బాలీవుడ్ బాద్‌షా, సూపర్‌స్టార్ షారుక్ ఖాన్ నవంబర్ 2న తన 60వ పుట్టినరోజును కింగ్-సైజ్ స్టైల్‌లో జరుపుకున్నాడు. ఈ సందర్భంగా ముంబైలోని బాంద్రాలో ఉన్న బాల గంధర్వ రంగ్ మందిర్ ఆడిటోరియంలో అభిమానుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో అత్యంత ఆకర్షణీయమైన అంశం ఏంటంటే ఈ స్టార్ నటుడు బంగారు కిరీటంతో అలంకరించిన అద్భుతమైన మూడు అంచెల కేక్‌ను కట్ చేశాడు.
షారుక్, కేక్.. స్పెషల్ అట్రాక్షన్

షారుక్ ఖాన్ తన పుట్టినరోజును అభిమానుల పండుగగా మార్చేశాడు. ఈ ఆడిటోరియంలో 300 మందికి పైగా ఫ్యాన్స్‌ను కలిసిన అతడు వాళ్లను ఉద్దేశించి మాట్లాడాడు. ఈ ఫ్యాన్ ఈవెంట్‌కు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిలో కింగ్ ఖాన్ డాషింగ్ లుక్ లో కనిపించాడు. ప్రస్తుతం కింగ్ అనే మూవీలో నటిస్తున్న అతడు.. ఆ కింగ్ లాగానే కనిపిస్తున్నాడు.
ఇక ఈ ఈవెంట్లో షారుక్ ఖాన్ ఓ బంగారు కిరీటంతో ఉన్న మూడు అంచెల కేక్‌ను కట్ చేయడం ప్రత్యేకంగా నిలిచింది. ఆయనతో పాటు అదే రోజు పుట్టినరోజును జరుపుకునే అతని మేనేజర్ పూజా దద్లానీ కూడా కేక్ కట్ చేయడంలో పాలు పంచుకుంది. ఈ సందర్భంగా 'SRK డే' అనే మెసేజ్ ఉన్న బ్లాక్ కేక్‌ను షారుఖ్ కట్ చేశాడు.
అభిమానులకు షారుక్ థ్యాంక్స్
కేక్ కటింగ్ తర్వాత షారుక్ ఖాన్ తన అభిమానులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. వారే 'ప్రతి సెలబ్రేషన్ కు కారణం' అని పేర్కొంటూ ఇన్నేళ్లుగా వారు చూపించిన అంతులేని ప్రేమ, విధేయతకు ధన్యవాదాలు చెప్పాడు.
అంతకంటే ముందు షారుక్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్ ఈవెంట్‌కు సంబంధించిన ఒక వీడియోను పంచుకున్నాడు. అభిమానులకు కృతజ్ఞత తెలియజేస్త.. "ఎప్పటిలాగే నా పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు. చాలా కృతజ్ఞుడిని.. నేను కలవలేని వారిని త్వరలోనే కలుస్తాను. థియేటర్లలో, అలాగే వచ్చే పుట్టినరోజున కలుద్దాం. లవ్ యూ" అని పోస్ట్ చేశాడు.
అభిమానులకు అభివాదం
{{/usCountry}}అంతకంటే ముందు షారుక్.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్ ఈవెంట్‌కు సంబంధించిన ఒక వీడియోను పంచుకున్నాడు. అభిమానులకు కృతజ్ఞత తెలియజేస్త.. "ఎప్పటిలాగే నా పుట్టినరోజును ప్రత్యేకంగా మార్చినందుకు ధన్యవాదాలు. చాలా కృతజ్ఞుడిని.. నేను కలవలేని వారిని త్వరలోనే కలుస్తాను. థియేటర్లలో, అలాగే వచ్చే పుట్టినరోజున కలుద్దాం. లవ్ యూ" అని పోస్ట్ చేశాడు.
అభిమానులకు అభివాదం
{{/usCountry}}అభిమానుల వేడుక తర్వాత షారుక్.. తన ఇంటి బయట భారీగా గుమిగూడిన జనసందోహానికి అభివాదం చేయడానికి కూడా బయటకు వచ్చాడు. ఈ క్షణానికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులకు అభివాదం చేయడానికి అతడు గేటుపైకి ఎక్కాడు. ఈ సమయంలో కొందరు అభిమానులు అతనికి దగ్గరగా వెళ్లడానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అయితే సెక్యూరిటీ వాళ్లను అడ్డుకున్నారు.
'కింగ్' ఫస్ట్‌లుక్ విడుదల
షారుక్ ఖాన్ 60వ పుట్టినరోజును అలీబాగ్‌లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వేడుకలో స్నేహితులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. కరణ్ జోహార్, ఫరా ఖాన్, రాణీ ముఖర్జీ వంటి అతని సన్నిహిత స్నేహితులు ఈ ప్రైవేట్ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ.. షారుక్ తదుపరి సినిమా 'కింగ్' మేకర్స్ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 2026లో విడుదల కానుంది. ఇందులో షారుక్ కుమార్తె సుహానా ఖాన్, దీపికా పడుకోణ్, జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్, అర్షద్ వార్సీ, రాణీ ముఖర్జీ, అభిషేక్ బచ్చన్, జైదీప్ అహ్లావత్, అభయ్ వర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.