Salman Khan Virgin: బాలీవుడ్‌లో దశాబ్దాలుగా మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీ చాట్ షోగా దూసుకుపోతున్న 'కాఫీ విత్ కరణ్' (Koffee With Karan) ఇప్పుడు తన చివరి సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అక్టోబర్ 14 నుంచి జియో హాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఈ షో 9వ సీజన్ స్ట్రీమింగ్ కానుంది.

అయితే ఈ ఫైనల్ సీజన్‌కు సంబంధించిన మొదటి ఎపిసోడ్‌లో బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ గెస్ట్‌గా సందడి చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
"నువ్వు ఇంకా వర్జిన్ గానే ఉన్నావా?".. సల్మాన్ ఫన్నీ రియాక్షన్
షో మొదలుపెట్టినప్పటి నుంచి అనేక వివాదాలు, ఆసక్తికరమైన నిజాలు, ఫన్నీ కామెంట్స్‌తో ఈ కాఫీ విత్ కరణ్ షో ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే నిలిచింది. ఇప్పుడు ఫైనల్ సీజన్ కావడంతో హోస్ట్ కరణ్ జోహార్ ఎలాంటి ప్రశ్నలతో గెస్ట్‌లను ఇబ్బంది పెడతాడోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
టీజర్‌లో కరణ్ జోహార్ తనదైన శైలిలో సల్మాన్‌ను పాత ప్రశ్నలతో ఆటపట్టించడం హైలైట్‌గా నిలిచింది. గతంలో ఒక షోలో సల్మాన్‌ను అడిగిన ఆ ఫేమస్ ప్రశ్నను కరణ్ మళ్ళీ రిపీట్ చేస్తూ.. "మీరు ఇప్పటికీ వర్జినేనా?" అని అడుగుతాడు. దానికి సల్మాన్ ఏమాత్రం తడబడకుండా చాలా కూల్‌గా "కంట్రోల్.. యా బ్రదర్.. కంట్రోల్" అంటూ ఇచ్చిన ఆన్సర్ నవ్వులు పూయిస్తోంది.
అలాగే షో చివరి దశకు చేరడంపై సల్మాన్ స్పందిస్తూ.. సెలెబ్రిటీలను ఈ షోకి రప్పించడానికి కరణ్ ఆడుతున్న ప్లాన్ ఇదంటూ ఫన్నీగా జోకులు పేల్చారు. అయితే ఈ షో ముగిసిపోవడం తనకు ఇష్టం లేదని కూడా ఆయన స్పష్టం చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్, పెరుగుతున్న పాపరాజీ కల్చర్‌పై సల్మాన్ తీవ్రంగా స్పందిస్తూ.. ఈ ఫోన్లలో కెమెరాలు కనిపెట్టిన వాళ్లు ఎవరైనా దొరికితే అంటూ సరదాగా ఫైర్ అయ్యారు.
2004 నుంచి నడుస్తున్న ప్రయాణానికి ముగింపు
2004లో తన తండ్రి యశ్ జోహార్‌తో కలిసి ఈ షో ఐడియా గురించి డిస్కస్ చేసిన రోజులను కరణ్ జోహార్ గుర్తు చేసుకున్నారు. మొదట్లో స్నేహితులను పిలిచి కబుర్లు చెబితే ఎవరూ డబ్బులు ఇవ్వరని ఆయన తండ్రి అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారని కరణ్ తెలిపారు. కానీ ఆ తర్వాత కాలంలో ఇదే షో బాలీవుడ్ సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ సీక్రెట్స్‌ను బయటపెట్టే వేదికగా మారిందని పేర్కొన్నారు.
{{/usCountry}}2004లో తన తండ్రి యశ్ జోహార్‌తో కలిసి ఈ షో ఐడియా గురించి డిస్కస్ చేసిన రోజులను కరణ్ జోహార్ గుర్తు చేసుకున్నారు. మొదట్లో స్నేహితులను పిలిచి కబుర్లు చెబితే ఎవరూ డబ్బులు ఇవ్వరని ఆయన తండ్రి అప్పట్లో అనుమానం వ్యక్తం చేశారని కరణ్ తెలిపారు. కానీ ఆ తర్వాత కాలంలో ఇదే షో బాలీవుడ్ సెలెబ్రిటీల పర్సనల్ లైఫ్ సీక్రెట్స్‌ను బయటపెట్టే వేదికగా మారిందని పేర్కొన్నారు.
{{/usCountry}}తాను ఇండస్ట్రీలోని లవర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీస్‌ని ఈ షోకి పిలిచానని, కొందరు ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారని, మరికొందరు పెళ్లి కూడా చేసుకున్నారని కరణ్ సరదాగా చెప్పుకొచ్చారు. నెపోటిజం లాంటి విమర్శలను తాను ఎప్పుడూ ఎదుర్కొంటూనే ఉన్నానని తెలిపారు. సల్మాన్ ఖాన్ ఒక్కడే కాకుండా ఈ ఫైనల్ సీజన్‌లో షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ వంటి స్టార్లతో పాటు సౌత్ సెలెబ్రిటీలు కూడా గెస్ట్‌లుగా వచ్చే ఛాన్స్ ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి.