Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు.. హీరోయిన్లు అయితే ఓకే: సందీప్ రెడ్డి వంగా కామెంట్స్‌పై విమర్శలు

Sandeep Reddy Vanga: తనకు శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోలు నచ్చరు అంటూ సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎపిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో చేసిన ఈ కామెంట్స్ పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Published on: Sep 9, 2026, 14:35:24 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sandeep Reddy Vanga: స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మరోసారి తన వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'ఎపిక్' (Epic) సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శేఖర్ కమ్ముల హీరోలపై సందీప్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి.

Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు.. హీరోయిన్లు అయితే ఓకే: సందీప్ రెడ్డి వంగా కామెంట్స్‌పై విమర్శలు
Sandeep Reddy Vanga: నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు.. హీరోయిన్లు అయితే ఓకే: సందీప్ రెడ్డి వంగా కామెంట్స్‌పై విమర్శలు

"నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు!" – సందీప్ షాకింగ్ రెస్పాన్స్

'ఎపిక్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన సందీప్ రెడ్డి వంగాను స్టేజిపై యాంకర్ సుమ ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. 'ఎపిక్' సినిమాలో హీరో శేఖర్ కమ్ముల సినిమాల్లో ఉండే అమాయకపు అబ్బాయిలాగా, హీరోయిన్ సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో ఉండే బోల్డ్ క్యారెక్టర్‌లాగా ఉందనే టాక్ వస్తోంది కదా, మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి అని సుమ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సందీప్ వంగా ఏమాత్రం ఆలోచించకుండా, "నాకు శేఖర్ కమ్ముల హీరోలు నచ్చరు" అంటూ దాచుకోకుండా చెప్పేశారు. హీరోయిన్లు మాత్రం నచ్చుతారని, ఈ ఎపిక్ లో హీరోయిన్ తన సినిమాల్లో హీరోలాంటి వాళ్లన్న పోలిక బాగుందని, ఎలా ఉందో చూడాలని అన్నారు. సందీప్ నుంచి ఇలాంటి ఆన్సర్ వస్తుందని ఊహించని యాంకర్ సుమతో పాటు అక్కడున్న ఆడియన్స్ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో ట్రోలింగ్.. లీడర్, ఆనంద్ చిత్రాల ప్రస్తావన

సందీప్ వంగా చేసిన ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే శేఖర్ కమ్ముల ఫ్యాన్స్, నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. 'లీడర్' సినిమాలో రానా దగ్గుబాటి పోషించిన సీఎం పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో.. 'అనామిక', 'ఆనంద్', 'గోదావరి' సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ ఎంత క్లాసీగా ఉంటుందో అందరికీ తెలిసిందేనని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు.

అలాంటి ఐకానిక్ క్యారెక్టర్లు కూడా సందీప్‌కి నచ్చలేదనడం ఏంటని చాలామంది ప్రశ్నిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' లాంటి ఇంటెన్స్, అగ్రెసివ్ యాక్షన్ డ్రామాలు తీసే సందీప్ వంగాకు.. శేఖర్ కమ్ముల తీసే ప్రశాంతమైన, క్లాస్ ఫీల్-గుడ్ లవ్ స్టోరీలు నచ్చకపోవడం వెనుక ఆయన పర్సనల్ టేస్ట్ ఉండి ఉండవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

శేఖర్ కమ్ముల హీరోయిన్లంటే ఇష్టమే

అయితే ఇదే వేదికపై సందీప్ వంగా మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ తనకు చాలా ఇష్టమని స్పష్టం చేశారు. ఆయన సినిమాల్లో హీరోయిన్లను ప్రెజెంట్ చేసే విధానం, వారిని అందంగా చూపించే తీరు చాలా బాగుంటుందని కంప్లిమెంట్ ఇచ్చారు.

సందీప్ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు సంబంధించినవే అయినప్పటికీ, అంతపెద్ద స్టేజ్ పై ఓపెన్‌గా వేరే డైరెక్టర్ హీరోల గురించి అలా మాట్లాడటం అనవసరమైన నెగెటివిటీకి దారితీసిందని ఫిలింనగర్ టాక్.

సెప్టెంబర్ 11న థియేటర్లలోకి ‘ఎపిక్’

ఇక ఎపిక్ సినిమా విషయానికి వస్తే.. 'బేబీ' లాంటి రూ. 100 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ జోడీగా నటించిన సినిమా ఇది. '90s' వెబ్ సిరీస్‌తో నోస్టాల్జిక్ మ్యాజిక్ క్రియేట్ చేసిన ఆదిత్య హాసన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజైన పాటలు, ట్రైలర్‌కి యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సంచలన కామెంట్స్ వల్ల వచ్చిన పబ్లిసిటీ సినిమా ఓపెనింగ్స్‌కి ఏమేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More