దశ" అని హీరోయిన్ మీరా వాసుదేవన్ చెప్పుకొచ్చారు.
మీరా వాసుదేవన్ సినిమాలు
2003లో మిలింద్ సోమన్ సరసన 'రూల్స్: ప్యార్ కా సూపర్‌హిట్ ఫార్ములా' అనే హిందీ చిత్రంతో కెరీర్ ప్రారంభించిన మీరా వాసుదేవన్ ఆ తర్వాత మలయాళంలో 'ఒరువన్', 'ఏకాంతం', 'కుట్టిమామ' వంటి వైవిధ్యభరితమైన సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె తన కొడుకు బాధ్యతలు చూసుకుంటూ, మళ్లీ సినిమాల్లో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


