Mugguru Kothulu: మాస్ స్టెప్పులతో ముగ్గురు కోతులు ఐటమ్ సాంగ్ కోకో కొకొరొకో- రిలీజ్ చేసిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్
Rajendra Prasad Released Mugguru Kothulu Koko Kokoroko Song: యువ నటులు ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకుంటున్న 'ముగ్గురు కోతులు' సినిమా నుంచి 'కోకో కొకొరొకో' స్పెషల్ మాస్ సాంగ్‌ను నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ పాట మాస్ ప్రేక్షకులను, యూత్‌ను ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో జోష్ నింపుతోంది.
Rajendra Prasad Released Mugguru Kothulu Koko Kokoroko Song: తెలుగు చిత్రసీమలో యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్లకు ఎప్పుడూ స్పెషల్ క్రేజ్ ఉంటుంది. కొత్త నటీనటులు, వైవిధ్యమైన ఆలోచనలతో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్‌వర్క్స్ సహ సమర్పణలో తెరకెక్కిన చిత్రం 'ముగ్గురు కోతులు'.

నిర్మాతగా శోభారాణి గరిమెల్ల
ఈ సినిమాను శోభారాణి గరిమెల్ల నిర్మించగా.. కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహించారు. ముగ్గురు కోతులు సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో కావలసినంత ఆసక్తిని పెంచాయి.
ఐటమ్ సాంగ్ కోకో కొకొరోకో
తాజాగా ముగ్గురు కోతులు సినిమా నుంచి మాస్ ఆడియెన్స్‌ను ఊపేసే 'కోకో కొకొరొకో' అనే స్పెషల్ ఐటమ్ సాంగ్‌ను సీనియర్ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపిన రాజేంద్ర ప్రసాద్, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకున్నారు.
మాస్ స్టెప్పులతో కేక పుట్టిస్తున్న 'కోకో కొకొరొకో'
ప్రస్తుతం టాలీవుడ్‌లో స్పెషల్ మాస్ సాంగ్స్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. సినిమాలో ఇలాంటి హై-ఎనర్జీ నంబర్ ఉంటే థియేటర్లలో వాతావరణం మరింత వేడెక్కుతుంది. 'కోకో కొకొరొకో' పాట కూడా అదే స్థాయిలో ఉత్సాహాన్ని నింపుతోంది.
సుహాస్ అందించిన సంగీతం
జగదీష్ అందించిన సాహిత్యం కుర్రకారును ఆకట్టుకునేలా సాగగా, ఎస్. సుహాస్ అందించిన బాణీలు శ్రోతలను వెంటనే కాలు కదిపేలా చేస్తున్నాయి. గాయని లాస్య ప్రియ తన గొంతుతో ఈ పాటకు మరింత ఊపు తీసుకొచ్చారు.
మాస్ స్టెప్పులకు ఈలలు పడటం
'కోకో కొకొరొకో' పాటలో కోరియోగ్రాఫర్లు వినోద్, రఘు, సాయి కంపోజ్ చేసిన మాస్ స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయంగా కనిపిస్తోంది. ముగ్గురు హీరోలతో పాటు స్పెషల్ అప్పీరెన్స్ ఇచ్చిన నటి గ్లామర్, ఆమె డ్యాన్స్ మూవ్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా 'ముగ్గురు కోతులు'
ఇకపోతే ముగ్గురు కోతులు చిత్రంలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కథానాయకులుగా నటిస్తుండగా, వర్షిక పాశం కథానాయికగా అలరించనున్నారు. రాజ్ నోముల ఛాయాగ్రహణం, జమీర్ షేక్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్లతో ప్రేక్షకుల్లో జోష్ నింపుతోన్న ఈ సినిమా నుంచి త్వరలోనే మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్లు రానున్నాయి.
మంచి విజయం సాధించాలి
"ఈ చిత్రం మంచి విజయం సాధించి, చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలి" అని నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆకాంక్షించారు. అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు, ఉత్సాహవంతులైన కొత్త కుర్రకారు కలయికలో వస్తున్న ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి అలజడి సృష్టిస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


