Shah Rukh Khan: 1990వ దశకంలో షారుఖ్ ఖాన్ సినిమాల్లోని మెజారిటీ పాటలకు అభిజీత్ భట్టాచార్య గాత్రం ఒక బ్రాండ్ ఇమేజ్‌ను తెచ్చిపెట్టింది. షారుఖ్ స్క్రీన్ ఇమేజ్‌కు అభిజీత్ గొంతు పక్కాగా సరిపోయేది. అయితే గత కొన్నేళ్లుగా వీరిద్దరి మధ్య మాటలు లేవు. తాజాగా నిధి వసందానీ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అభిజీత్.. షారుఖ్‌తో తనకున్న సంబంధం గురించి సంచలన విషయాలు పంచుకున్నారు.
అహం వర్సెస్ ఆత్మగౌరవం

తమ మధ్య వచ్చిన చీలిక గురించి అభిజీత్ మాట్లాడుతూ.. "షారుఖ్ ఖాన్ ఇగో, నా సెల్ఫ్-రెస్పెక్ట్.. మా మధ్య గొడవకు ప్రధాన కారణాలు. షారుఖ్ నాకంటే వయసులో చిన్నవాడు. ఫరా ఖాన్ భర్త షారుఖ్‌ను అంతగా దూషించినా, ఆయన మళ్ళీ వెళ్లి కౌగిలించుకున్నారు. ఆమిర్ ఖాన్ ఏకంగా ఒక కుక్కకు షారుఖ్ పేరు పెట్టినా, ఇద్దరూ మళ్ళీ స్నేహితులయ్యారు. కానీ నా విషయంలో మాత్రం ఆయన కనీసం ఒక 'సారీ' కూడా చెప్పలేదు" అని వాపోయారు.
గుర్తింపు లేకవడమే అసలు కారణమా?
గతంలో 'మై హూ నా' (Main Hoon Na) సినిమా సమయంలో ఎండ్ క్రెడిట్స్ లో ప్లేబ్యాక్ సింగర్ల పేరు రాకుండా, కేవలం స్పాట్ బాయ్స్ పేర్లు కూడా రావడం తనను తీవ్రంగా కలిచివేసిందని అభిజీత్ గుర్తు చేసుకున్నారు.
"మీరు అంత పెద్ద వ్యక్తి కదా.. ఒక చిన్న పొరపాటు జరిగినప్పుడు సారీ చెప్పలేరా? ఆ గుర్తింపు లేకపోవడం నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. అందుకే ఆయన సినిమాలకు పాడటం ఆపేశాను" అని స్పష్టం చేశారు.
షారుఖ్ పేరును తాను పబ్లిసిటీ కోసం వాడుకుంటున్నాననే ఆరోపణలను కూడా ఆయన తోసిపుచ్చారు. తన గొంతు వల్లే షారుఖ్ కెరీర్‌లో ఎన్నో మరుపురాని పాటలు వచ్చాయని, తనకు ప్రత్యేకంగా పబ్లిసిటీ అవసరం లేదని ధీమాగా చెప్పారు.
మళ్ళీ కలిసే అవకాశం ఉందా?
ప్రస్తుతం షారుఖ్‌తో కేవలం బహిరంగ కార్యక్రమాల్లో పలకరింపులు తప్ప మరే ఇతర సంబంధం లేదని అభిజీత్ పేర్కొన్నారు. అయితే ఒకవేళ భవిష్యత్తులో గొడవలు సర్దుమణిగితే.. ఇప్పటికీ షారుఖ్ స్క్రీన్ ఇమేజ్‌కు సరిపోయే వాయిస్ తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బాద్‌షా', 'ఎస్ బాస్', 'చల్తే చల్తే' వంటి సినిమాల్లోని పాటలు నేటికీ ఎవర్గ్రీన్ హిట్స్‌గా నిలిచిపోయాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}ప్రస్తుతం షారుఖ్‌తో కేవలం బహిరంగ కార్యక్రమాల్లో పలకరింపులు తప్ప మరే ఇతర సంబంధం లేదని అభిజీత్ పేర్కొన్నారు. అయితే ఒకవేళ భవిష్యత్తులో గొడవలు సర్దుమణిగితే.. ఇప్పటికీ షారుఖ్ స్క్రీన్ ఇమేజ్‌కు సరిపోయే వాయిస్ తనదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'బాద్‌షా', 'ఎస్ బాస్', 'చల్తే చల్తే' వంటి సినిమాల్లోని పాటలు నేటికీ ఎవర్గ్రీన్ హిట్స్‌గా నిలిచిపోయాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
{{/usCountry}}1. అభిజీత్ భట్టాచార్య షారుఖ్ ఖాన్ సినిమాలకు పాడటం ఎందుకు ఆపేశారు?
షారుఖ్ సినిమాల్లో సింగర్లకు సరైన గుర్తింపు, క్రెడిట్స్ ఇవ్వకపోవడం వల్ల తన ఆత్మగౌరవం దెబ్బతిందని, అందుకే ఆయన సినిమాలకు దూరం జరిగానని అభిజీత్ తెలిపారు.
2. షారుఖ్, అభిజీత్ మధ్య గొడవ ఏ సినిమాతో మొదలైంది?
ప్రధానంగా 'మై హూ నా' సినిమా క్రెడిట్స్ విషయంలో గొడవ మొదలవగా, 'బిల్లు' (Billu) సినిమా తర్వాత వీరిద్దరి వృత్తిపరమైన ప్రయాణం పూర్తిగా ముగిసింది.
3. షారుఖ్ ఖాన్ దీనిపై స్పందించారా?
అభిజీత్ చేసిన వ్యాఖ్యలపై షారుఖ్ ఖాన్ ఇప్పటివరకు బహిరంగంగా ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.