Karthi Kaithi 2: ఆ సినిమా తీయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు: లోకేష్ కనగరాజ్‌పై కార్తీ ఫన్నీ కామెంట్స్
Karthi Kaithi 2: కార్తి ఖైదీ 2 మూవీపై ఇచ్చిన ఫన్నీ అప్డేట్ వైరల్ అవుతోంది. తన బ్లాక్‌బస్టర్ సినిమాకు సీక్వెల్ తీయకుండా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ హీరోగా సినిమాలు తీస్తూ తిరుగుతున్నాడని కార్తి అనడం గమనార్హం.
Karthi Kaithi 2: కోలీవుడ్ వర్సటైల్ యాక్టర్ కార్తి తాజాగా తన అప్‌కమింగ్ మూవీ 'సర్దార్ 2' ప్రీ రిలీజ్ ప్రమోషన్స్‌లో ఊహించని ఫన్నీ కామెంట్స్ చేశారు. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రాబోయే మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'ఖైదీ 2' గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నకు కార్తి ఇచ్చిన ఫన్నీ ఆన్సర్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

"ముందు సర్దార్ 2 చూడండి.. ఆ తర్వాత ఖైదీ 2!"
'సర్దార్ 2' ఈవెంట్‌లో ఫ్యాన్స్ అందరూ ఒకేసారి 'ఖైదీ 2 అప్‌డేట్ కావాలి' అని గట్టిగా అరిచారు. దాంతో కార్తి నవ్వుతూ స్పందించారు. "ముందు సెప్టెంబర్ 10న థియేటర్లలోకి వస్తున్న సర్దార్ 2 సినిమా చూడండి. ఆ తర్వాత ఖైదీ 2 స్టార్ట్ చేస్తాం" అని ఫ్యాన్స్‌కి ప్రామిస్ చేశారు.
అక్కడితో ఆగకుండా లోకేష్ కనగరాజ్ గురించి కార్తి ఒక ఫన్నీ కౌంటర్ వేశారు. "నేను లోకేష్‌తో మాట్లాడతాను.. ప్రెజెంట్ తను సినిమాలు తీయడం పక్కన పెట్టి యాక్టింగ్ చేస్తూ ఊళ్లు తిరుగుతున్నాడు" అని నవ్వుతూ కామెంట్ చేశారు. కార్తి వేసిన ఈ పంచ్‌తో ఆడిటోరియంలో క్లాప్స్, విజిల్స్‌తో రచ్చ రచ్చ అయిపోయింది.
7 ఏళ్ల నిరీక్షణ.. ఎల్సీయూ క్రేజ్
7 ఏళ్ల క్రితం 2019లో వచ్చిన 'ఖైదీ' సినిమా తమిళం, తెలుగు భాషల్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 106 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమాతోనే లోకేష్ కనగరాజ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'LCU' (Lokesh Cinematic Universe)కి శ్రీకారం చుట్టారు. 'ఢిల్లీ' క్యారెక్టర్‌లో కార్తి ఇచ్చిన ఇంటెన్స్ పర్‌ఫార్మెన్స్‌కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
అయితే ఆ తర్వాత లోకేష్ వరసగా విజయ్‌తో 'మాస్టర్', కమల్ హాసన్‌తో 'విక్రమ్', మళ్లీ విజయ్‌తో 'లియో', రజనీకాంత్‌తో 'కూలీ' సినిమాలు చేస్తూ వెళ్లారు. ప్రతి సినిమా టైమ్‌లోనూ ఖైదీ 2 త్వరలోనే ఉంటుందని చెప్తూ వచ్చినా ఇప్పటివరకు ఆ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కలేదు.
హీరోగా లోకేష్ ఎంట్రీ.. కార్తి క్రేజీ లైనప్
మధ్యలో అరుణ్ మాథేశ్వరన్ డైరెక్షన్ లో వచ్చిన 'DC' అనే యాక్షన్ డ్రామా సినిమా ద్వారా లోకేష్ కనగరాజ్ హీరోగా యాక్టింగ్ డెబ్యూ కూడా చేశారు. అంతేకాకుండా రాఘవ లారెన్స్ లీడ్ రోల్‌లో 'బెంజ్' అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. రీసెంట్‌గా అల్లు అర్జున్‌తో 'AA23' సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు కార్తి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 'మేయళగన్', 'వా వాథియార్' తర్వాత ఇప్పుడు ‘సర్దార్ 2’తో సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దీని తర్వాత 'మార్షల్', 'హిట్: ది ఫోర్త్ కేస్' సినిమాలు ఆయన లైనప్‌లో ఉన్నాయి. లోకేష్ తన యాక్టింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని త్వరలోనే 'ఢిల్లీ' క్యారెక్టర్‌ను మళ్లీ సెట్స్ పైకి తెస్తాడని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


