తెలుగు ఓటీటీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన వెబ్ సిరీస్ సేవ్ ద టైగర్స్ (Save The Tigers). ఇప్పటికే రెండు సీజన్ల పాటు కడుపుబ్బా నవ్వించిన ఈ సిరీస్ మూడో సీజన్ కు సిద్ధమైంది. తాజాగా మంగళవారం (డిసెంబర్ 9) ఈ సిరీస్ మేకర్స్ ఓ ఫన్నీ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు.
సేవ్ ద టైగర్స్ సీజన్ 3

సేవ్ ద టైగర్స్ కొత్త సీజన్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు జియోహాట్‌స్టార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సిరీస్ త్వరలోనే రానున్నట్లు వెల్లడించింది. మొదటి రెండు సీజన్ల హైలైట్స్ చూపిస్తూ.. మూడో సీజన్ లో ఏం జరగనుందో చెప్పే ఓ చిన్న వీడియోను రిలీజ్ చేసింది.
“టైగర్స్ ఆర్ బ్యాక్.. ఈసారి గర్జన మరింత బిగ్గరగా, వింతగా, భయంకరంగా ఉండనుంది.. సేవ్ ద టైగర్స్ సీజన్ 3 త్వరలోనే జియోహాట్‌స్టార్ లోకి” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. దీనికి ఓ ఫన్నీ వీడియో జత చేసింది. ఈసారి ఇందులోని ముగ్గురు టైగర్స్ పూర్తిగా లుక్స్ మార్చేసి కనిపించారు. తమ భర్తలకు ఏమైందంటూ భార్యలు ముక్కున వేలేసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు.
సేవ్ ద టైగర్స్ సీజన్ 2లో ఏం జరిగిందంటే?
సేవ్ ద టైగర్స్ ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. 2023లో తొలి సీజన్, గతేడాది రెండో సీజన్ వచ్చాయి. ఇందులో ప్రియదర్శి, అభినవ్ గోమటం, చైతన్య కృష్ణ, జోర్దార్ సుజాత, పావని గంగిరెడ్డి, దేవయాని శర్మిలాంటి వాళ్లు నటించారు. అరుణ్ కొత్తపల్లి డైరెక్ట్ చేయగా.. మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైత్ క్రియేటర్స్ గా ఉన్నారు.
ఇది గంటా రవి, రైటర్ రాహుల్, విక్రమ్ అనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే సిరీస్ ఇది. తమ భార్యలను ఎదిరించి స్వతంత్రంగా బతకాలనుకుంటారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలను ఎంతో సరదాగా చూపించిన వెబ్ సిరీస్ ఈ సేవ్ ద టైగర్స్. తమ మార్క్ కామెడీతో ఈ సిరీస్ కు ప్రియదర్శి, అభినవ్ గోమటం, సుజాతలాంటి వాళ్లు ప్లస్ పాయింట్ గా నిలిచారు.
{{/usCountry}}ఇది గంటా రవి, రైటర్ రాహుల్, విక్రమ్ అనే ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే సిరీస్ ఇది. తమ భార్యలను ఎదిరించి స్వతంత్రంగా బతకాలనుకుంటారు. ఈ క్రమంలో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు, సమస్యలను ఎంతో సరదాగా చూపించిన వెబ్ సిరీస్ ఈ సేవ్ ద టైగర్స్. తమ మార్క్ కామెడీతో ఈ సిరీస్ కు ప్రియదర్శి, అభినవ్ గోమటం, సుజాతలాంటి వాళ్లు ప్లస్ పాయింట్ గా నిలిచారు.
{{/usCountry}}హంసలేఖ అనే హీరోయిన్ ను ఈ ముగ్గురూ కిడ్నాప్ చేశారన్న సందేహంతో తొలి సీజన్ ముగియగా.. రెండో సీజన్ అక్కడి నుంచే మొదలైంది. మొదటి సీజన్‍తో పోలిస్తే.. ఈ సేవ్ ది టైగర్స్ రెండో సీజన్‍లో కామెడీ డోస్ తగ్గిందన్న కామెంట్స్ వచ్చాయి. డ్రామా బాగానే ఉన్నా ఫన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఉండదు. అక్కడక్కడా కాస్త డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే మరీ బోర్ కొట్టినట్టు కూడా అనిపించదు. ఇప్పుడు మూడో సీజన్ రానుండటంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.