Samantha Weight: తల్లికాబోతున్న ఆనందంలో తేలిపోతున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన ప్రెగ్నెన్సీ ఫేజ్‌పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj Nidimoru)తో పెళ్లి తర్వాత మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత.. సోషల్ మీడియాలో అభిమానులతో జరిపిన ఆస్క్ మీ ఎనీథింగ్ (AMA) సెషన్‌లో తన బరువు పెరగడం, మాతృత్వం తెచ్చే మార్పులపై చాలా ఓపెన్‌గా మాట్లాడారు.
"11 కిలోలు బరువు పెరిగాను" - సమంతా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇన్‌స్టాగ్రామ్ AMA సెషన్‌లో "కొత్తగా అమ్మ అవుతున్న వాళ్లు ఎలా ఉన్నారు?" అని సమంత ప్రయాణం గురించి ప్రశ్నించారు. ఈ క్రమంలో ఒక ఫ్యాన్ "బరువు బాగా పెరుగుతున్నాను" అని రిప్లై ఇవ్వగా, సమంత స్పందిస్తూ "నాకు ఆ ఫీలింగ్ బాగా అర్థమవుతోంది.. నేను కూడా ఇప్పటికే 11 కిలోల బరువు పెరిగాను" అని తన ప్రెగ్నెన్సీ హెల్త్ అప్‌డేట్ షేర్ చేశారు.
మరొక అభిమాని "పిల్లలకు పాలు పట్టడం, వాళ్లను లాలించడం, జోకొట్టడం.. రోజంతా ఇదే సరిపోతోంది" అని కామెంట్ చేయగా.. "అది వింటుంటేనే ఒక ఫుల్ టైమ్ జాబ్ లా అనిపిస్తోంది" అని సమంతా కామెంట్ చేశారు. ఈ ప్రెగ్నెన్సీ జర్నీ తనలో ఒక కొత్త శక్తిని నింపిందని, మొదట్లో భయపడతాననుకున్నాను కానీ ఇప్పుడు చాలా ఎంపవర్డ్‌గా ఫీలవుతున్నానని చెప్పారు.
వియత్నాంలో బేబీమూన్ వెకేషన్ హంగామా
సమంత రీసెంట్‌గా భర్త రాజ్ నిడిమోరుతో కలిసి వియత్నాం వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ బేబీ బంప్‌తో డిన్నర్ డేట్స్‌కు వెళ్లిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రెగ్నెన్సీ గ్లోతో సమంతా మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తోందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మొదటి నుంచి ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే సమంతా, ప్రెగ్నెన్సీ సమయంలో కూడా హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతూ తన ఫ్యాన్స్‌కు స్పూర్తిగా నిలుస్తున్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' నుంచి మొదలైన ప్రేమ కథ
{{/usCountry}}మొదటి నుంచి ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యమిచ్చే సమంతా, ప్రెగ్నెన్సీ సమయంలో కూడా హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవుతూ తన ఫ్యాన్స్‌కు స్పూర్తిగా నిలుస్తున్నారు.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' నుంచి మొదలైన ప్రేమ కథ
{{/usCountry}}సమంత, రాజ్ నిడిమోరు కాంబినేషన్‌లో 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' లాంటి గ్లోబల్ వెబ్ సిరీస్‌లు వచ్చాయి. ఈ ప్రాజెక్ట్‌ల సమయంలో ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో, 2025లో కోయంబత్తూర్ ఇషా యోగా సెంటర్‌లో సాంప్రదాయ యోగిక్ పద్ధతిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
గతంలో నాగ చైతన్యతో విడాకుల తర్వాత తన కెరీర్‌పై ఫోకస్ పెట్టిన సమంతా, రాజ్ నిడిమోరు రూపంలో మళ్లీ ఒక మంచి తోడును కనుగొని కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రారంభించారు.
రూ.100 కోట్ల క్లబ్‌లో 'మా ఇంటి బంగారం'..
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించి, స్వయంగా నిర్మించిన 'మా ఇంటి బంగారం' సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఒక ఫిమేల్ సెంట్రిక్ తెలుగు సినిమా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం టాలీవుడ్‌లో ఇదే తొలిసారి.
ఈ భారీ బాక్సాఫీస్ సక్సెస్ తర్వాతే సమంత తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చిన సమంత.. తల్లి అయిన తర్వాత మళ్లీ సరికొత్త ప్రాజెక్ట్‌లతో గ్రాండ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.