సంగీత్ శోభన్.. ఈ టాలీవుడ్ యువ హీరో చేసింది కొన్ని సినిమాలే అయినా యూత్ ఆడియెన్స్ లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ముఖ్యంగా మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ లాంటి సినిమాలు సంగీత్ ను ఓ స్టార్ ను చేశాయి. అయితే తనకు గనుక ఛాయిస్ ఇచ్చి ఉంటే మ్యాడ్ స్క్వేర్ చేసేవాడిని కాదని అతడు అనడం గమనార్హం.
"మరింత భిన్నంగా చేసి ఉండాల్సింది"

తాజాగా Gulte.comకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'మ్యాడ్ స్క్వేర్' గురించి సంగీత్ శోభన్ మాట్లాడుతూ.. "మ్యాడ్ (Mad) సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత, నెక్స్ట్ ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ సక్సెస్ ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉండిపోయాను. మ్యాడ్ స్క్వేర్‌ను చాలా తక్కువ సమయంలో పూర్తి చేసేశాం. నిర్మాత నాగవంశీ అన్న కూడా ఇదే విషయాన్ని ఫీలయ్యారు" అని పేర్కొన్నాడు.
అంతేకాకుండా.. "ఈ సినిమాలో క్రైమ్-కామెడీ ట్రాక్‌పై మరింత దృష్టి పెట్టి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఒకవేళ కథలో రిస్క్ పెంచి ఉంటే అవుట్‌పుట్ మరోలా ఉండేది. అయితే మొదటి భాగం కంటే సెకండ్ పార్ట్ బాగుందని అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా మాత్రం మనం ఏదైనా కొత్తగా ప్రయత్నించి ఉండాల్సింది అనిపిస్తుంది" అని సంగీత్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
వంశీ అన్న కాబట్టే మ్యాడ్ చేశాడు
ఇక మ్యాడ్ మూవీ ప్రొడ్యూసర్ నాగవంశీ గురించి కూడా సంగీత్ చాలా గొప్పగా చెప్పాడు. అసలు మ్యాడ్ లాంటి మూవీ చేసే దమ్మున్న ప్రొడ్యూసర్ వంశీ అన్న మాత్రమే అని అతడు అనడం విశేషం. చాలా మంది వంశీ గురించి ఏవేవో కామెంట్స్ చేస్తారని, కానీ అది నిజం కాదని చెప్పాడు. మ్యాడ్ లాంటి మూవీని మరెవరో తీయరని, వంశీ అన్న కాబట్టే తీశాడని సంగీత్ స్పష్టం చేశాడు.
వరుస సినిమాలతో సంగీత్ సందడి
వరుస హిట్స్ అందుకుంటున్న సంగీత్ శోభన్.. 'రాకాస' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో అతని మార్క్ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
{{/usCountry}}వరుస హిట్స్ అందుకుంటున్న సంగీత్ శోభన్.. 'రాకాస' సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఇందులో అతని మార్క్ కామెడీతో పాటు హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
{{/usCountry}}ఈ వ్యాఖ్యలతో అతడు తన సినిమాల పట్ల ఎంతటి నిజాయితీగా, విశ్లేషణాత్మకంగా ఉంటారో అర్థమవుతోంది. రాకాస మూవీ ఏప్రిల్ 3న థియేటర్లలో రిలీజ్ కానుంది. నిహారిక కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తోంది.