సమంత రూత్ ప్రభు రెండేళ్ల తర్వాత మరోసారి ఓ పూర్తి స్థాయి తెలుగు సినిమా చేస్తోంది. ఈ మూవీ పేరు మా ఇంటి బంగారం. ఈ మూవీ షూటింగ్ సోమవారం (అక్టోబర్ 27) ప్రారంభమైంది. పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇందులో డైరెక్టర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ గా భావిస్తున్న రాజ్ నిడిమోరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
సమంత కొత్త సినిమా

సమంత నటించిన ఖుషీ మూవీ 2023లో రిలీజైంది. ఆ తర్వాత మధ్య తానే నిర్మించిన శుభం సినిమాలో అతిథి పాత్రలో కనిపించిన ఆమె.. రెండేళ్ల తర్వాత మా ఇంటి బంగారం మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తిరిగొస్తోంది. ఈ సినిమాను కూడా సమంతకే చెందిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మిస్తుండటం విశేషం.
ఈ సినిమా షూటింగ్ సోమవారం (అక్టోబర్ 27) పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. “అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో మా ఇంటి బంగారం ముహూర్తపు షాట్ తో మా ప్రయాణం మొదలైంది. మేము ఏం క్రియేట్ చేస్తున్నామో మీతో పంచుకోవడానికి చాలా ఆతృతగా ఉన్నాను. ఈ స్పెషల్ మూవీని ప్రారంభిస్తున్న వేళ మీ అందరి ప్రేమ, మద్దతు కావాలి” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.
బేబీ మూవీ తర్వాత డైరెక్టర్ నందిని రెడ్డితో సమంత మరోసారి చేతులు కలిపింది. ఈ ఇద్దరి కాంబినేషన్ లోనే ఇప్పుడు మా ఇంటి బంగారం వస్తోంది. చాలా రోజుల కిందటే ఈ సినిమా గురించి సామ్ వెల్లడించింది. మొత్తానికి ఇప్పుడు ముహూర్తపు షాట్ తో కొత్త జర్నీని సమంత ప్రారంభించింది.
సమంతతోనే రాజ్ నిడిమోరు
అయితే ఈమధ్య సమంత ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటే ఉంటున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఈ మూవీ షూటింగ్ ప్రారంభానికి కూడా వచ్చాడు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. క్లాప్ కూడా ఇవ్వడం విశేషం. ఈ మధ్యే సమంత కూడా రాజ్ ఫ్యామిలీతోనే దీపావళి సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు రాజ్ తో తాను కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూనే ఉంది.
{{/usCountry}}అయితే ఈమధ్య సమంత ఎక్కడికి వెళ్లినా ఆమె వెంటే ఉంటున్న డైరెక్టర్ రాజ్ నిడిమోరు ఈ మూవీ షూటింగ్ ప్రారంభానికి కూడా వచ్చాడు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్నాడు. క్లాప్ కూడా ఇవ్వడం విశేషం. ఈ మధ్యే సమంత కూడా రాజ్ ఫ్యామిలీతోనే దీపావళి సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాదు రాజ్ తో తాను కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూనే ఉంది.
{{/usCountry}}దీంతో ఈ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఇక కన్ఫమ్ అయినట్లే.. అధికారికంగా ప్రకటించడమే తరువాయి అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక సమంత ఈ మా ఇంటి బంగారం సినిమాతోపాటు అటు రాజ్ తోపాటు డీకే డైరెక్ట్ చేస్తున్న రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లతోనే ఆమె గతంలో ఫ్యామిలీ మ్యాన్ 2, సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ లు చేసింది.