OTT Trending: థియేటర్లో డిజాస్టర్.. ఓటీటీలో టాప్ లేపుతున్న తమిళ స్పై థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రెండింగ్ నం1

OTT Trending: థియేటర్లలో డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న ఓ తమిళ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో టాప్ లేపుతోంది. ఇండియాలోనే నంబర్ వన్ సినిమాగా ట్రెండ్ అవుతోంది. ఈ మూవీ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమా పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Oct 3, 2026, 21:51:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

OTT Trending: భారీ అంచనాల మధ్య విడుదలైన కొన్ని సినిమాలు థియేటర్లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లపై మాత్రం ఊహించని సంచలనాలు సృష్టిస్తుంటాయి. సరిగ్గా ఇదే తరహా మ్యాజిక్‌ను రిపీట్ చేస్తోంది కార్తీ కథానాయకుడిగా నటించిన హై-వోల్టేజ్ స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2'. బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకున్న ఈ చిత్రం, డిజిటల్ స్క్రీన్‌పై మాత్రం సరికొత్త రికార్డులను లిఖిస్తోంది.

థియేటర్లో డిజాస్టర్.. ఓటీటీలో టాప్ లేపుతున్న తమిళ స్పై థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రెండింగ్ నం1
థియేటర్లో డిజాస్టర్.. ఓటీటీలో టాప్ లేపుతున్న తమిళ స్పై థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ట్రెండింగ్ నం1

థియేటర్లలో తీవ్ర నిరాశ

భారీ బడ్జెట్, పీఎస్ మిత్రన్ విలక్షణమైన దర్శకత్వం, స్టార్ కాస్టింగ్ వంటి ఎన్నో ఆకర్షణలతో సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వచ్చిన సర్దార్ 2 సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కథలో ఉన్న గందరగోళం, భారీ అంచనాలను అందుకోకపోవడం వల్ల థియేటర్ రన్ లో ఈ యాక్షన్ సీక్వెల్ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ట్రేడ్ వర్గాలతో పాటు చిత్ర యూనిట్ కూడా తీవ్ర నిరాశకు గురైంది.

ఓటీటీలో నెం.1 సంచలనం

థియేటర్లలో పరాజయం పాలైన కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే, అంటే మూడు వారాల్లోనే అక్టోబర్ 1న ఈ సర్దార్ 2 చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చింది. అయితే వెండితెరపై నిరాశపరిచిన ఈ స్పై డ్రామా.. డిజిటల్ వేదికపై మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ప్రైమ్ వీడియో ఇండియా ట్రెండింగ్‌లో 'సర్దార్ 2' అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

కార్తీ, ఎస్.జె. సూర్యల విశ్వరూపం

సర్దార్ 2 చిత్రంలో కార్తీ.. సర్దార్, ఇన్‌స్పెక్టర్ విజయ్ ప్రకాష్‌గా ద్విపాత్రాభినయంలో అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా విలన్‌గా నటించిన ఎస్.జె. సూర్య 'బ్లాక్ డ్యాగర్' పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. మాళవిక మోహనన్, ఆషికా రంగనాథ్ ల గ్లామర్, యాక్షన్ ఎపిసోడ్స్ ఓటీటీ వీక్షకులను కట్టిపడేస్తున్నాయి.

ప్యాన్ ఇండియా లెవల్లో

ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉండటం దీనికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అంతర్జాతీయ బయో-వెపన్ కుట్ర నేపథ్యంలో సాగే ఈ కథను ఇంట్లో కూర్చుని ప్రశాంతంగా చూసేందుకు ఓటీటీ ఆడియన్స్ ఎగబడుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టినా, డిజిటల్ ఓపెనింగ్స్‌లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకోవడం ద్వారా 'సర్దార్ 2' మరోసారి ఓటీటీ పవర్‌ను నిరూపించింది. థియేటర్లలో ఆడియన్స్ ఆదరణకు నోచుకోలేకపోయిన ఆ స్పై యాక్షన్ థ్రిల్లర్.. డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం దుమ్మురేపుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More