...
...
Next Story

Samantha Raj Nidimoru: తన ‘ఫ్యామిలీ మ్యాన్’ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సమంత.. ఇన్‌సైడ్ ఫొటోలు చూశారా?

Samantha Raj Nidimoru: తన ఫ్యామిలీ మ్యాన్ రాజ్ నిడిమోరు బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది సమంత. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన ఆమె.. వీటిలో ఒక వీడియోలో నవ్వినవ్వి కళ్లలో నుంచి నీళ్లు రావడం చూడొచ్చు.

Published on: Aug 10, 2026, 16:00:48 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Samantha Raj Nidimoru: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తన భర్త, ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ప్రైవేట్ పిక్చర్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆగస్ట్ 4న రాజ్ బర్త్‌డే జరగ్గా, ఆ సమయంలో ఎలాంటి హంగామా చేయకుండా సైలెంట్‌గా ఉన్న సమంత, తాజాగా తన 'ఆగస్ట్ డంప్' పేరుతో ఇన్‌సైడ్ సెలబ్రేషన్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.

Samantha Raj Nidimoru: తన ‘ఫ్యామిలీ మ్యాన్’ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సమంత.. ఇన్‌సైడ్ ఫొటోలు చూశారా?
Samantha Raj Nidimoru: తన ‘ఫ్యామిలీ మ్యాన్’ బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసిన సమంత.. ఇన్‌సైడ్ ఫొటోలు చూశారా?

బర్త్‌డే వేడుకల్లో భాగంగా రాజ్ నిడిమోరు పక్కన నల్లటి డ్రెస్‌లో కూర్చున్న సమంత ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కేక్ కట్ చేయడానికి బదులుగా "హ్యాపీ బర్త్‌డే ది ఫ్యామిలీ మ్యాన్" అని రాసి ఉన్న ఒక స్పెషల్ డెజర్ట్ ప్లేట్‌ను వారు సిద్ధం చేయడం విశేషం.

ఆగస్ట్ డంప్.. కంటతడి పెట్టిన సమంత

ఇన్‌స్టాగ్రామ్‌లో "ఆగస్ట్ ఎనర్జీ" అంటూ తెల్లటి లవ్ ఎమోజీలతో సమంత పోస్ట్ చేసిన ఈ సిరీస్‌లో కేవలం బర్త్‌డే పిక్స్ మాత్రమే కాకుండా ఆమె పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన అనేక క్యూట్ మోమెంట్స్ ఉన్నాయి. జిమ్‌లో తీవ్రంగా వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలతో పాటు ఫ్యాషన్ షూట్స్, ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలను సమంత షేర్ చేసింది.

కార్‌లో వెళ్తూ నవ్వు ఆపుకోలేక కళ్ల వెంట నీళ్లు తెచ్చుకుంటున్న ఒక సరదా వీడియో కూడా ఈ పోస్ట్‌లో ఉంది. ఇవన్నీ ఆనంద భాష్పాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ప్రెగ్నెన్సీ జర్నల్.. తల్లి కాబోతున్న సమంత

ప్రస్తుతం తన మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత.. ఈ ఆగస్ట్ డంప్‌లో తన 'ప్రెగ్నెన్సీ జర్నల్' గ్లింప్స్‌ను కూడా చూపించింది. తన ముద్దుల పెట్స్ హ్యాష్, సాషాలతో కలసి ఉన్న పిక్చర్స్‌తో పాటు 'ఇనా మేస్ గైడ్ టు చైల్డ్‌బర్త్' అనే పుస్తకం చదువుతున్న ఫొటోను పంచుకుంది.

సమంత, రాజ్ నిడిమోరు కాంబినేషన్‌లో వచ్చిన ఓటీటీ సిరీస్‌లు 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'మా ఇంటి బంగారం' సినిమాతో వీరి కాంబో బాక్సాఫీస్ దగ్గర హిస్టరీ క్రియేట్ చేసింది.

సమంత స్వయంగా తన 'ట్రాలా లా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి రాజ్ నిడిమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. జూన్ 19న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, తెలుగు సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ఫిమేల్ లీడ్ మూవీగా రికార్డులకెక్కింది.

ఈ సినిమా సక్సెస్ మీట్ అనంతరం తామిద్దరం కలిసి తమ మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నామని సమంత అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. కోయంబత్తూర్ ఇషా యోగా సెంటర్‌లో సాంప్రదాయ యోగిక్ పద్ధతిలో వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఈ జోడీ.. ఇప్పుడు కెరీర్‌ పరంగా, పర్సనల్ లైఫ్ పరంగా పీక్ స్టేజ్‌ను ఎంజాయ్ చేస్తోంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe