Chethabadi: హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి- హారర్ మిస్టరీ థ్రిల్లర్‌గా చేతబడి మూవీ- అమ్ముడుపోయిన 5 భాషల ఆడియో రైట్స్!
Chethabadi Movie Audio Rights To Saregama: ప్రముఖ తెలుగు నటుడు జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చేతబడి. తాజాగా జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. చేతబడి ఐదు భాషల ఆడియో రైట్స్‌ను సరిగమ కొనుగోలు చేయడం విశేషం.
Chethabadi Movie Audio Rights Sold To Saregama: తెలుగులో ఎంతో క్రేజ్ ఉన్న హీరోల్లో జేడీ చక్రవర్తి ఒకరు. 90స్ కాలంలో హీరోగా ఎన్నో సూపర్ హిట్స్ ఇచ్చిన జేడీ చక్రవర్తి నటుడిగా కూడా ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ చేతబడి. రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రానికి తాజాగా ‘‘చేతబడి” అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.

తాజాగా టైటిల్ రివీల్
ప్రముఖ నిర్మాణ సంస్థలు ఎమ్3 మీడియా, మహా మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇదివరకు ఈ రెండు నిర్మాణ సంస్థల నుంచి ప్రొడక్షన్ నెం 4గా ఓ మూవీ తెరకెక్కుతున్నట్లు పోస్టర్ అనౌన్స్‌మెంట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆ సినిమా టైటిల్ చేతబడి అంటూ రివీల్ చేశారు దర్శకనిర్మాతలు.
చేతబడి టెక్నికల్ వర్క్
చేతబడి సినిమాను మహర్షి కూండ్ల సమర్పణలో రూపొందుంతోంది. ఈ చిత్రానికి సూర్యాస్ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చేతబడి సినిమాకు అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
బాణామతి బ్యాక్ డ్రాప్‌లో
సినిమాటోగ్రాఫర్‌గా మిర్లాన్ నసీర్ చేయగా ఎడిటింగ్ వంశీ చేస్తున్నారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా బాణామతి బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ ఆసక్తికరమైన చిత్రం చేతబడి హారర్, మిస్టరీ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసేలా ఉంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా
ఇప్పటికే విడుదలైన చేతబడి ప్రీ లుక్ పోస్టర్‌తో సినిమాపై ఆసక్తి పెరిగింది. గురువారం (ఏప్రిల్ 17) వెర్సటైల్ యాక్టర్ జేడీ చక్రవర్తి పుట్టినరోజు సందర్భంగా ఇందులో ఆయన పోషిస్తున్న పాత్ర గురించి రివీల్ చేశారు మేకర్స్. మునుపెన్నడూ పోషించని డిఫరెంట్ అవతార్‌లో హీరోగా, విలన్‌గా జేడీ చక్రవర్తి కనిపించనున్నారని చిత్ర యూనిట్ తెలియజేసింది.
ఐదు భాషల ఆడియో రైట్స్
మరోవైపు చేతబడి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాకముందే.. ఐదు భాషల ఆడియో రైట్స్‌ను మ్యూజిక్ సెన్సేషన్ సరిగమ సంస్థ దక్కించుకుంది. ఒక పాటను ఐదు భాషల్లో విడుదల చేయడం కామన్‌గా జరుగుతుంది. కానీ, ఇందులో తెలుగులో ఒక పాట, మిగిలిన భాషల్లో డిఫరెంట్ సాంగ్స్, సేమ్ విజువల్‌తో రావడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
దెయ్యం తర్వాత
వచ్చే నెల నుంచి ఈ చేతబడి మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. చేతబడి చిత్రం టెక్నికల్‌గా కూడా హై స్టాండర్డ్స్‌లో ఉండబోతోందని యూనిట్ చెబుతోంది. ఇదివరకు దెయ్యం వంటి సినిమాలతో అలరించిన జేడీ చక్రవర్తి ఈ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చేతబడి మూవీతో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


