Saripoyaru Iddaru Teaser: రాజేంద్రప్రసాద్, నరేష్ కామెడీ రచ్చ- మీమ్ డైలాగ్‌తో సరిపోయారు ఇద్దరూ- అనిల్ రావిపూడితో టీజర్!

Saripoyaru Iddaru Teaser Released By Anil Ravipudi: 'శతమానం భవతి' దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కించిన విలేజ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'సరిపోయారు ఇద్దరూ' టీజర్‌ను డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న హీరోలుగా నటించిన ఈ టీజర్‌లో రాజేంద్రప్రసాద్, వీకే నరేష్ రచ్చ చేశారు.

Published on: Oct 6, 2026, 14:37:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Saripoyaru Iddaru Teaser Released By Anil Ravipudi: హ్యాపీ ఆక్స్ ఎంటర్టైన్మెంట్, ఎంఎస్ వారాహి క్రియేషన్స్, శతమానంభవతి ఆర్ట్స్ బ్యానర్ల మీద తెరకెక్కిన లేటెస్ట్ విలేజ్ కామెడీ డ్రామా చిత్రం ‘సరిపోయారు ఇద్దరూ’. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మీమ్ డైలాగ్‌ను ఈ సినిమాకు పేరు పెట్టారు. సాదత్, ముని శివ నిర్మించిన చిత్రానికి శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించారు.

రాజేంద్రప్రసాద్, నరేష్ కామెడీ రచ్చ- మీమ్ డైలాగ్‌తో సరిపోయారు ఇద్దరూ- అనిల్ రావిపూడితో టీజర్!
రాజేంద్రప్రసాద్, నరేష్ కామెడీ రచ్చ- మీమ్ డైలాగ్‌తో సరిపోయారు ఇద్దరూ- అనిల్ రావిపూడితో టీజర్!

రియల్ స్టార్ హీరో కొడుకు

సరిపోయారు ఇద్దరూ మూవీలో రియల్ స్టార్, దివంగత శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న హీరోలుగా సీనియర్ నటులు రాజేంద ప్రసాద్, వీకే నరేష్ కీలక పాత్రల్లో నటించారు. ది రాజా సాబ్ బ్యూటీ రిద్ధి కుమార్, మేఘా చౌదరి హీరోయిన్స్‌గా చేశారు.

అనిల్ రావిపూడితో సరిపోయారు ఇద్దరూ టీజర్ రిలీజ్

తాజాగా ఇవాళ (అక్టోబర్ 6) సరిపోయారు ఇద్దరూ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. హిట్ మెషీన్, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సరిపోయారు ఇద్దరూ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేసి మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపారు.

శత్రువులుగా మారే స్నేహితులు

సరిపోయారు ఇద్దరూ టీజర్‌లో పల్లెటూరి వాతావరణం, వైజాగ్ సిటీని అందంగా చూపించారు. టీజర్ ప్రారంభంలో స్నేహితులుగా కలిసి ఉన్న నరేష్, రాజేంద్ర ప్రసాద్.. టీజర్ ఎండింగ్‌కి శత్రువులుగా ఎందుకు మారారు? అన్నదే కథ అన్నట్టు కట్ చేశారు.

ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా

ఇక యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేలా సినిమాని సతీష్ వేగేశ్న తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే కథ, ఎమోషన్స్, హాస్యం, ప్రేమ అన్ని రకాల అంశాలున్నాయని టీజర్‌ను గమనిస్తేనే తెలుస్తోంది.

హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్

సరిపోయారు ఇద్దరూ టీజర్‌లో మేఘాంశ్ శ్రీహరి, యశ్విన్ వేగేశ్న స్క్రీన్ ప్రజెన్స్ బాగున్నాయి. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్.. వైజాగ్ ఎపిసోడ్స్ సినిమాకి కీలకంగా ఉండబోతోన్నాయి. ఇక ఈ సరిపోయారు ఇద్దరూ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు.

త్వరలోనే ఆడియెన్స్ ముందుకు

సమీర్ రెడ్డి సినిటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఈ చిత్రాన్ని త్వరలోనే ఆడియెన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కీలక నటీనటులతోపాటు అన్నపూర్ణమ్మ, రఘు బాబు, సుదర్శన్, ప్రవీణ్, ఆనంద్, రచ్చ రవి, శివన్నారాయణ, అన్షు రెడ్డి, మణిచందన, సిజ్జు, భద్రం, చింటు తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

Q1: 'సరిపోయారు ఇద్దరూ' చిత్రానికి దర్శకుడు ఎవరు?

A1: 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ అవార్డు గెలుచుకున్న సతీష్ వేగేశ్న ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Q2: ఈ సినిమాలో హీరోలుగా ఎవరు నటించారు?

A2: దివంగత శ్రీహరి కుమారుడు మేఘాంశ్ శ్రీహరి, దర్శకుడి కుమారుడు యశ్విన్ వేగేశ్న ఈ చిత్రంలో కథానాయకులుగా నటించారు.

Q3: 'సరిపోయారు ఇద్దరూ' టీజర్‌ను ఎవరు విడుదల చేశారు?

A3: ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు.

Q4: ఈ చిత్రానికి సంగీతం ఎవరు అందించారు?

A4: ప్రముఖ సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More