Samantha OTT: ఓటీటీలో సమంత క్రేజీ ప్రాజెక్ట్.. ప్రెగ్నెన్సీ అనౌన్స్‌మెంట్ తర్వాత లేడీ సూపర్ స్టార్ సరికొత్త ఛాప్టర్!
Samantha OTT: ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది సమంత. బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపిన ఈ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఓటీటీలో మరో ప్రయోగానికి సిద్ధమైంది. మెటర్నిటీ బ్రేక్‌కు తీసుకుంటానని చెప్పిన సమంత నుంచి ఈ కొత్త అనౌన్స్‌మెంట్ రావడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
Samantha OTT: సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లేడీ సూపర్ స్టార్ సమంత (Samantha) ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉంది. ఒకవైపు కమర్షియల్ సినిమాలు, మరోవైపు సొంత నిర్మాణ సంస్థలో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూనే.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కూడా తన ఇంపాక్ట్ చూపిస్తోంది. తాజాగా ఓటీటీలో మరో ప్రయోగానికి సిద్ధమైంది సామ్?

ఓటీటీలో సమంత
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి అంతర్జాతీయ స్థాయి సిరీస్‌లతో ఓటీటీ క్వీన్‌గా మారిన సమంత, తాజాగా డిజిటల్ దునియాలో మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం సోనీ లివ్ (SonyLIV) తమిళ్ విభాగంలో ఒక భారీ ఒరిజినల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతోంది.
బిగ్ అనౌన్స్ మెంట్
సోనీ లివ్ తమిళ్ ఓటీటీలో సమంత ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. అయితే ఇందులో సమంత లీడ్ రోల్ ప్లే చేస్తుందా లేదా హోస్ట్‌గా వ్యవహరిస్తుందా? అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే ట్రేడ్ వర్గాల ఇన్ సైడ్ సమాచారం ప్రకారం, సమంత ఈ ప్రాజెక్ట్ ద్వారా తమిళంలో ఒక గ్రాండ్ సెలబ్రిటీ టాక్ షో హోస్ట్ చేయడమే కాకుండా, తన సొంత బ్యానర్‌పై దీనికి నిర్మాణ భాగస్వామిగా కూడా వ్యవహరించే అవకాశం ఉంది.
సమంత పోస్ట్
ఈ సరికొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్‌కు సంబంధించి సమంత తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో లో ఓ పోస్టు చేసింది. తన జీవితంలో వస్తున్న మార్పులను ఉద్దేశిస్తూ ఆమె రాసుకొచ్చిన వ్యాఖ్యలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.
"మార్పును స్వీకరించడం, ప్రయాణాన్ని నమ్మడం, కొత్త ఆరంభాలకు స్వాగతం పలకడం వంటి విషయాలను ఈ ఏడాది నాకు గుర్తు చేసింది. సోనీ లివ్ తమిళ్‌తో కలిసి ఈ కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మేం ఎంతో ఆసక్తికరమైన ఒక స్క్రిప్ట్‌పై వర్క్ చేస్తున్నాం. త్వరలోనే దానికి సంబంధించిన మరిన్ని వివరాలను మీ అందరితో పంచుకోవడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను" అని సామ్ తెలిపింది.
మా ఇంటి బంగారం జోరు
నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద రూ.90 కోట్లకు పైగా వసూళ్లతో నాన్-థియేట్రికల్ అండ్ థియేట్రికల్ రికార్డులను తిరగరాసింది. ఈ చిత్రం సక్సెస్ మీట్ లోనే సమంత తాను ప్రెగ్నెంట్ అని, తన భర్త.. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరు (రాజ్ & డీకే)తో కలిసి మొదటి బిడ్డను స్వాగతించేందుకు మెటర్నిటీ బ్రేక్ తీసుకుంటున్నట్లు అధికారికంగా క్లారిటీ ఇచ్చింది.
టాక్ షోనా?
గతంలో ఆహా ఓటీటీలో సమంత హోస్ట్ చేసిన ‘సామ్ జామ్’ టాక్ షో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు సోనీ లివ్ తమిళ్ టాక్ షో కోసం ప్రెగ్నెన్సీ సమయంలోనే కొన్ని ఎపిసోడ్స్ ముందే షూట్ చేస్తారా లేదా బ్రేక్ ముగిసిన తర్వాత చేస్తారా అనే సస్పెన్స్ నెలకొంది. మరోవైపు నెట్‌ఫ్లిక్స్ లో ఆమె నటించిన ఫాంటసీ యాక్షన్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌డమ్’ కూడా త్వరలోనే స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


