నటి సమంత రూత్ ప్రభు, ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూర్‌లో జరిగిన యోగిక్ వివాహ వేడుకలో ఒక్కటయ్యారు. తమ పెళ్లి తర్వాత వారు తమ స్నేహితుల కోసం ఇంట్లో ఒక విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో నటి తమన్నా భాటియా కూడా పాల్గొనడం విశేషం. ఆ సాయంత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.
సమంత, రాజ్ క్రిస్మస్ పార్టీ

సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన క్రిస్మస్ ట్రీ, డెకరేషన్ కు సంబంధించిన ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ.. "నేను నిజంగానే ఈ క్రిస్మస్ డెకరేషన్‌ని పక్కన పెట్టాలా" అని రాసుకొచ్చింది. ఆ ఫోటోలో ఆమె తన ఇంటికి క్రిస్మస్ కోసం అందంగా అలంకరించింది.
ఆమె షేర్ చేసిన మరో ఫోటోలో.. సమంత, ఆ క్రిస్మస్ ట్రీ ముందు నిలబడి ఫోటోలకు పోజులివ్వడం చూడవచ్చు. వారితో పాటు తమన్నా, వారి ఇతర స్నేహితులు కూడా ఉన్నారు. అది ఇంట్లో జరిగిన ఒక ఈవెంట్ పార్టీలా కనిపిస్తోంది.
సమంత రూత్ ప్రభు, రాజ్ నిడిమోరు గురించి..
సమంత.. రాజ్ అండ్ డీకేలతో కలిసి 2021లో వచ్చిన ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2', 2023లో వచ్చిన 'సిటాడెల్: హనీ బన్నీ' కోసం పనిచేసింది. ఆమె 2021లో నాగ చైతన్యతో విడాకులు తీసుకుకుంది. రాజ్ తన భార్య శ్యామలీ దే నుండి ఎప్పుడు విడిపోయారనేది తెలియదు.
2023లో సమంత, రాజ్ డేటింగ్‌లో ఉన్నారనే పుకార్లు మొదలయ్యాయి, అయినప్పటికీ వారు దానిని ఎప్పుడూ ధృవీకరించలేదు. 2024లో వారు సహజీవనం చేస్తున్నారనే ఊహాగానాలు వచ్చినప్పుడు, ఆమె టీమ్ దానిని ఖండించింది. అయినా ఈ జంట ఈవెంట్లలో, ఆమె సోషల్ మీడియా ఫోటోలలో కలిసి కనిపించడం ప్రారంభించారు.
డిసెంబర్ 1, 2025న సమంత సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ రోజు ఉదయం ఈషా ఫౌండేషన్‌లో వాళ్లు పెళ్లి చేసుకున్నారనే పుకార్లను ధృవీకరించింది. ఈ పెళ్లికి వారి కుటుంబాలు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు.
రాబోయే ప్రాజెక్టులు
{{/usCountry}}డిసెంబర్ 1, 2025న సమంత సోషల్ మీడియాలో తమ పెళ్లి ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ రోజు ఉదయం ఈషా ఫౌండేషన్‌లో వాళ్లు పెళ్లి చేసుకున్నారనే పుకార్లను ధృవీకరించింది. ఈ పెళ్లికి వారి కుటుంబాలు, సన్నిహిత మిత్రులు హాజరయ్యారు.
రాబోయే ప్రాజెక్టులు
{{/usCountry}}రాజ్ అండ్ డీకే ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ కోసం 'రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్' అనే వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది. సమంత 2025లో తన నిర్మాణ సంస్థ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' బ్యానర్ పై 'శుభం' సినిమాను నిర్మించింది. ఇప్పుడు అదే బ్యానర్లో లీడ్ రోల్లో మా ఇంటి బంగారం అనే తెలుగు సినిమా చేస్తోంది. దీనిని నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోంది.