Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంలోకి అడుగుపెట్టబోతుంది. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు, సమంత దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఒక ఇంటర్వ్యూలో తన ప్రెగ్నెన్సీ విశేషాలను పంచుకుంటూ, ఈ క్షణం కోసం తాను ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.
సమంత నిరీక్షణ

తన జీవితంలోని ఈ కొత్త అధ్యాయం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని సమంత పింక్‌విల్లా ఇంటర్వ్యూలో పేర్కొంది.
"ఇది నాకు కచ్చితంగా సరికొత్త, ఎంతో ఉత్సాహభరితమైన అనుభూతి. అయితే ఈ మధుర క్షణం కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో తల్లి కావాలనే బలమైన కోరిక ఉండేది. అందుకే నా జీవితంలోని ఈ కొత్త ప్రయాణానికి నా సర్వస్వాన్ని అంకితం చేస్తా" అని సమంత తన మనసులోని మాటను పంచుకుంది.
బేబీ బంప్ తో
ఇటీవల తను నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా ఘనవిజయం సాధించింది. ఈ మూవీ వేడుకల్లో సమంత బేబీ బంప్‌తో కనిపించగా, ఆ తర్వాత ఆమె ఈ విషయాన్ని అధికారికంగా కన్ఫామ్ చేసింది. గర్భధారణ సమయం తనలో సరికొత్త మార్పులను తీసుకువచ్చిందని సామ్ చెప్పుకొచ్చింది.
కొత్త విషయాలు నేర్చుకుంటూ
"నేను ఎప్పుడూ జీవితంలోని ప్రతి విషయంలోనూ ఎంతో ఉద్వేగంగా, నిబద్ధతతో ఉంటాను. కానీ ఇప్పుడు నాలో ఒక భిన్నమైన, సరికొత్త శక్తి, స్పష్టమైన లక్ష్యం ఉన్నట్లు అనిపిస్తోంది. ఈ సరికొత్త ప్రయాణం కోసం నేను ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా. ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూ, రాబోయే భవిష్యత్తును ఆహ్వానించడానికి సిద్ధమవుతున్నా" అని సమంత ఆనందం వ్యక్తం చేసింది.
సమంత, రాజ్ నిడిమోరుల బంధం
రాజ్ అండ్ డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరు దర్శకత్వంలో సమంత గతంలో ప్రముఖ ఓటీటీ సిరీస్‌లు 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' (2021), 'సిటాడెల్: హనీ బన్నీ' (2024) లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు 2024 లో ఇండస్ట్రీలో హల్ చల్ చేశాయి.
{{/usCountry}}రాజ్ అండ్ డీకే ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరు దర్శకత్వంలో సమంత గతంలో ప్రముఖ ఓటీటీ సిరీస్‌లు 'ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' (2021), 'సిటాడెల్: హనీ బన్నీ' (2024) లో నటించింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందనే వార్తలు 2024 లో ఇండస్ట్రీలో హల్ చల్ చేశాయి.
{{/usCountry}}ఆ తర్వాత 2025 లో సమంత, రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు వీరి బంధాన్ని ఒక క్లారిటీకి వచ్చారు. అదే ఏడాది చివర్లో కోయంబత్తూరులోని ఈశా యోగా కేంద్రంలో అత్యంత వేడుకగా, సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది.
సినిమాలకు చిన్న విరామం
గతంలో మయోసైటిస్ వ్యాధి బారిన పడినప్పుడు సమంత సినిమాలకు లాంగ్ బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెన్సీ కారణంగా ఆమె సినిమాలకు కొద్దిరోజుల పాటు దూరం కానుంది.
"మా ఇంటి బంగారం సినిమా తర్వాత నా ప్రస్తుత పరిస్థితి రీత్యా చిన్న విరామం తీసుకోక తప్పదు. నేను ఇప్పుడు మెటర్నిటీ లీవ్ తీసుకుంటున్నా. ఆ తర్వాత మళ్లీ సరికొత్త సినిమాతో నా అభిమానుల ముందుకు వస్తా" అని సమంత మీడియా ముఖంగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
మా ఇంటి బంగారం రికార్డు
సమంతకు గతంలో హీరో అక్కినేని నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక సమంత నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ సినిమా, టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి మహిళా ప్రధాన (Female-led) చిత్రంగా చరిత్రాత్మక రికార్డు సృష్టించింది.