Samantha: ఇది చూసి నా హృదయం తట్టుకోలేకపోయింది.. వైరల్‌గా సమంత ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ
Samantha: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ గా ఉన్న ఆమె.. ఈ టైమ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే సమంత షేర్ చేసిన ఓ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ తెగ వైరల్ గా మారింది. తన హృదయం తట్టుకోలేకపోయిందంటూ సామ్ పేర్కొవడం విశేషం.
Samantha: తల్లి కాబోతున్న ఆనందంలో ఉన్న సమంత సోషల్ మీడియా వేదికగా పంచుకునే ప్రతి చిన్న విషయమూ నెట్టింట వైరల్‌గా మారుతోంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో హాలీవుడ్ నటుడు బ్రాడ్ పిట్ అప్‌కమింగ్ మూవీ 'హార్ట్ ఆఫ్ ది బీస్ట్' (Heart of the Beast) ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది.

సమంత ఎమోషనల్
అడవిలో విమాన ప్రమాదానికి గురైన ఒక స్పెషల్ ఫోర్స్ ఆఫీసర్, తన రిటైర్డ్ కాంబ్యాట్ డాగ్ 'ఓడిన్' (ఉబెర్ అనే కుక్క) తో కలిసి ప్రాణాలతో బయటపడేందుకు చేసే పోరాటమే ఈ హార్ట్ ఆఫ్ ది బీస్ట్ సినిమా స్టోరీ. తన ఇంట్లో హాష్, సాషా అనే రెండు పెంపుడు కుక్కలతో పాటు జెలాటో అనే పిల్లిని సమంత పెంచుకుంటోంది.
ఈ నేపథ్యంలోనే వీడియోను చూసి ఎమోషనల్ అయింది సామ్. "OMG.. మై హార్ట్ కాంట్ హ్యాండిల్ దిస్" (నా నా హృదయం తట్టుకోలేకపోతోంది) అంటూ ఏడుస్తున్న ఎమోజీలను జత చేసింది.
బేబీ బంప్ ఫొటోలు
దీనితో పాటు నల్లటి అథ్లెజర్ దుస్తుల్లో తన బేబీ బంప్‌ను చూపిస్తూ దిగిన ఫోటోలను కూడా సామ్ షేర్ చేసింది. తన ఆత్మీయ మిత్రులు, ఫ్యాషన్ డిజైనర్ క్రేషా బజాజ్, స్టైలిస్ట్ నీరజా కోనలతో కలిసి సరదాగా కబుర్లు చెబుతున్న ఫోటోలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
రూ.100 కోట్ల బాక్సాఫీస్ రికార్డు
తీవ్రమైన మైయోసైటిస్ (Myositis) ఆటోఇమ్యూన్ వ్యాధితో పోరాడి, కొంతకాలం సినిమాలకు విరామం ప్రకటించిన సమంత.. 'మా ఇంటి బంగారం' చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. నందినీ రెడ్డి దర్శకత్వంలో, రాజ్ నిడిమోరు కథ-స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.
తెలుగు చిత్రసీమ చరిత్రలోనే ఒక లేడీ-ఓరియంటెడ్ (ఫిమేల్-లెడ్) సినిమా ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం సామ్ స్టామిటీని మరోసారి నిరూపించింది.
స్ఫూర్తి నింపే జర్నీ
సమంత కెరీర్, వ్యక్తిగత ప్రయాణాన్ని పరిశీలిస్తే ఆమె చూపించిన ఆత్మస్థైర్యం నేటితరం మహిళలకు ఒక పెద్ద స్పూర్తిగా నిలుస్తుంది. సాధారణంగా టాలీవుడ్‌లో రూ.100 కోట్ల క్లబ్ అనేది కేవలం స్టార్ హీరోల చిత్రాలకే పరిమితమనే భావన ఉండేది. కానీ 'మా ఇంటి బంగారం' చిత్రంతో సమంత ఆ అంచనాలను పటాపంచలు చేసింది. నాణ్యమైన ఎమోషనల్ కంటెంట్‌కు సామ్ ఇమేజ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో ఈ సినిమా చాటింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


