...
...
Next Story

Naresh: పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు..కానీ పిల్లలను మాత్రం కనండి..సీనియర్ నటుడు నరేష్ షాకింగ్ కామెంట్లు..అనుపమ కౌంటర్!

Naresh: సీనియర్ నటుడు వీకే నరేష్ మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. పెళ్లి గురించి, పిల్లలను కనడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్రేజీ కళ్యాణం మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో నరేష్ చేసిన కామెంట్లపై డిస్కషన్ జోరందుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.

Published on: Oct 12, 2026, 08:35:33 IST
Advertisement

Naresh: సీనియర్ నటుడు నరేష్ వీకే తాజాగా పాల్గొన్న ఒక సినిమా వేడుకలో చేసిన షాకింగ్ కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న 'క్రేజీ కళ్యాణం' అనే చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన నరేష్ నేటితరం పెళ్లిళ్లు, బంధాలపై తనదైన శైలిలో స్పందించారు.

వీకే నరేష్ కామెంట్లు

పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు..కానీ పిల్లలను మాత్రం కనండి..సీనియర్ నటుడు నరేష్ షాకింగ్ కామెంట్లు..అనుపమ కౌంటర్!
పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు..కానీ పిల్లలను మాత్రం కనండి..సీనియర్ నటుడు నరేష్ షాకింగ్ కామెంట్లు..అనుపమ కౌంటర్!

క్రేజీ కళ్యాణం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లో వీకే నరేష్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారాయి. సమాజంలో మారుతున్న సంబంధాల గురించి వివరిస్తూ.. ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం చాలా కష్టంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పెళ్లిళ్లు కావడం లేదని, నగరాల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉందంటూ సమాజంలోని ప్రస్తుత పరిస్థితులను నరేష్ వివరించారు.

కేవలం పెళ్లి కోసమే కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, ఆ తర్వాత విడాకుల కోసం మళ్లీ కోర్టుల చుట్టూ తిరుగుతూ మరికొన్ని కోట్లు వృధా చేయడం ఎక్కువైపోయిందని నరేష్ పేర్కొన్నారు.

పెళ్లి చేసుకోకపోయినా

ఈ క్రమంలోనే యువతను ఉద్దేశించి నరేష్ మాట్లాడుతూ.. ఇప్పుడు సహజీవనం (లివిన్) కూడా చట్టబద్ధం అయిపోయిందని పేర్కొన్నారు. అందుకే పెళ్లి అనేది కేవలం ఒక ఈవెంట్ లాంటిదేనని, కాబట్టి పెళ్లిళ్లు చేసుకున్నా చేసుకోకపోయినా పర్లేదని, కానీ పిల్లల్ని మాత్రం కనండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. దేశంలో జనాభా తగ్గిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందనే కోణంలో నవ్వుతూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

అనుపమ కౌంటర్

నరేష్, అనుపమ చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. కొందరు వీళ్ల మాటలను సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం నేటితరం బంధాలపై ప్రాక్టికల్ నిజాలనే మాట్లాడారంటూ మద్దతు తెలుపుతున్నారు. మొత్తానికి ఈ వ్యాఖ్యలతో అక్టోబర్ 16న విడుదల కానున్న 'క్రేజీ కళ్యాణం' సినిమాపై ప్రేక్షకుల్లో మరింత బజ్ క్రియేట్ అయిందని చెప్పొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks