...
...
Next Story

Sandeep Reddy Vanga: పిడికెడు మిరపకాయలతో ఈ దిష్టి పోదు.. పంటనే తగలబెట్టాలి: ధురంధర్‌ని విమర్శించే వారికి సందీప్ కౌంటర్

Sandeep Reddy Vanga: ధురంధర్ 2 సినిమాను విమర్శించే వాళ్లకు తనదైన స్టైల్లో గట్టి కౌంటర్ ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. వాళ్ల దిష్టి పోవాలంటే పిడికెడు మిరపకాయలు సరిపోవని, మొత్తం పొలాన్నే తగలబెట్టాలని అన్నాడు.

Published on: Apr 9, 2026, 20:40:52 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Sandeep Reddy Vanga: బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న ‘ధురంధర్ 2: ది రివెంజ్’ (Dhurandhar 2) గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రేజీ స్పై థ్రిల్లర్ పై సామాన్యులే కాదు, సినీ దిగ్గజాలు కూడా తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేరాడు. సినిమాను మెచ్చుకోవడమే కాకుండా, విమర్శలపై అతడు తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు.

విమర్శకులకు వంగా మార్క్ కౌంటర్

Sandeep Reddy Vanga: పిడికెడు మిరపకాయలతో ఈ దిష్టి పోదు.. పంటనే తగలబెట్టాలి: ధురంధర్‌ని విమర్శించే వారికి సందీప్ కౌంటర్
Sandeep Reddy Vanga: పిడికెడు మిరపకాయలతో ఈ దిష్టి పోదు.. పంటనే తగలబెట్టాలి: ధురంధర్‌ని విమర్శించే వారికి సందీప్ కౌంటర్

ధురంధర్ సినిమాపై వస్తున్న కొన్ని నెగటివ్ రివ్యూలను సందీప్ రెడ్డి వంగా తీవ్రంగా ఖండించాడు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఒక ఘాటు పోస్ట్ పెట్టాడు.

"కొంతమంది రచయితలు, నటులు ప్రచారాల (Propaganda) తోనే తమ కెరీర్‌లను నిర్మించుకున్నారు. అప్పుడు ఈ ఇండస్ట్రీ పిల్లిలా మౌనంగా ఉంది. ఇప్పుడు అదే గుంపు 'ధురంధర్' సినిమాను ఎగతాళి చేస్తోంది. మీరు మొదట చేసే పని హేళన చేయడమే అయితే, మిమ్మల్ని మీరు లిబరల్స్‌గా చెప్పుకునే అర్హత లేదు. నిజాన్ని ప్రచారంగా ముద్ర వేయడం ఎప్పటి నుంచి మొదలైందో.. వింత రోజులు ఇవి" అంటూ ఆయన ఫైర్ అయ్యాడు.

ఆదిత్య ధర్, రణవీర్‌లకు అదిరిపోయే కాంప్లిమెంట్

సినిమాలోని కంటెంట్‌ను, యాక్షన్‌ను సందీప్ బాగా ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. దర్శకుడు ఆదిత్య ధర్, హీరో రణవీర్ సింగ్‌లను ట్యాగ్ చేస్తూ అతడు రాసిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

సినిమాపై ఉన్న నెగిటివిటీని ఉద్దేశిస్తూ.. "ఒక పిడికెడు మిరపకాయలు వేస్తే ఈ దిష్టి పోదు.. ఏకంగా పొలాన్నే తగలేయాలి" అంటూ సినిమా రేంజ్ ఏంటో తన స్టైల్‌లో చెప్పాడు. నిన్న రాత్రి సినిమా చూశానని, ఇది ఒక అద్భుతమైన సినిమా అని అతడు కితాబిచ్చాడు. ప్రభాస్ తో కలిసి అల్లు సినిమాస్ లో సందీప్ ఈ మూవీ చూసిన విషయం తెలిసిందే.

వివాదాలకు కేరాఫ్ అడ్రస్.. ధురంధర్ సక్సెస్

సందీప్ ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’, అల్లు అర్జున్ తో ఒక భారీ ప్రాజెక్ట్ లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. తన సినిమాలపై విమర్శలు వచ్చినప్పుడు కూడా సందీప్ ఇలాగే ధైర్యంగా స్పందిస్తారని మనకు తెలిసిందే.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ధురంధర్ 2 సినిమాపై సందీప్ రెడ్డి వంగా ట్వీట్ సారాంశం ఏమిటి?

సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకుంటూనే, దీన్ని నెగిటివ్ ప్రచారంగా ముద్ర వేస్తున్న విమర్శకులను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

2. ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేసింది?

ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం సుమారు రూ.1,656 కోట్లకు పైగా వసూలు చేసి సరికొత్త రికార్డులను సృష్టించింది.

3. ధురంధర్ 2 దర్శకుడు, హీరో ఎవరు?

ఈ చిత్రానికి ఆదిత్య ధర్ దర్శకత్వం వహించగా, రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటించారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe