Pranay Reddy Vanga: ఇది చిన్న సినిమా.. స్పిరిట్ వస్తుంది కదా.. దమ్ముంటే అప్పుడు చూసుకుందాం: ప్రణయ్ వంగా వార్నింగ్
Pranay Reddy Vanga: రోమాంచకం మూవీ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్ చేశారు. తన సినిమాకు నెగటివ్ రివ్యూలు ఇచ్చిన రివ్యూయర్లకు సవాలు విసిరితూ..దమ్ముంటే స్పిరిట్ మూవీ అప్పుడు చూసుకుందాం అని అనడం గమనార్హం.
Pranay Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా సోదరుడు, భద్రకాళి పిక్చర్స్ ప్రొడ్యూసర్ ప్రణయ్ రెడ్డి వంగా యూట్యూబ్ రివ్యూయర్లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రీసెంట్‌గా తను ప్రొడ్యూస్ చేసిన 'రోమాంచకం' సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో ఫిల్మ్ క్రిటిక్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. "దమ్ముంటే రాబోయే ప్రభాస్ 'స్పిరిట్' సినిమాను కూడా ఇలాగే తొక్కేయండి చూద్దాం" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

రివ్యూయర్లకు ప్రణయ్ ఛాలెంజ్
'ట్యాగ్ తెలుగు' యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో ప్రణయ్ రెడ్డి వంగా మాట్లాడుతూ, "సినిమా రివ్యూలు ఇవ్వడం చాలా ఈజీ జాబ్" అని తేల్చేశారు. థియేటర్లలోకి వచ్చే ప్రతి 10 సినిమాల్లో 9 సినిమాలు ఫెయిల్ అవుతుంటాయని, అందుకే రివ్యూయర్లు ఈజీగా కామెంట్స్ చేసేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఒక సినిమా ప్రొడక్షన్ వెనుక డైరెక్టర్, టీమ్ పడే కష్టం రివ్యూయర్లు గ్రహించలేరని చెప్పారు.
ఆడియన్స్ ఇచ్చే తీర్పుతో పోలిస్తే రివ్యూయర్ల నెగెటివిటీ ఎల్లప్పుడూ నిలవదని ఆయన స్పష్టం చేశారు. చిన్న సినిమా కాబట్టి 'రోమాంచకం'పై కోడి గుడ్డు మీద ఈకలు పీకినట్టు రివ్యూలు రాశారని ఆరోపించారు. నిజంగా రివ్యూయర్లకు ఆ సత్తా ఉంటే, త్వరలో రాబోతున్న ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ 'స్పిరిట్' రిలీజ్ టైమ్‌లో తమ పవర్ చూపించాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.
'రోమాంచకం' బాక్స్ ఆఫీస్ ట్రాక్ రికార్డ్
వేణు గోపాల్ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన 'రోమాంచకం' మూవీ సెప్టెంబర్ 3న థియేటర్లలోకి వచ్చింది. 'మేమ్ ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌లో ఒక డేటింగ్ యాప్ ఫౌండర్ చుట్టూ తిరిగే లవ్, యాక్షన్ డ్రామాను చూపించారు.
వరల్డ్ వైడ్ గా ఈ సినిమా దాదాపు రూ. 9.72 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్, మ్యూజిక్ బాగున్నా.. మిక్స్‌డ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో పర్ఫార్మ్ చేయలేకపోయింది.
ప్రభాస్ 'స్పిరిట్' క్రేజీ అప్‌డేట్స్
మరోవైపు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' పై వరల్డ్ వైడ్ గా మైండ్ బ్లాకింగ్ అంచనాలు ఉన్నాయి. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను షేక్ చేసిన సందీప్, ఈసారి ప్రభాస్‌ను ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు.
ఖైదీగా మారిన ఓ ఇంటెన్స్ పోలీసు చుట్టూ తిరిగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. ఇందులో నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్, కాంచన, ఐశ్వర్య దేశాయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
గతంలో కొరియన్ సూపర్‌స్టార్ డాన్ లీ ఈ సినిమాలో నటిస్తున్నారంటూ వచ్చిన రూమర్లను ప్రణయ్ రెడ్డి వంగా పూర్తిగా ఖండించారు. ఈ బిగ్ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


