నటి సమంతా రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోవడం ఇప్పుడు ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ 'కృతజ్ఞతతో నిండిపోయాను' అని క్యాప్షన్ ఇవ్వడం వారి మధ్య రొమాన్స్‌పై కొత్త చర్చకు తెరలేపింది. తరచూ కలిసి కనిపిస్తున్న ఈ జంట రిలేషన్షిప్ లో ఉందన్న వార్తలను ఈ మధ్యే సమంత మేనేజర్ కొట్టిపారేసినా.. ఆమె మాత్రం పదే పదే హింట్ ఇస్తూనే ఉంది.
రాజ్‌తో సమంత దీపావళి స్పెషల్

సమంత రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో ప్రేమలో ఉన్నారనే హింట్‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆమె తాజాగా షేర్ చేసిన పోస్ట్‌లో దీపావళి సంబరాలలో రాజ్ తో కలిసి సంతోషంగా నవ్వుతూ కనిపించింది. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఫెస్టివల్ వైబ్స్ ను పంచుతోంది.
సోమవారం (అక్టోబర్ 20) దీపావళి సందర్భంగా సమంత, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరుతో కలిసి ఉన్న పండగ స్నాప్‌షాట్‌లను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఓ సాంప్రదాయ ఔట్‌ఫిట్‌లో చాలా అందంగా కనిపించింది సమంత. నీలి రంగు కుర్తా వేసుకున్న రాజ్ పక్కనే కూర్చుని ఈ దీపాల పండుగను జరుపుకుంది.
అంతేకాదు వాళ్ల ఫ్యామిలీతో కలిసి టపాసులు కాల్చిన ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ఆమె చాలా ఉత్సాహంగా కనిపించింది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు రకరకాలుగా స్పందించారు. ఒక అభిమాని స్పందిస్తూ.. సామ్ నువ్వు, మీ ఫ్యామిలీ అంటే మాకు ఇష్టం అని రాశారు. మరొకరు కామెంట్ చేస్తూ.. నా ప్రియమైన సమంతకు.. నీ కెరీర్, పర్సనల్ లైఫ్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా. సంతోషంగా ఉండు అని అన్నారు.
సమంత, రాజ్ డేటింగ్ రూమర్స్
సమంత, రాజ్ కలిసి ది ఫ్యామిలీ మ్యాన్, సిటడెల్: హనీ బన్నీలాంటి వెబ్ సిరీస్‌లకి పనిచేశారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్యే ఏదో ఉందన్న పుకార్లు మొదలయ్యాయి. ఇద్దరూ ఈ పుకార్లను ఇప్పటివరకు ధృవీకరించలేదు ఖండించనూ లేదు. అయితే తరచుగా కలిసి కనిపిస్తూ ఉండడం వల్లే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.
{{/usCountry}}సమంత, రాజ్ కలిసి ది ఫ్యామిలీ మ్యాన్, సిటడెల్: హనీ బన్నీలాంటి వెబ్ సిరీస్‌లకి పనిచేశారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్యే ఏదో ఉందన్న పుకార్లు మొదలయ్యాయి. ఇద్దరూ ఈ పుకార్లను ఇప్పటివరకు ధృవీకరించలేదు ఖండించనూ లేదు. అయితే తరచుగా కలిసి కనిపిస్తూ ఉండడం వల్లే వీరిద్దరిపై డేటింగ్ రూమర్స్ మొదలయ్యాయి.
{{/usCountry}}అంతేకాదు ఇటీవల వీరు కలిసి ఉండటానికి ప్లాన్ చేస్తున్నారనే రిపోర్ట్స్ కూడా వచ్చాయి. పింక్‌విల్లా ఒక సోర్స్‌ను ఉటంకిస్తూ.. "సమంత, రాజ్ కలిసి మూవ్ ఇన్ కావాలని ఆలోచిస్తున్నారు. దానికోసం ప్రాపర్టీస్ కూడా చూస్తున్నారు. కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు" అని పేర్కొంది.
ఆ సోర్స్ ఇంకా ఏం చెప్పిందంటే.. "సిటడెల్ కోసం కలిసి పనిచేసిన తర్వాత 2022 లో రాజ్ తన భార్య షామిలితో అఫీషియల్‌గా విడాకులు తీసుకుని, సమంతకు దగ్గరయ్యాడు. రాజ్ తన కూతురితో కనిపించాడనే వార్తలు అబద్ధం. అతనికి కూతురు లేదు. అతనితో కనిపించిన చిన్నారి అతని కో-డైరెక్టర్ కృష్ణ డీకే కూతురు" అని వివరించింది.
అయితే ఈ వార్తలపై సమంత మేనేజర్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడారు. కేవలం ఒక్క మాటతో దానికి చెక్ పెట్టారు. అవన్నీ పుకార్లు అని తేల్చి చెప్పారు. రాజ్ గతంలో రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా, విశాల్ భరద్వాజ్ వంటి దర్శకులతో పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ షామలీ డేని వివాహం చేసుకున్నాడు.