Save The Tigers: టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. సుమతో ఫన్నీ ప్రోమో రిలీజ్.. రేపు సాయంత్రం అనౌన్స్‌మెంట్

Save The Tigers: తెలుగు సూపర్ హిట్ కామెడీ వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ మూడో సీజన్ రాబోతోంది. దీనికి సంబంధించిన కీలకమైన అనౌన్స్‌మెంట్ శనివారం (మే 23) సాయంత్రం 4 గంటలకు చేయబోతున్నట్లు ఓ ఫన్నీ ప్రోమో ద్వారా జియోహాట్‌స్టార్ వెల్లడించింది.

Published on: May 22, 2026, 21:00:38 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Save The Tigers: సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ముగ్గురు భార్యా బాధితుల చుట్టూ తిరిగే ఫన్నీ స్టోరీతో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో జియోహాట్‌స్టార్ ఓటీటీ మూడో సీజన్ ను కూడా తీసుకొస్తోంది. గతేడాది చివర్లోనే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ఓ ఫన్నీ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

Save The Tigers: టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. సుమతో ఫన్నీ ప్రోమో రిలీజ్.. రేపు సాయంత్రం అనౌన్స్‌మెంట్
Save The Tigers: టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. సుమతో ఫన్నీ ప్రోమో రిలీజ్.. రేపు సాయంత్రం అనౌన్స్‌మెంట్

సేవ్ ద టైగర్స్ సీజన్ 3

సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కు సంబంధించి రేపు అంటే శనివారం (మే 23) సాయంత్రం 4 గంటలకు ఓ అనౌన్స్‌మెంట్ ఉండనున్నట్లు చెబుతూ జియోహాట్‌స్టార్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో యాంకర్ సుమ కనకాల సీరియస్ గా వార్తలు చదువుతూ.. పట్టపగలు ఓ పార్కులోకి మూడు పులులు వచ్చాయంటూ చెప్పడం నవ్వు తెప్పించింది.

వాటిని పట్టుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగడం, మరోవైపు టీవీ రిపోర్టర్ హడావిడితో ఈ ప్రోమో ఫన్నీగా సాగిపోయింది. చివర్లో ఆ మూడు పులులు మన సేవ్ ద టైగర్స్ హీరోలే అని తేలిపోతుంది. “బ్రేకింగ్ న్యూస్: పట్టపగలు పార్కులో కనపడిన మూడు టైగర్లు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరిక. రేపు సాయంత్రం 4 గంటలకు అనౌన్స్‌మెంట్. స్టే ట్యూన్డ్” అనే క్యాప్షన్ తో జియోహాట్‌స్టార్ ట్వీట్ చేసింది.

గతేడాదే సీజన్ 3 టీజర్

నిజానికి సేవ్ ద టైగర్స్ మూడో సీజన్ గురించి గతేడాది చివర్లోనే జియోహాట్‌స్టార్ ఓ చిన్న టీజర్ రిలీజ్ చేసింది. “టైగర్స్ ఆర్ బ్యాక్.. ఈసారి గర్జన మరింత బిగ్గరగా, వింతగా, భయంకరంగా ఉండనుంది.. సేవ్ ద టైగర్స్ సీజన్ 3 త్వరలోనే జియోహాట్‌స్టార్ లోకి” అనే క్యాప్షన్ తో అప్పట్లో ట్వీట్ చేసింది.

దీనికి ఓ ఫన్నీ వీడియో జత చేసింది. ఈసారి ఇందులోని ముగ్గురు టైగర్స్ పూర్తిగా లుక్స్ మార్చేసి కనిపించారు. తమ భర్తలకు ఏమైందంటూ భార్యలు ముక్కున వేలేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు.

సేవ్ ద టైగర్స్ సీజన్ 2లో ఏం జరిగిందంటే?

సేవ్ ద టైగర్స్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. 2023లో తొలి సీజన్, 2024లో రెండో సీజన్ వచ్చాయి. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మిలాంటి వాళ్లు నటించారు. అరుణ్ కొత్తపల్లి డైరెక్ట్ చేయగా.. మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైత్ క్రియేటర్స్ గా ఉన్నారు.

ఇది గంటా రవి, రైటర్ రాహుల్, విక్రమ్ అనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే సిరీస్. తమ భార్యలను ఎదిరించి స్వతంత్రంగా బతకాలనుకుంటారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలను ఎంతో సరదాగా చూపించిన వెబ్ సిరీస్ ఈ సేవ్ ద టైగర్స్. తమ మార్క్ కామెడీతో ఈ సిరీస్ కు ప్రియదర్శి, అభినవ్ గోమటం, సుజాతలాంటి వాళ్లు ప్లస్ పాయింట్ గా నిలిచారు.

హంసలేఖ అనే హీరోయిన్ ను ఈ ముగ్గురూ కిడ్నాప్ చేశారన్న సందేహంతో తొలి సీజన్ ముగియగా.. రెండో సీజన్ అక్కడి నుంచే మొదలైంది. మొదటి సీజన్‍తో పోలిస్తే.. ఈ సేవ్ ది టైగర్స్ రెండో సీజన్‍లో కామెడీ డోస్ తగ్గిందన్న కామెంట్స్ వచ్చాయి. డ్రామా బాగానే ఉన్నా ఫన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు. అక్కడక్కడా కాస్త డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే మరీ బోర్ కొట్టినట్టు కూడా అనిపించదు. ఇప్పుడు మూడో సీజన్ రానుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More