Secret Soldier: దేశభక్తి చిత్రంగా సీక్రెట్ సోల్జర్- ఓయ్ ఓయ్ సాంగ్ రిలీజ్- హీరోలుగా నిహాల్, సూర్య- విడుదల ఎప్పుడంటే?
Secret Soldier Movie Oye Oye Song Released: నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన స్పై యాక్షన్ డ్రామా సినిమా ‘సీక్రెట్ సోల్జర్’ నుంచి మేకర్స్ 'ఓయ్ ఓయ్' లిరికల్ పాటను విడుదల చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం విడుదల తేదిని కూడా ప్రకటించారు.
Secret Soldier Movie Oye Oye Song Released: టాలీవుడ్‌లో ఇటీవల వైవిధ్యమైన కాన్సెప్ట్ చిత్రాలకు, స్పై థ్రిల్లర్ కథాంశాలకు మంచి ఆదరణ లభిస్తోంది. అదే బాటలో సస్పెన్స్, యాక్షన్, హ్యూమర్ ఎలిమెంట్స్ కలగలిపి తెరకెక్కించిన వినూత్న చిత్రం ‘సీక్రెట్ సోల్జర్’.

హీరోలుగా నిహాల్, సూర్య
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా ప్రమోషన్లు ప్రస్తుతం జోరందుకున్నాయి. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆకట్టుకుంటున్న ఈ సీక్రెట్ సోల్జర్ మూవీ నుంచి తాజాగా 'ఓయ్ ఓయ్' అనే ఫుల్ ఎనర్జెటిక్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
శ్రోతలను ఆకట్టుకుంటున్న 'ఓయ్ ఓయ్' సాంగ్!
సీక్రెట్ సోల్జర్ సినిమా నుంచి విడుదలైన 'ఓయ్ ఓయ్' పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సంగీత దర్శకుడు కార్తీక్ రోడ్రిగ్జ్ ఈ పాటకు అత్యంత క్యాచీ ట్యూన్ అందించడమే కాకుండా, స్వయంగా తన గాత్రంతో ఆలపించి ఎనర్జీ నింపారు.
ప్రముఖ గీత రచయిత రెహమాన్ అందించిన సాహిత్యం పాటలోని ప్రతి పదాన్ని అర్థవంతంగా నిలబెట్టింది. పాత్రల స్వభావాన్ని, కథలోని మూడ్‌ను ప్రతిబింబించేలా ఈ పాట చిత్రీకరణ సాగింది. "పాట శ్రోతలను అలరించడంతో పాటు సినిమాలో పాత్రలపై ఆసక్తిని పెంచేలా రూపొందించాం" అని మేకర్స్ తెలిపారు.
యాక్షన్, ఫన్ సమ్మేళనంగా 'సీక్రెట్ సోల్జర్'
సాధారణంగా స్పై సినిమాలు అంటే సీరియస్ టోన్‌లో సాగుతుంటాయి. కానీ ‘సీక్రెట్ సోల్జర్’ చిత్రాన్ని హ్యూమర్, థ్రిల్ మేళవించి రూపుదిద్దినట్లు టీజర్, ట్రైలర్లు చూస్తే తెలుస్తోంది. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్, హర్షిత బండ్కమూరి, తులసి వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషించారు.
బలమైన సాంకేతిక వర్గం.. సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్
సీక్రెట్ సోల్జర్ సినిమాకి పరిశ్రమలోని సీనియర్ సాంకేతిక నిపుణులు పనిచేయడం విశేషం. సురేష్ రగుతు ఛాయాగ్రహణం అందించగా, సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రమోషనల్ కంటెంట్‌తో ఇప్పటికే సినీ ప్రియుల్లో మంచి బజ్ క్రియేట్ చేసిన ‘సీక్రెట్ సోల్జర్’ చిత్రాన్ని సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల నిర్వహించిన సీక్రెట్ సోల్జర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సూర్య శ్రీనివాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
సూర్య శ్రీనివాస్ కామెంట్స్
సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. "ట్రైలర్ మీ అందరికీ నచ్చడం చాలా హ్యాపీగా ఉంది. సినిమా ఇంతకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కథ విన్నప్పుడు చాలా మంచి కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు చాలా మంచి కథ ఉన్న సినిమా అనిపించింది" అని అన్నాడు.
"ఈ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ నాకు చాలా నచ్చింది. ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ధైర్యానికి అసలు అర్థం తెలిసింది. అలా పృథ్వీ క్యారెక్టర్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ అందరికీ థ్యాంక్యూ వెరీ మచ్. ఈ సినిమాలో యాక్షన్, హ్యూమర్ అన్నిటికంటే మించి ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉంది. ఆ ఎమోషన్ ఈ సినిమాని గట్టిగా నిలబెడుతుంది" అని ధీమా వ్యక్తం చేశాడు హీరో సూర్య శ్రీనివాస్.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


