...
...
Next Story

Maa Inti Bangaram OTT: సమంత మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్- మరో 5 రోజుల్లోనే- 100 కోట్ల మూవీని ఎందుకు చూడాలంటే?

Maa Inti Bangaram OTT: బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లతో సరికొత్త రికార్డులు సృష్టించిన మా ఇంటి బంగారం ఓటీటీలోకి వచ్చేస్తోంది. సమంత లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ స్ట్రీమింగ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. థియేటర్లలో విడుదలైన నెల రోజుల్లోనే డిజిటల్ స్క్రీన్స్‌పైకి వచ్చేందుకు ఈ చిత్రం సిద్ధమైంది.

Published on: Jul 12, 2026, 18:41:18 IST
Advertisement

Maa Inti Bangaram OTT: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకుంది. జూన్ 19న థియేటర్లలోకి వచ్చి.. కేవలం ఒక సోలో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌గా రూ. 100 కోట్ల గ్రాస్ సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు రెడీ అయ్యింది.

మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్

సమంత మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్-మరో 5 రోజుల్లోనే- థియేటర్లలో 100 కోట్ల బ్లాక్ బస్టర్ (x/JioHotstarTel_)
సమంత మా ఇంటి బంగారం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్-మరో 5 రోజుల్లోనే- థియేటర్లలో 100 కోట్ల బ్లాక్ బస్టర్ (x/JioHotstarTel_)

గత కొన్ని రోజులుగా మా ఇంటి బంగారం సినిమా డిజిటల్ పార్ట్‌నర్ గురించి రకరకాల రూమర్స్ వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఈ చిత్రం సరికొత్త ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) లో జూలై 17 నుంచి అఫీషియల్‌గా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. "ఒక్కొక్కడ్ని కొడతాము చూడు.. ప్రేమతో అబ్బా" అంటూ సమంత క్యారెక్టర్‌కు సంబంధించిన పవర్‌ఫుల్ డైలాగ్‌తో ఈ డిజిటల్ అరైవల్‌ను అధికారికంగా అనౌన్స్ చేశారు.

4 వారాలకు ముందే

సాధారణంగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన పెద్ద సినిమాలకు థియేటర్ల రన్ తర్వాత కనీసం 6 నుంచి 8 వారాల ‘విండో పీరియడ్’ ఉంటుంది. కానీ ‘మా ఇంటి బంగారం’ చిత్రం జూన్ 19న థియేటర్లలో విడుదలై.. కరెక్ట్‌గా 4 వారాలు పూర్తి కాకముందే (జూలై 17న) ఓటీటీలోకి వస్తోంది.

దీనికి ప్రధాన కారణం.. జియోహాట్‌స్టార్ సంస్థ థియేట్రికల్ రిలీజ్‌కు ముందే కుదుర్చుకున్న ‘అర్లీ డిజిటల్ ప్రీమియర్’ ఒప్పందమే. థియేటర్లలో సినిమా బ్లాక్‌బస్టర్ కావడంతో, ఈ విండో పీరియడ్‌ను క్యాష్ చేసుకోవడానికి ఓటీటీ ప్లాట్‌ఫామ్ భారీ ఎత్తున ప్రమోషన్స్ ప్లాన్ చేస్తోంది.

ఓటీటీలో ఎందుకు మిస్ కాకూడదు?

థియేటర్లలో మిస్ అయిన క్లాస్ ఆడియన్స్, ఫ్యామిలీస్.. సమంత పండించిన హోమ్‌లీ సెంటిమెంట్‌ను, గుల్షన్ దేవయ్య నెగటివ్ పర్ఫార్మెన్స్‌ను డిజిటల్ స్క్రీన్స్‌పై ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ఇదొక పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్ కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe