King: వయోలెన్స్, రొమాన్స్ మిక్స్ చేసి- షారుఖ్, దీపికల కింగ్ నుంచి తూ మిల్ జాయే సాంగ్ రిలీజ్- చౌకబారు కాపీలా ఉందంటూ!
Shah Rukh Khan Deepika King Tu Mil Jaaye Song Released: షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు కానుకగా విడుదలైన 'కింగ్' మూవీ ఫస్ట్ సింగిల్ 'తూ మిల్ జాయే' సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీపికా పదుకోణెతో రొమాన్స్, ఊరమాస్ యాక్షన్ దృశ్యాలతో వచ్చిన ఈ పాటపై అభిమానులు వ్యక్తం చేస్తున్న భిన్నమైన అభిప్రాయాలు ఇవే.
Shah Rukh Khan Deepika Padukone King Tu Mil Jaaye Song Released: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ 61వ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అద్భుతమైన గిఫ్ట్ అందింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'కింగ్' నుంచి మొదటి పాట 'తూ మిల్ జాయే'ను నవంబర్ 2 అర్థరాత్రి విడుదల చేశారు.

తూ మిల్ జాయే సాంగ్ వైరల్
బాలీవుడ్ మ్యాజికల్ కాంబో షారుఖ్ - దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ పాట, అందులోని విజువల్స్ యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ గాయకుడు అర్జిత్ సింగ్, అంతర్జాతీయ పాప్ స్టార్ ఎడ్ షీరన్, మధుబంతి ఈ పాటను పాడగా.. సచిన్-జిగర్ సంగీతం సమకూర్చారు.
"తుపాకీ తూటాల ఘుమఘుమల మధ్య గులాబీలు వికసించే ప్రేమకథ ఇది.. నసీబ్ ఉన్నవారికే ఈ ప్రేమ లభిస్తుంది" అని సోషల్ మీడియా వేదికగా షారుఖ్ ఖాన్ భావోద్వేగంగా రాసుకొచ్చారు. పాట ప్రారంభంలో షారుఖ్, దీపికల మధ్య మైమరిపించే రొమాంటిక్ దృశ్యాలు ఆకట్టుకుంటాయి.
శత్రువుల వేట సాగించే పాత్రలో
అయితే ఆ వెంటనే సీన్ మారిపోతుంది. చేతిలో గన్నులు, కత్తులు పట్టుకుని శత్రువుల వేట ప్రారంభించే ఊరమాస్ అవతారంలో షారుఖ్ ఖాన్ కనిపిస్తారు. ఒకేసారి భవనానికి నిప్పంటించడం, శత్రువులను కత్తితో నరికిపారేసే యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. "ఈసారి నా గుండెల్లో మంట రగులుతోంది, ఈ ప్రపంచాన్ని తగలబెట్టే వరకు ఇది చల్లారదు" అని పాట చివరలో షారుఖ్ చెప్పిన శక్తివంతమైన డైలాగ్ థ్రిల్ కలిగిస్తోంది.
'పఠాన్, జవాన్' ఖిచిడీయేనా?.. ఫ్యాన్స్ షాకింగ్ కామెంట్స్
కింగ్ సినిమాలోని ఈ 'తూ మిల్ జాయే' పాట విజువల్స్ చూసిన నెటిజన్లలో కొందరు పండగ చేసుకుంటుంటే, మరికొందరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన 'పఠాన్', 'జవాన్' సినిమాల సన్నివేశాలను మిక్స్ చేసి మళ్లీ మనముందుకు తెచ్చినట్లు ఉందంటూ కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
"ఇది పఠాన్ 2 పాట అని ఎవరైనా చెబితే నేను సులభంగా నమ్మేసేవాడిని. కింగ్ కేవలం యాక్షన్, బీచ్ సాంగ్స్ మాత్రమే కాకుండా మంచి కథతో వస్తుందని ఆశిస్తున్నా" అని ఒక అభిమాని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
చౌకబారు కాపీలా ఉంది
"జవాన్ సినిమా హ్యాంగోవర్ ఇంకా దిగినట్లు లేదు. యంగ్ వర్షన్ దీపికా చనిపోయాక, షారుఖ్ తెల్ల జుట్టుతో కనిపించే పాత ప్యాటర్న్నే మళ్లీ వాడుతున్నట్లు అనిపిస్తోంది" అంటూ మరొకరు విమర్శించారు. పఠాన్ సినిమాకి ఇది చౌకబారు కాపీలా ఉందంటూ కొందరు ఘాటుగా స్పందించారు.
ఈ విమర్శలు ఎలా ఉన్నా, సిద్ధార్థ్ ఆనంద్ యాక్షన్ టేకింగ్ మాత్రం నెక్ట్స్ లెవెల్లో ఉందనడంలో సందేహం లేదు. టాలీవుడ్లో సలార్, దేవర లాంటి భారీ యాక్షన్ చిత్రాలకు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని, బాలీవుడ్ సైతం ఈ తరహా హై-వోల్టేజ్ మాస్ కంటెంట్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడుతోంది.
హాలీవుడ్ స్థాయి టేకింగ్.. సుహానా ఖాన్ గ్రాండ్ ఎంట్రీ
‘కింగ్’ చిత్రం ద్వారా షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ పూర్తిస్థాయిలో వెండితెరకు పరిచయమవుతుండటం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ పాత్రలో నటిస్తుండగా, రాణి ముఖర్జీ, రాఘవ్ జుయల్, అర్షద్ వార్షీ, జైదీప్ అహ్లావత్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు.
డిసెంబర్ 24, 2026న ఈ భారీ చిత్రం కింగ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. షారుఖ్-దీపికల కాంబినేషన్ ఆరోసారి కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుందో లేదో చూడాలి.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


