OTT Malayalam: తెలుగులో ఓటీటీలోకి వచ్చిన మలయాళం సూపర్ హిట్ మిస్టరీ థ్రిల్లర్.. అడవిలో అంతుచిక్కని రహస్యాలు.. టైమ్ లూప్

OTT Malayalam: మలయాళం సినిమాలు అంటే తెలుగు ఆడియన్స్ లో ఉండే క్రేజే వేరు. అలాంటి మలయాళం సినిమా, అది కూడా మిస్టరీ థ్రిల్లర్ అంటే చూడకుండా వదులుతారా? ఇవాళ ఓటీటీలోకి అలాంటి సినిమానే వచ్చేసింది. 

Apr 15, 2026, 09:10:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

OTT Malayalam: ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు, సరికొత్త ఎక్స్ పీరియన్స్ అందించేందుకు మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చేసింది. ‘సంభవం అధ్యాయం ఒన్ను’ సినిమా ఇవాళ (ఏప్రిల్ 15) ఓటీటీలోకి అడుగుపెట్టింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ మూవీ థ్రిల్ కలిగించడం ఖాయమనే కామెంట్లు వస్తున్నాయి.

ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ (x)
ఓటీటీలోకి మలయాళం మిస్టరీ థ్రిల్లర్ (x)

సంభవం అధ్యాయం ఒన్ను

ఓటీటీలోకి ఈ రోజు మిస్టరీ థ్రిల్లర్ ‘సంభవం అధ్యాయం ఒన్ను’ వచ్చేసింది. డిజిటల్ స్ట్రీమింగ్ లో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఈ మలయాళ టైమ్ లూప్ మిస్టరీ థ్రిల్లర్ దూసుకొచ్చింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ లో ‘సంభవం అధ్యాయం ఒన్ను’ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

తెలుగులోనూ

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ‘సంభవం అధ్యాయం ఒన్ను’ సినిమాను తెలుగు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో ఓటీటీలో రిలీజ్ అయింది. తెలుగు ఆడియన్స్ నూ ఎంటర్ టైన్ చేసేందుకు మన భాషలోనూ డెబ్యూ చేసింది.

బ్లాక్ బస్టర్

‘సంభవం అధ్యాయం ఒన్ను’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మార్చి 6న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్ తో మంచి రిజల్ట్ సాధించింది. ఈ సినిమాకు జీతూ సతీషన్ డైరెక్టర్. ఈ ‘సంభవం అధ్యాయం ఒన్ను’ చిత్రంలో అస్కర్ అలీ, వినీత్ కుమార్, అస్సిమ్ జమాల్, సిద్ధార్థ్ భరత్ తదితరులు నటించారు.

కథ ఏమిటంటే?

‘సంభవం అధ్యాయం ఒన్ను’ సినిమాను డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కించారు. ఇందులో సస్పెన్స్, మిస్టరీ, టైమ్ లూప్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ను అలరిస్తాయి. థియేటర్లలో ఈ మూవీ సక్సెస్ కు ఇదే ప్రధాన కారణం. ప్రేక్షకులు విభిన్న అనుభూతి అందించడంలో ఈ మూవీ విజయవంతమైంది.

మిస్సింగ్ కేసులు

కేరళ, తమిళనాడు సరిహద్దులోని అడవిలో మిస్సింగ్ కేసులు నమోదవుతుంటాయి. కనిపించకుండా పోయిన తమ సహచరుడి కోసం అక్కడికి వెళ్లిన పోలీసులకు వింత అనుభవం ఎదురవుతుంది. ఓ టైమ్ లూప్ లో చిక్కుకొని, తమను తామే వేర్వేరు వెర్షన్లలో చూసుకొని షాకవుతారు.

సంభవం అధ్యాయం ఒన్ను ఒక ఆసక్తికరమైన టైమ్ లూప్ థ్రిల్లర్. ఒకే సంఘటన చుట్టూ తిరిగే కాలచక్రాన్ని, అందులోని మిస్టరీని ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మరి అడవిలోకి వెళ్లిన పోలీసులకు ఏం జరిగింది? ఎందుకు లూప్ లో చిక్కుకుపోతారన్నదే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More