సమంత బిజీబిజీ.. పెళ్లయిన నాలుగు రోజులకే షూటింగ్ మొదలుపెట్టిన బ్యూటీ.. హనీమూన్ లేనట్లే..
సమంత తన రెండో పెళ్లి అయిన నాలుగు రోజులకే మళ్లీ షూటింగ్ లో బిజీ అయిపోయింది. తాను నిర్మించి, లీడ్ రోల్లో నటిస్తున్న మా ఇంటి బంగారం మూవీ షూటింగ్ కు సిద్ధమవుతున్న ఫొటోను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
సమంత రూత్ ప్రభు మళ్లీ షూటింగ్ లలో బిజీ అయింది. డిసెంబర్ 1న ఆమె కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లో రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండో పెళ్లి తర్వాత ఆమె కాస్త గ్యాప్ తీసుకుంటుందేమో అని అనుకున్నా.. సామ్ మాత్రం వెంటనే బిజీగా మారిపోయింది.

మా ఇంటి బంగారం షూటింగ్
సమంత ఈ ఏడాది శుభం మూవీని నిర్మించిన విషయం తెలుసు కదా. అందులో ఆమె అతిథి పాత్రలోనూ నటించింది. ఇక ఇప్పుడు తన ట్రాలాలా బ్యానర్లో మరో సినిమా నిర్మిస్తోంది. నందిని రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పేరు మా ఇంటి బంగారం. ఆ మధ్య పూజా కార్యక్రమాలతో మూవీ మొదలైంది. అందులో రాజ్ నిడిమోరు స్పెషల్ గా కనిపించాడు.
ఇప్పుడతనితో పెళ్లి జరిగిన నాలుగు రోజులకే మళ్లీ ఈ మూవీ షూటింగ్ మొదలుపెట్టింది. ఆ మూవీ టీమ్ తో ఉన్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ.. లెట్స్ గో అనే క్యాప్షన్ ఉంచింది. ఇందులో డైరెక్టర్ నందిని రెడ్డితో ఆమె ఓ ఫన్ మూమెంట్ ను ఎంజాయ్ చేయడం చూడొచ్చు. ఈ అప్డేట్ చూసిన ఫ్యాన్స్.. మరి రాజ్ తో హనీమూన్ లేనట్లేనా అని అడుగుతున్నారు.
సమంత, రాజ్ పెళ్లి, ఫన్నీ పోస్ట్
రాజ్, సమంత పెళ్లి డిసెంబర్ 1న జరిగిన విషయం తెలుసు కదా. ఆ తర్వాత సమంత ఒక చమత్కారమైన కామెంట్ తో ఇన్‌స్టా స్టోరీ పెట్టింది. ఈ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పెళ్లికి సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేసిన సమంత దానికి కాస్త వ్యంగ్యమైన క్యాప్షన్ రాసుకొచ్చింది. ఆ ఫొటోలో రాజ్ నిడిమోరును సమంత నవ్వుతూ చూస్తూ ఉంది. చేతిలో పూలదండ పట్టుకుని నవ్వుతూ కనిపించింది.
"ఇకనుంచి మీరు అతని సమస్య అని మీరు భావించినప్పుడు" అంటూ రాసుకొచ్చిన సమంత పర్పుల్ కలర్‌లో ఉన్న డెవిల్ (రాక్షసి) ఎమోజీని యాడ్ చేసింది. అంటే ఇక నుంచి తాను రాజ్ నిడిమోరుకు తాను ఓ సమస్య, బాధ్యత అని చమత్కారంగా చెప్పింది సమంత.
సమంత డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. ఈ జంట లింగ భైరవ వివాహను ఎంచుకున్నారు. అర్పితా మెహతా డిజైన్ చేసిన ఎరుపు చీరను సమంత కట్టుకుంది. ఇక రాజ్ నిడిమోరు కుర్తా సెట్‌లో గోల్డ్ కలర్ జాకెట్‌ను ధరించాడు.
ఇప్పుడు సమంత, రాజ్ నిడిమోరు రెండో వివాహంతో వీరి బంధంపై పలు విధాలుగా కామెంట్స్ వస్తున్నాయి. ఇద్దరి గతం గురించి చూస్తే.. నాగ చైతన్యను 2017లో పెళ్లి చేసుకున్న సమంత 2021 వరకు కలిసి ఉన్నారు. అనంతరం సమంత, నాగ చైతన్యకు విడాకులు అయ్యాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


