...
...
Next Story

Aditi Sharma: కాఫీతో మొదలైన గొడవ.. భర్త, అత్త వేధింపులు.. పెళ్లి నగలు ఇవ్వట్లేదు.. గృహహింస కేసు పెట్టిన సీరియల్ హీరోయిన్

Aditi Sharma: పాపులర్ సీరియల్ హీరోయిన్ అదితి శర్మ పేరు మరోసారి హాట్ టాపిక్ గా మారింది. తన భర్త, అతని ఫ్యామిలీ మెంబర్స్ పై ఆమె గృహహింస కేసు పెట్టింది. శారీరక, మానసిక వేధింపులతో పాటు పెళ్లికి సంబంధించిన బంగారు, వజ్రాల నగలను కాజేసినట్లు ఆమె ఆరోపించింది. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Published on: Aug 3, 2026, 09:32:24 IST
Advertisement

Aditi Sharma: 'కలీరీన్', 'రబ్ సే హై దువా', 'అపోలోనా-సప్నోం కీ ఊంచీ ఉడాన్', 'ఖత్రోం కే ఖిలాడీ 14' వంటి పవర్ ఫుల్ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న పాపులర్ సీరియల్ హీరోయిన్ అదితి శర్మ (Aditi Sharma) వ్యక్తిగత జీవితం తీవ్ర సంక్షోభంలో పడింది. తన భర్త అభినీత్ కౌశిక్, అత్త ఊర్మిళా కౌశిక్ (65), ఆడపడుచు కీర్తి కౌశిక్ (29) లపై ఆమె ముంబైలోని గోరేగావ్ పోలీసు స్టేషన్‌లో గృహహింస కేసు పెట్టింది.

అదితి శర్మ పోలీస్ కేసు

కాఫీతో మొదలైన గొడవ.. భర్త, అత్త వేధింపులు.. పెళ్లి నగలు ఇవ్వట్లేదు.. గృహహింస కేసు పెట్టిన సీరియల్ హీరోయిన్ (instagram-Aditi Sharma)
కాఫీతో మొదలైన గొడవ.. భర్త, అత్త వేధింపులు.. పెళ్లి నగలు ఇవ్వట్లేదు.. గృహహింస కేసు పెట్టిన సీరియల్ హీరోయిన్ (instagram-Aditi Sharma)

పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో హిందీ సీరియల్ హీరోయిన్ అదితి శర్మ తన భర్త, అత్తమామలపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. పెళ్లయిన కొన్ని రోజులకే భర్త ప్రవర్తనలో మార్పు వచ్చిందని, బట్టల విషయంలో. చిన్న చిన్న విషయాలకు గొడవపడేవాడని ఆమె తెలిపింది. ఇంటి ఖర్చులు పంచుకోకుండా తన వద్దే డబ్బులు డిమాండ్ చేసేవాడని పేర్కొంది.

నగలు ఇవ్వకుండా

పెళ్లి సమయంలో ఇచ్చిన బంగారు గొలుసులు, ఉంగరాలు, డైమండ్ రింగ్, మంగళసూత్రం, గాజులను అత్త ఊర్మిళా కౌశిక్ తన వద్దే ఉంచుకుని, ఎన్నిసార్లు అడిగినా తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఎఫ్‌ఐఆర్‌లో అదితి పేర్కొంది. అదితి ఫిర్యాదు మేరకు జూలై 31, 2026న పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద నమోదైన ఈ గృహహింస కేసు బుల్లితెర వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ సెక్షన్ల కింద

అదితి భర్త, అతని కుటుంబ సభ్యులపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 85 (క్రూరత్వం, గృహహింస), సెక్షన్ 316(2) (విశ్వాసఘాతుకం), సెక్షన్ 352 (ఉద్దేశపూర్వకంగా వ్యక్తిగత ప్రతిష్టను భంగపరచడం) కింద కేసులు నమోదు చేశారు.

అసలేం జరిగింది?

ఆ గొడవ తర్వాత భర్త అదితి ప్రవర్తనపై అనుమానం పెంచుకుని, నిత్యం ఫోన్ చెక్ చేయడం, మానసికంగా వేధించడం ప్రారంభించాడు. చివరకు ఒకే గదిలో నిద్రపోవడం కూడా మానేశాడు. గొడవలు జరిగేటప్పుడు భర్త తన తల్లి, సోదరిని పిలిపించేవాడని, వారు సమస్యను సర్దుమణగకుండా మరింత రెచ్చగొట్టేవారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

గతంలోనూ రచ్చకెక్కిన వివాదం

ఈ దంపతుల మధ్య వివాదాలు రచ్చకెక్కడం ఇదే మొదటిసారి కాదు. మార్చి 2025లోనే అదితిపై భర్త అభినీత్ సంచలన ఆరోపణలు చేశాడు. 'అపోలోనా' సీరియల్ కో-స్టార్ సామర్థ్య గుప్తాతో అదితికి అక్రమ సంబంధం ఉందని, విడాకుల సెటిల్మెంట్ కోసం తనను రూ.25 లక్షలు డిమాండ్ చేస్తోందని మీడియా ముందు ఆరోపించాడు. అంతేకాకుండా తమ పెళ్లిని ఆమె ఒక నాటకంగా చిత్రీకరిస్తోందని పేర్కొన్నాడు. అయితే ఆ సమయంలో అదితి ఈ వ్యాఖ్యలపై బహిరంగంగా స్పందించలేదు.

ప్రస్తుతం గోరేగావ్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ అమితా మరాఠే ఈ కేసు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, నిందితుల నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని పోలీసులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks