...
...
Next Story

Sangeeth Movie: గోదావరి నేపథ్యంలో క్లాసిక్ డ్రామా.. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ కొత్త మూవీ ఇదే.. మలయాళ బ్యూటీతో రొమాన్స్!

Sangeeth Movie: మ్యాడ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన హీరో సంగీత్ శోభన్ ఇప్పుడు క్లాసిక్ లవ్ డ్రామాతో రాబోతున్నాడు. మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ ను మేకర్స్ ఇవాళ అనౌన్స్ చేశారు. ఈ మూవీ పేరు హార్ట్ టచింగ్ గా ఉంది.

Published on: Sep 6, 2026, 13:53:50 IST
Advertisement

Sangeeth Movie: టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ మరో కొత్త సినిమాతో థియేటర్లకు రాబోతున్నాడు. మ్యాడ్ సినిమాల్లో తన కామెడీతో ఎంటర్ టైన్ చేసిన అతను.. ఇప్పుడు క్లాసిక్ లవ్ డ్రామాతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీకి ‘అంతా రాములోరు చూసుకుంటారు’ అనే హార్ట్ టచింగ్ టైటిల్ అనౌన్స్ చేశారు.

అంతా రాములోరు చూసుకుంటారు

గోదావరి నేపథ్యంలో క్లాసిక్ డ్రామా.. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ కొత్త మూవీ ఇదే.. మలయాళ బ్యూటీతో రొమాన్స్!
గోదావరి నేపథ్యంలో క్లాసిక్ డ్రామా.. మ్యాడ్ హీరో సంగీత్ శోభన్ కొత్త మూవీ ఇదే.. మలయాళ బ్యూటీతో రొమాన్స్!

‘మ్యాడ్' సినిమాలతో అలరించిన సంగీత్ శోభన్, మలయాళ నటి అనస్వర రాజన్ తొలిసారిగా జంటగా నటిస్తున్నారు. ప్రసిద్ధ గోదావరి ప్రాంతం నేపథ్యంలో సాగే ఒక వినూత్నమైన రొమాంటిక్ డ్రామాతో వీరు అలరించడానికి సిద్ధమవుతున్నారు. 'కుమారి 21ఎఫ్', '18 పేజెస్' వంటి యూత్‌ఫుల్, ఫీల్-గుడ్ హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు 'అంత రాములోరు చూసుకుంటారు' అనే ఆసక్తికరమైన టైటిల్‌ను మేకర్స్ ఈ రోజు (సెప్టెంబర్ 6) ప్రకటించారు.

ఇది లవ్ స్టోరీ కాదు

ఈ చిత్రంలో సంగీత్ శోభన్ 'మారుతి' అనే పాత్రలో కనిపిస్తుండగా, అనస్వర రాజన్ 'శిరీష' అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను మేకర్స్ “ఇది లవ్ స్టోరీ కాదు” (Not a Love Story) అనే డిఫరెంట్ క్యాప్షన్‌తో ప్రమోట్ చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్‌మెంట్ సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోలో మారుతి, శిరీషల మధ్య జరిగే అందమైన, అర్థవంతమైన సంభాషణ ప్రేక్షకుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణ ప్రేమకథల కంటే భిన్నంగా, మానసిక బంధాలు, భావోద్వేగాల చుట్టూ ఈ కథ సాగుతుందని మేకర్స్ స్పష్టం చేశారు.

మిక్కీ జే మేయర్ సంగీతం

ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్, విజిబి ఫిల్మ్స్ బ్యానర్లపై ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

దిగ్గజ నటీనటులు

ఈ సినిమాలో టాలీవుడ్‌కి చెందిన సీనియర్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రావు రమేష్, రోహిణి, రఘు బాబు, ఆలీ, ఝాన్సీ, వినోద్ కుమార్, శివనారాయణ, శ్రీలక్ష్మి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకొంటున్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe