Maa Inti Bangaaram: సమంత (Samantha Ruth Prabhu)కు ఉన్న క్రేజ్ ఏంటో డైరెక్టర్ నందినీ రెడ్డి 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. టాలీవుడ్ హిస్టరీలోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తూ సామ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏకంగా 17 ఏళ్ల క్రితం అనుష్క శెట్టి నటించిన 'అరుంధతి' సినిమా క్రియేట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్‌ను మా ఇంటి బంగారం ఇప్పుడు బ్రేక్ చేసేసింది.
బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం

2009లో వచ్చిన అరుంధతి సినిమా టాలీవుడ్‌లో ఫీమేల్-లీడ్ సినిమాలకు ఒక స్టాండర్డ్ సెట్ చేసింది. స్టార్ హీరోల సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద డామినేట్ చేస్తున్న టైమ్‌లో, అనుష్క తన అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్‌తో ఇండస్ట్రీని షేక్ చేసింది. అప్పటినుంచి ఎంతోమంది ట్రై చేసినా ఆ రికార్డ్ బ్రేక్ చేయడం సాధ్యం కాలేదు. ఇప్పుడు సమంత తన యాక్షన్, కామెడీ టైమింగ్‌తో ఆ రికార్డ్‌ను తుడిచిపెట్టేసింది.
జూన్ 19న గ్రాండ్‌గా రిలీజైన మా ఇంటి బంగారం వరల్డ్ వైడ్‌గా రూ. 83 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఇండియాలో రూ. 50 కోట్ల నెట్ వసూళ్లు సాధించి టాలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్-లీడ్ ఫిల్మ్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. మంచి రివ్యూస్, పాజిటివ్ మౌత్ టాక్ రావడంతో ఈ సినిమాకు థియేటర్ల దగ్గర జనాలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను సమంత సొంత ప్రొడక్షన్ హౌస్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. "బంగారం తన హిస్టరీని సువర్ణ అక్షరాలతో రాసుకుంది.. మా ఇంటి బంగారం టాలీవుడ్ ఎవర్ హైయెస్ట్ గ్రాసింగ్ ఫీమేల్-లెడ్ ఫిల్మ్" అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమ ఫేవరెట్ హీరోయిన్ కొట్టిన ఈ భారీ హిట్‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతూ సామ్‌ను క్వీన్, సూపర్ స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
మహానటి, రుద్రమదేవి ఎందుకు కాదు?
అరుంధతి సినిమా అప్పట్లో రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన 'మహానటి' రూ. 75 కోట్లు, గుణశేఖర్ 'రుద్రమదేవి' రూ. 86 కోట్లు కలెక్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆ సినిమాల్లో కీర్తి సురేష్‌కు సపోర్ట్‌గా దుల్కర్, విజయ్ దేవరకొండ.. అలాగే అనుష్కకు సపోర్ట్‌గా అల్లు అర్జున్, రానా లాంటి స్టార్ హీరోల సపోర్ట్ ఉంది. మా ఇంటి బంగారం మాత్రం పక్కాగా సమంత వన్ ఉమన్ షో.
{{/usCountry}}అరుంధతి సినిమా అప్పట్లో రూ. 70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచింది. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన 'మహానటి' రూ. 75 కోట్లు, గుణశేఖర్ 'రుద్రమదేవి' రూ. 86 కోట్లు కలెక్ట్ చేసిన మాట వాస్తవమే. కానీ ఆ సినిమాల్లో కీర్తి సురేష్‌కు సపోర్ట్‌గా దుల్కర్, విజయ్ దేవరకొండ.. అలాగే అనుష్కకు సపోర్ట్‌గా అల్లు అర్జున్, రానా లాంటి స్టార్ హీరోల సపోర్ట్ ఉంది. మా ఇంటి బంగారం మాత్రం పక్కాగా సమంత వన్ ఉమన్ షో.
{{/usCountry}}అయితే సౌత్ ఇండియా లెవల్‌లో చూసుకుంటే మలయాళ హిట్ 'లోకా: చాప్టర్ 1 – చంద్ర' (Lokah: Chapter 1) ఇంకా టాప్ ప్లేస్‌లోనే ఉంది. డొమినిక్ అరుణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో కల్యాణి ప్రియదర్శన్, నస్లెన్ లీడ్ రోల్స్ చేశారు. దుల్కర్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి అన్ టచబుల్ రికార్డ్‌గా నిలిచింది. ఈ రేంజ్ సక్సెస్ వస్తుందని తాము అస్సలు ఊహించలేదని మూవీ టీమ్ సైతం షాక్ అయ్యారు.
ప్రెగ్నెన్సీ టైమ్‌లో కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా సమంత ఈ యాక్షన్ కామెడీ డ్రామాను కంప్లీట్ చేసింది. నందినీ రెడ్డి గ్రిప్పింగ్ నెరేషన్, గుల్షన్ దేవయ్య లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ సపోర్ట్‌తో సినిమా నెక్స్ట్ లెవల్‌కు వెళ్లింది. సామ్ డెడికేషన్‌కు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దక్కుతున్న రిజల్ట్ చూసి ఇండస్ట్రీ వర్గాలు అవాక్కవుతున్నాయి.