Shah Rukh Khan King: రిలీజ్‌కు ముందే రూ.665 కోట్లు.. రికార్డులు తిరగరాస్తున్న షారుఖ్ ఖాన్ కింగ్ మూవీ
Shah Rukh Khan King: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'కింగ్' బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్ 24న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం, విడుదలకు ముందే ఏకంగా రూ. 665 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది.
Shah Rukh Khan King: 2023లో 'పఠాన్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత షారుఖ్ ఖాన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ కలయికలో వస్తున్న చిత్రం కావడంతో 'కింగ్'పై మొదటి నుంచీ ఆకాశమే హద్దుగా అంచనాలు నెలకొన్నాయి. నవంబర్ 2న తన పుట్టినరోజు సందర్భంగా షారుఖ్ ఈ సినిమా ప్రమోషన్లను అధికారికంగా ప్రారంభించారు. విడుదలకు ఏడు వారాల ముందే తొలి పాటను విడుదల చేసి ప్రేక్షకుల్లో జోష్ నింపారు.

కింగ్ ప్రీరిలీజ్ బిజినెస్ ఇలా..
థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్, మ్యూజిక్ హక్కుల రూపంలో ఈ చిత్రం ఇప్పటికే బాలీవుడ్ బాక్సాఫీస్ లెక్కలను తిరగరాసింది.
ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ (రూ. 175 కోట్లు): ప్రముఖ అంతర్జాతీయ పంపిణీ సంస్థ ఫార్స్ ఫిల్మ్స్ ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను రూ. 175 కోట్ల మినిమమ్ గ్యారెంటీతో దక్కించుకుంది. గతంలో ఏ భారతీయ సినిమా కూడా ఇలాంటి నిబంధనలపై కనీసం రూ. 100 కోట్ల మార్కును కూడా దాటకపోవడం విశేషం.
ఇండియన్ థియేట్రికల్ రైట్స్ (రూ. 250 కోట్లు): దేశీయ పంపిణీ హక్కులను పెన్ మరుధర్ సంస్థ రూ. 250 కోట్లకు కొనుగోలు చేసింది. హిందీ చిత్రసీమ చరిత్రలో ఇదొక ఆల్-టైమ్ రికార్డు డీల్. కేవలం దేశీయ, విదేశీ థియేట్రికల్ హక్కుల ద్వారానే రూ. 425 కోట్లు సమకూరాయి.
డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ (రూ. 150 కోట్లు): ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను రూ. 150 కోట్లకు సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో సినిమా సాధించే వసూళ్ల ఆధారంగా ఈ మొత్తం మరింత పెరిగే లేదా తగ్గే అవకాశం ఉంది.
మ్యూజిక్, శాటిలైట్ రైట్స్ (రూ. 90 కోట్లు): ఆడియో హక్కులు రూ. 65 కోట్లకు అమ్ముడుపోగా, శాటిలైట్ రైట్స్ ద్వారా మరో రూ. 25 కోట్లు వచ్చాయి.
రూ. 550 కోట్ల భారీ ఖర్చు.. ‘కింగ్’ హిట్ అవ్వాలంటే ఎంత వసూలు చేయాలి?
ప్రీ-రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ, ఈ సినిమా నిర్మాణ వ్యయం కూడా అదే స్థాయిలో భారీగా పెరిగింది. మొదట 'జవాన్' తరహాలో రూ. 300 కోట్ల బడ్జెట్ అనుకున్నప్పటికీ, చిత్రీకరణ పూర్తయ్యేసరికి నిర్మాణ వ్యయం దాదాపు రూ. 400 కోట్లకు చేరిందని సాక్నిల్క్ (Sacnilk), పింక్విల్లా రిపోర్టులు వెల్లడించాయి.
దీనికి తోడు ప్రమోషన్ల కోసం మేకర్స్ సుమారు రూ. 50 కోట్లు ఖర్చు చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ అంచనా రెమ్యునరేషన్ ను కూడా కలుపుకుంటే సినిమా మొత్తం బడ్జెట్ రూ. 550 కోట్లకు చేరుకుంది. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. 'కింగ్' బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా కనీసం రూ. 800 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించాల్సి ఉంటుంది. ఇందులో ఇండియా నుంచి రూ. 500 కోట్ల గ్రాస్ (రూ. 400 కోట్ల నెట్), ఓవర్సీస్ నుంచి రూ. 300 కోట్ల గ్రాస్ (రూ. 150 కోట్ల నెట్) రాబట్టడం కీలక లక్ష్యంగా మారింది.
కేరళ బాక్సాఫీస్‌పై ప్రత్యేక నజర్.. తమిళంలోనూ గ్రాండ్ రిలీజ్
సౌత్ ఇండియా మార్కెట్లో ముఖ్యంగా కేరళలో షారుఖ్ ఖాన్ సినిమాలకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ పంపిణీ సంస్థ E4 ఎంటర్టైన్మెంట్ (E4 Entertainment) కేరళలో 'కింగ్' హిందీతో పాటు తమిళ వెర్షన్ థియేట్రికల్ హక్కులను దక్కించుకుంది. క్రిస్మస్ సెలవుల సమయంలో తమిళ వెర్షన్ కూడా అందుబాటులో ఉండటం వల్ల కేరళలో మరింత ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువయ్యే అవకాశం ఉంది.
గతంలో షారుఖ్ నటించిన 'జవాన్' కేరళలో తొలిరోజే రూ. 3.50 కోట్ల ఓపెనింగ్‌తో హిందీ చిత్రాలకు ఆల్-టైమ్ రికార్డు సృష్టించి, మొత్తం రూ. 13.90 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అలాగే 'పఠాన్' సైతం అక్కడ రూ. 13 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఇప్పుడు 'కింగ్' ఆ రికార్డులను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
క్రిస్మస్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్
రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మార్ఫ్లిక్స్ పిక్చర్స్ పతాకాలపై గౌరీ ఖాన్, మమతా ఆనంద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్, దీపికా పదుకోన్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, అనిల్ కపూర్, జైదీప్ అహ్లావత్, జాకీ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
సచిన్-జిగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఐమ్యాక్స్ (IMAX), 4DX ఫార్మాట్లలోనూ విడుదల కానుంది. డిసెంబర్ 24న క్రిస్మస్ హాలిడే సీజన్ కలిసివచ్చే అంశమే అయినప్పటికీ, ప్రీమియం స్క్రీన్ల విషయంలో అంతర్జాతీయ సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే షారుఖ్ స్టార్ పవర్, సిద్ధార్థ్ ఆనంద్ టేకింగ్‌తో 'కింగ్' బాక్సాఫీస్ వద్ద మరోసారి వెయ్యి కోట్ల మైలురాయిని దాటడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


