Messi First Look: స్కూల్ పిల్లలతో మెస్సీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్- ఆ ప్లేయర్ లాగే సినిమా కూడా ఆడాలన్న అర్జున్!

Messi Movie First Look And Glimpse Launch Event: తెలుగులో వస్తున్న సరికొత్త సినిమా మెస్సీ లవ్ ఫ్రమ్ ఇండియా. ఆంటోనీ వర్గీస్ నటించిన ఈ సినిమాకు నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించారు. ఇటీవల మెస్సీ ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ను స్కూల్ పిల్లలతో విడుదల చేయించారు. ఈ సందర్భంగా నిర్మాత కామెంట్స్ చేశారు.

Published on: Sep 15, 2026, 20:18:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Messi Movie First Look And Glimpse Launch Event: ధామా టేల్స్ బ్యానర్‌పై ఆకర్ష ఆలపాటి సమర్పణలో నిఖిల్ ప్రేమ్ రాజ్ దర్శకత్వం వహించిన సినిమా మెస్సీ- లవ్ ఫ్రమ్ ఇండియా. ఈ సినిమాను ఆకర్ష ఆలపాటి నిర్మాతగా నిర్మిస్తున్నారు.

స్కూల్ పిల్లలతో మెస్సీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్- ఆ ప్లేయర్ లాగే సినిమా కూడా ఆడాలన్న అర్జున్!
స్కూల్ పిల్లలతో మెస్సీ ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్- ఆ ప్లేయర్ లాగే సినిమా కూడా ఆడాలన్న అర్జున్!

మెస్సీ సినిమా నటీనటులు

ఆంటోని వర్గీస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మెస్సీ చిత్రంలో జమునా అబ్దు రెహ్మాన్, విజయన్ , సైజు కురూప్, లుక్మన్ అవరణ్, అర్చన వాసుదేవ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫైజ్ సిద్ధిక్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజాయ్ మ్యూజిక్ అందించారు.

వినాయక చవితి సందర్భంగా మెస్సీ ఫస్ట్ లుక్ రిలీజ్

నౌఫల్ అబ్దుల్లా ఎడిటింగ్ చేయగా అశోక్ మల్లికార్జున వీఎఫ్ఎక్స్ వర్క్ చేశారు. వినాయక చవితి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మెస్సీ ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. అయితే, ఈ గ్లింప్స్‌ను స్కూల్ పిల్లల చేతుల మీదగా లాంచ్ చేయడం జరిగింది. నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం సందర్భంగా మెస్సీ లవ్ ఫ్రమ్ ఇండియా సినిమా విడుదల కానుంది.

చిన్నతనం నుంచే క్రియేటివ్‌గా

ఈ సందర్భంగా నిర్మాత ఆకర్ష ఆలపాటి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. మా చిత్ర గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను నా చిన్నతనం నుంచి క్రియేటివ్‌గా ఆలోచిస్తూ ఉంటాను. ఇదే మార్గంలో చిన్న వారిని బాగా ప్రోత్సహించాలని అనుకున్నాను" అని అన్నారు.

మరిన్ని వినూత్న ఆలోచనలు ఉన్నాయి

"అదే విధంగా మలయాళ చిత్రమైన మెస్సీ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాను. ఈ సినిమా కోసం నాకు సపోర్ట్‌గా నిలిచిన నా బృందం అందరికీ థాంక్స్. మా దగ్గర మరిన్ని వినూత్న ఆలోచనలు ఉన్నాయి, ఇటువంటి మరిన్ని ప్రాజెక్ట్స్ చేయనున్నాము" అని ప్రొడ్యూసర్ ఆకర్ష ఆలపాటి తెలిపారు.

బాలలదినోత్సవం సందర్భంగా రిలీజ్

"పీవీఆర్ ఉదయ్, వెంకట్ గారు మాకు మంచి సపోర్ట్ అందించారు. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14వ తేదీన మెస్సి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని రానున్నాము. ప్రేక్షకులు సినిమాను ఆదరించి ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అని లేడి ప్రొడ్యూసర్ ఆకర్ష ఆలపాటి కోరారు.

ఆశీర్వదించాల్సిందిగా

ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అరవింద్ బత్తిని మాట్లాడుతూ.. "మా సినిమాకు సపోర్ట్‌గా నిలిచిన అందరికీ థాంక్స్. మా సినిమాను అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.

మెస్సీలాగే సినిమా ఆడాలి

అర్జున్ మాట్లాడుతూ.. "నేను ఈ కార్యక్రమానికి వచ్చిన మొదటి కారణం ఆకర్ష. మెస్సీ సినిమా గురించి చెప్పాలి అంటే ప్లేయర్ ఎలా బాగా ఆడతారు అలాగే సినిమా కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. మాకు సపోర్ట్ ఇచ్చిన మీడియాకు థాంక్స్. ధామా టేల్స్ నుంచి రానున్న ఈ సినిమా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ధామా టేల్స్ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ మరింత ముందుకు వెళ్లనుంది" అని వెల్లడించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More