Sameera Reddy: నల్లగా ఉన్నానని భారీగా మేకప్ వేసే వాళ్లు.. 20 ఏళ్లుగా ప్యాడెడ్ బ్రాలు వేసుకున్నా: సమీరా రెడ్డి ఆవేదన

Sameera Reddy: సమీరా రెడ్డి గుర్తుందా? ఒకప్పుడు చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ల సరసన నటించిన ఆమె.. బాలీవుడ్ లో తనకు ఎదురైన బాడీ షేమింగ్ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఈమధ్యే సంజయ్ దత్ తో కలిసి ఆఖ్రీ సవాల్ అనే మూవీతో కంబ్యాక్ ఇచ్చింది.

Published on: Jul 18, 2026, 09:01:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sameera Reddy: బాలీవుడ్ లో నటించిన తొలి మూవీలోనే తాను తీవ్రమైన శరీర రంగు వివక్ష, బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని సీనియర్ నటి సమీరా రెడ్డి సంచలన నిజాలు బయటపెట్టింది. సోహైల్ ఖాన్ హీరోగా వచ్చిన 'మైనే దిల్ తుజ్కో దియా' టైమ్‌లో తన స్కిన్ టోన్ కంటే మూడు షేడ్స్ తక్కువ ఉన్న ఫౌండేషన్ వాడమన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్ అంటే కచ్చితంగా తెల్లగా ఉండాలనే రూల్స్ పెట్టడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పింది.

Sameera Reddy: నల్లగా ఉన్నానని భారీగా మేకప్ వేసే వాళ్లు.. 20 ఏళ్లుగా ప్యాడెడ్ బ్రాలు వేసుకున్నా: సమీరా రెడ్డి ఆవేదన
Sameera Reddy: నల్లగా ఉన్నానని భారీగా మేకప్ వేసే వాళ్లు.. 20 ఏళ్లుగా ప్యాడెడ్ బ్రాలు వేసుకున్నా: సమీరా రెడ్డి ఆవేదన

తెల్లగా చూపించడానికి బాడీ మేకప్!

రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓపెన్ అయింది. తన ఫస్ట్ సినిమా షూటింగ్ టైమ్‌లో ముఖానికి వేసిన తెల్లటి మేకప్‌తో మ్యాచ్ అవ్వడం కోసం బాడీ మొత్తానికి మేకప్ వేసేవారని గుర్తుచేసుకుంది.

ఆ మేకప్ వల్ల తాను స్క్రీన్ మీద దాదాపు గ్రే కలర్‌లో కనిపించేదాన్నని చెప్పింది. బయట సమాజంలోనే కాదు, సొంత కుటుంబాల్లో కూడా అమ్మాయిలను నల్లగా ఉన్నావు, లావుగా ఉన్నావు అంటూ పేరెంట్స్, అత్తమామలు వేధించడం దారుణమని, అసలు అందానికి నిర్వచనం ఎవరు ఇచ్చారని ఆమె ప్రశ్నించింది.

20 ఏళ్ల పాటు ఆ నరకం అనుభవించా

బాలీవుడ్ తన నుంచి కోరుకున్న గ్లామర్ లుక్ కోసం తన పర్సనల్ లైఫ్‌ను, నమ్మకాలను పూర్తిగా పక్కన పెట్టేయాల్సి వచ్చిందని సమీరా వాపోయింది. ఆ అభద్రతాభావం నుంచి బయటకు రావడానికి తనకు దాదాపు 20 ఏళ్ల సమయం పట్టిందని ఎమోషనల్ అయింది.

తనకు 40 ఏళ్లు వచ్చిన తర్వాతే ఆ భ్రమల నుంచి బయటపడగలిగానని స్పష్టం చేసింది. అన్ని ఏళ్లుగా కేవలం ఇండస్ట్రీ కోసం ప్యాడెడ్ బ్రాలు, బమ్ ప్యాడ్స్, కలర్ కాంటాక్ట్ లెన్స్‌లు వాడుతూ బతికేసినట్లు ఓపెన్‌గా ఒప్పుకుంది. డ్రెస్ డిజైనర్లు కూడా తన బాడీ షేప్ గురించి కామెంట్స్ చేస్తూ ఒత్తిడి తెచ్చేవారని, తన బట్టలన్నింటికీ ఇన్-బిల్ట్ ప్యాడ్స్ కుట్టించేవారని సంచలన విషయాలు బయటపెట్టింది.

టాలీవుడ్‌లో క్రేజ్.. సంజయ్ దత్ సినిమాతో కంబ్యాక్

తెలుగు ప్రేక్షకులకు సమీరా రెడ్డి చాలా బాగా సుపరిచితం. మెగాస్టార్ చిరంజీవితో 'జై చిరంజీవా', యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో 'అశోక్', 'నరసింహుడు' లాంటి పెద్ద సినిమాల్లో నటించి ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్‌లో అదరగొట్టిన ఈ బ్యూటీ వెనుక ఇంతటి మానసిక సంఘర్షణ ఉందనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దాదాపు 14 ఏళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న సమీరా రెడ్డి.. రీసెంట్‌గా అభిజీత్ మోహన్ వరాంగ్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఆఖ్రీ సవాల్' అనే ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చింది. సంజయ్ దత్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాలో సమీరా నటనకు మంచి మార్కులు పడ్డాయి.

దీనికంటే ముందు ఆమె 2013లో వచ్చిన 'వరదనాయక' అనే కన్నడ సినిమాలో లాస్ట్ టైమ్ కనిపించింది. పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే 2014లో బిజినెస్‌మెన్ అక్షయ్ వర్దేని పెళ్లి చేసుకున్న ఈమెకు హన్స్ అనే కొడుకు, నైరా అనే కూతురు ఉన్నారు. ప్రస్తుతం బాడీ పాజిటివిటీపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానుల్లో ధైర్యం నింపుతోంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More