Samantha Morning Routine: మీ జీవితాన్నే మార్చేసే సమంత మార్నింగ్ రొటీన్.. ఉదయాన్నే ఈ 8 పనులు చేయండంటూ వీడియో రిలీజ్
Samantha Morning Routine: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన జీవితాన్ని మార్చేసిన 'పవర్ మార్నింగ్' సీక్రెట్స్‌ను పంచుకుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గాలన్నా, చర్మ సమస్యలు దూరమవ్వాలన్నా ఉదయాన్నే చేసే ఈ 8 పనులు ఎంతో కీలకమని ఆమె వివరించింది.
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు తన అద్భుతమైన ఫిట్‌నెస్, గ్లోయింగ్ స్కిన్ వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టింది. రోజును సరైన పద్ధతిలో ప్రారంభించడం ఎంత ముఖ్యమో వివరిస్తూ.. తన జీవితంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఒక సులభమైన "పవర్ మార్నింగ్" (Power Morning) రొటీన్‌ను ఆమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. మన రోజువారీ ఉదయం అలవాట్లే ఆ రోజంతా మనం ఎంత ఉత్సాహంగా ఉంటామనేది నిర్ణయిస్తాయని సమంత స్పష్టం చేసింది.

మార్నింగ్ రొటీన్ ఎందుకు ముఖ్యం?
చాలామంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పొట్ట దగ్గరి కొవ్వు (Belly Fat) తగ్గకపోవడం, తరచూ చర్మ సమస్యలు రావడం లేదా ఉదయాన్నే ముఖం ఉబ్బినట్లు అనిపించడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. వీటన్నింటికీ మనం రోజును ప్రారంభించే విధానమే ప్రధాన కారణం కావచ్చని సమంత అభిప్రాయపడింది.
"నేను ఎన్నో రకాల మార్నింగ్ రొటీన్లను ప్రయత్నించాను. చివరకు నాకు అద్భుతంగా పనిచేసే ఒక సింపుల్ ఫార్ములాను కనుగొన్నాను. అదే నా 'పవర్ మార్నింగ్'. మీరు ప్రతిదీ కరెక్ట్‌గా చేస్తున్నా ఫలితం లేకపోతే, ఒక్కసారి మీ ఉదయం అలవాట్లను మార్చుకోవాల్సిన సమయం వచ్చిందని గుర్తించండి" అని ఆమె పేర్కొంది.
ఒత్తిడిని తగ్గించుకోండి ఇలా..
మనం నిద్రలేవగానే మన శరీరంలో 'కార్టిసాల్' (Cortisol) అనే ఒత్తిడి హార్మోన్ స్థాయిలు సహజంగానే ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలోనే మనం ఫోన్లు చూడటం, ఈమెయిల్స్ చెక్ చేయడం లేదా వార్తలు చదవడం వల్ల ఆ ఒత్తిడి రెట్టింపు అవుతుందని సమంత హెచ్చరించింది. దీనివల్ల రోజంతా ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, అనారోగ్యకరమైన ఆహారంపై కోరికలు పెరుగుతాయని వివరించింది.
సమంత సూచించిన 8 'పవర్ మార్నింగ్' సూత్రాలు
నో ఫోన్ రూల్: నిద్రలేచిన మొదటి గంట సేపు మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉండాలి.
శ్వాసక్రియ: కనీసం ఐదు నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని లోతైన శ్వాస తీసుకోవాలి. ఇది మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. లోతైన శ్వాస వేగస్ నరాలను ఉత్తేజితం చేసి, మెదడుకు మనం సురక్షితంగా ఉన్నామనే సంకేతాన్ని పంపిస్తుంది. తద్వారా శరీరం కొవ్వును వేగంగా కరిగిస్తుంది.
సూర్యరశ్మి: నిద్రలేచిన 10 నిమిషాల్లోపు ముఖంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి.
మార్నింగ్ ఎలిక్సిర్: ఉదయాన్నే ఒక ఆరోగ్యకరమైన పానీయం (Elixir) తీసుకోవాలి.
సమతుల ఆహారం: రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండేలా పోషక విలువలున్న అల్పాహారం తీసుకోవాలి. దీనివల్ల రోజంతా స్వీట్లు, జంక్ ఫుడ్ తినాలనే కోరిక కలగదు.
శారీరక శ్రమ: ఉదయం 11 గంటల లోపు వ్యాయామం లేదా కనీసం ఏదో ఒక శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి.
టీ/కాఫీ: అల్పాహారం తీసుకున్న తర్వాతే టీ లేదా కాఫీ తాగాలి.
లక్ష్యం నిర్దేశం: ఆ రోజు మీరు ఏం సాధించాలనుకుంటున్నారో ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకుని, దాన్ని ఒక చోట రాసి పెట్టుకోండి. ఇది మీ మెదడును అనవసరమైన విషయాల వైపు మళ్లకుండా ఏకాగ్రతతో ఉంచుతుంది.
21 రోజుల సవాల్
ఈ అలవాట్లను కనీసం 21 రోజుల పాటు నిరంతరాయంగా పాటించాలని సమంత తన ఫాలోవర్లకు సూచించింది. "ఈ రొటీన్‌ను అలవర్చుకోవడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది. కానీ ఇది నా జీవితాన్ని వర్ణించలేనంతగా మార్చేసింది. ప్రారంభంలో కాస్త కష్టంగా అనిపించినా పట్టు వదలకుండా ప్రయత్నించండి. మన జీవితాన్ని మనం ఎలా మలుచుకోవాలో మనకే అర్థమవుతుంది" అని ఆమె స్ఫూర్తిని నింపింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


