Rao Bahadur: టాలీవుడ్ విలక్షణ నటుడు సత్యదేవ్ లీడ్ రోల్‌లో నటిస్తున్న మోస్ట్ ఎక్స్‌పెరిమెంటల్ మూవీ 'రావు బహదూర్' (Rao Bahadur) జులై 3న గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతోంది. 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' లాంటి కల్ట్ క్లాసిక్స్‌తో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెంకటేష్ మహా ఈ సినిమాను తెరకెక్కించారు.

ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ గా సపోర్ట్ అందిస్తూ ప్రమోషన్స్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. రీసెంట్‌గా రిలీజైన టీజర్, పోస్టర్స్ ఇంటర్నెట్‌లో విపరీతమైన క్రేజ్ జనరేట్ చేశాయి.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జరిగిన ఒక లేటెస్ట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ వెంకటేష్ మహా.. రావు బహదూర్ ఏ జోనర్‌లో ఉండబోతుందో వివరిస్తూ లీక్ చేసిన డీటెయిల్స్ ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్‌లో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.
హారర్ కాదు.. థ్రిల్లర్ కాదు.. ఇది ప్యూర్ మైండ్ గేమ్
రావు బహదూర్ సినిమా జోనర్ గురించి తాజాగా ఐడిల్ బ్రెయిన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకటేష్ మహా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఆన్సర్ ఇచ్చారు. ఈ సినిమాను చూసేటప్పుడు ఆడియన్స్‌కు ఒక సరికొత్త విజువల్, మెంటల్ ఎక్స్‌పీరియన్స్ దక్కుతుందని ఆయన ప్రామిస్ చేశారు.
"నేను ఈ సినిమా గురించి చెప్పే కంటే ముందుగా జోనర్ లెవెల్ లో చెబుతాను. ఇది హారర్ సినిమా కాదు.. అలాగని సస్పెన్స్ థ్రిల్లర్ అంతకన్నా కాదు. ఇది ఒక ప్యూర్ సైకలాజికల్ డ్రామా. అయితే ఇందులో సబ్-జోనర్స్ కింద మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ ఎలిమెంట్స్ కూడా చాలా పర్‌ఫెక్ట్‌గా మిక్స్ చేశాం. స్టోరీ పరంగా చూస్తే.. భువనం రామప్ప రావు బహదూర్ అనే ఒక విలక్షణమైన వ్యక్తి లైఫ్ జర్నీని ఈ సినిమాలో చూపించబోతున్నాం" అని వెంకటేష్ మహా స్పష్టం చేశారు.
పుస్తకం చదివిన ఫీలింగ్ కలుగుతుంది
ఈ సినిమాలో సత్యదేవ్ పోషించిన క్యారెక్టరైజేషన్ గురించి వెంకటేష్ మహా మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా మన కమర్షియల్ సినిమాల్లో ఉండే హీరోల జర్నీకి.. ఈ సినిమాలో భువనం రామప్ప జర్నీకి అస్సలు సంబంధం ఉండదని, పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు.
{{/usCountry}}ఈ సినిమాలో సత్యదేవ్ పోషించిన క్యారెక్టరైజేషన్ గురించి వెంకటేష్ మహా మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. సాధారణంగా మన కమర్షియల్ సినిమాల్లో ఉండే హీరోల జర్నీకి.. ఈ సినిమాలో భువనం రామప్ప జర్నీకి అస్సలు సంబంధం ఉండదని, పూర్తి భిన్నంగా ఉంటుందని చెప్పారు.
{{/usCountry}}ఈ క్యారెక్టర్‌కు ఉండే ఒక చిన్న కోరిక లేదా అవసరం చాలా చిన్నదిగా అనిపించవచ్చు కానీ.. దానికోసం అతను చేసే ప్రయాణం మాత్రం నెక్స్ట్ లెవెల్ హీరోయిజంతో సాగుతుందన్నారు. సినిమా చూస్తున్నంత సేపు ఆడియన్స్‌కు ఒక అద్భుతమైన నవలను లేదా పుస్తకాన్ని చదువుతున్నంత ఫీలింగ్ కలుగుతుందని జక్కన్న రేంజ్ లో హామీ ఇచ్చారు. ఒక మనిషి లోపల ఏముంది అనే విషయాన్ని బయటపెట్టి పూర్తిగా స్క్రీన్ పై ప్రజెంట్ చేశామని, ఇది దాదాపు ఆ క్యారెక్టర్ బయోపిక్ లాగా అనిపిస్తుందని ముగించారు.
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సత్యదేవ్ కెరీర్‌లో ఇదొక మైల్‌స్టోన్ లాంటి సినిమా కాబోతోంది. ఈ సినిమాకు అడ్వాన్స్‌డ్ టెక్నికల్ వాల్యూస్, పర్‌ఫెక్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రా అండ్ రియలిస్టిక్ విజువల్స్ పెద్ద అసెట్ కాబోతున్నాయి. జులై 3న థియేటర్లలోకి రాబోతున్న ఈ సైకలాజికల్ డ్రామా తెలుగు ఆడియన్స్‌కు ఎలాంటి కొత్త అనుభూతిని ఇస్తుందో చూడాలి.