...
...
Next Story

సమంత పెళ్లి ఫొటోలు చూశారా? డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలు షేర్ చేసిన నటి

సమంత రూత్ ప్రభు రెండో పెళ్లి చేసుకుంది. ఎన్నాళ్లుగానో వస్తున్న వార్తలను కన్ఫమ్ చేస్తూ ఆమె డైరెక్టర్ రాజ్ నిడిమోరునే పెళ్లాడింది. అతనితో రింగులు మార్చుకున్న ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.

Published on: Dec 1, 2025, 14:09:38 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

అఫీషియల్.. సమంత రెండో పెళ్లి చేసుకుంది. ఈ సింపుల్ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమెనే తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సోమవారం (డిసెంబర్ 1) తమిళనాడు కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో డైరెక్టర్ రాజ్ నిడిమోరును ఆమె పెళ్లాడింది.

సమంత రెండో పెళ్లి ఫొటోలు

సమంత పెళ్లి ఫొటోలు చూశారా? డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలు షేర్ చేసిన నటి
సమంత పెళ్లి ఫొటోలు చూశారా? డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకున్న ఫొటోలు షేర్ చేసిన నటి

సమంత రెండో పెళ్లి చేసుకుందన్న వార్తల నేపథ్యంలో దానిని కన్ఫమ్ చేస్తూ ఆమెనే ఆ పెళ్లి ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఇవాళ్టి డేట్ డిసెంబర్ 1, 2025ను క్యాప్షన్ గా ఉంచుతూ ఆమె ఈ ఫొటోలు షేర్ చేయడం విశేషం. ఈ ఫొటోలు వెంటనే వైరల్ గా మారాయి. పాయల్ రాజ్‌పుత్, రుహానీ శర్మ, అనుపమ పరమేశ్వరన్ తోపాటు ఎంతో మంది అభిమానులు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పారు.

ఈ ఫొటోల్లో రాజ్, సమంత ఎంతో ఆనందంగా కనిపించారు. ఓ ఫొటోలో గుడిలో ప్రత్యేక పూజలు, మరో ఫొటోలో రింగులు మార్చుకోవడం, ఇంకో ఫొటోలో ఇద్దరూ కలిసి ఆనందంగా గుడి నుంచి బయటకు వస్తుండటం చూడొచ్చు.

సమంత, రాజ్ నిడిమోరు పెళ్లి సోమవారం (డిసెంబర్ 1) ఉదయం తమిళనాడులోని ఈషా యోగా సెంటర్ లోని లింగ భైరవి ఆలయంలో జరిగింది. ఈ వివాహానికి సుమారు 30 మంది అతిథులు హాజరైనట్లు సమాచారం. పెళ్లి కోసం సమంత ఎరుపు రంగు చీర కట్టుకోగా.. రాజ్ సింపుల్ కుర్తా, పైజామా, వాస్కోట్ ధరించాడు.

తాను ఆరాధించే దేవుడి సన్నిధిలోనే..

2024 ప్రారంభంలోనే రాజ్, సమంతల రిలేషన్ షిప్ పై ఊహాగానాలు మొదలయ్యాయి. గత ఏడాదిగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలలో రాజ్ చిత్రాలను పోస్ట్ చేస్తూ వస్తోంది. వీళ్లు బయట వెకేషన్లో కూడా ఎంజాయ్ చేశారు. గతంలో సమంత నటుడు నాగ చైతన్యను వివాహం చేసుకుంది. అయితే వారు వివాహం చేసుకున్న నాలుగు సంవత్సరాల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత చైతన్య.. నటి శోభితా ధూళిపాళను వివాహం చేసుకున్నారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe