...
...
Next Story

OTT Crime: 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కోర్ట్ డ్రామా- నిర్దోషుల కోసం ప్రాణాలర్పించిన రియల్ లైఫ్ లాయర్ కథ!

Shahid OTT Release After 13 Years: టాలెంటెడ్ హీరో రాజ్‌కుమార్ రావు కెరీర్‌ను కీలక మలుపు తిప్పిన జాతీయ అవార్డు చిత్రం షాహిద్ ఓటీటీలోకి ఎట్టకేలకు వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన 13 ఏళ్ల తర్వాత షాహిద్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నిర్ధోషుల కోసం ప్రాణాలర్పించిన రియల్ లైఫ్ లాయర్ కథగా ఈ మూవీ తెరకెక్కింది.

Published on: Sep 29, 2026, 13:26:38 IST
Advertisement

Rajkummar Rao Shahid OTT Streaming After 13 Years: బాలీవుడ్‌లో కంటెంట్ ఆధారిత సినిమాలకు కొత్త బాటలు పరిచిన చిత్రం 'షాహిద్' ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. 2012లో తెరకెక్కి 2013లో థియేటర్లలో విడుదలైన షాహిద్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాలను కొల్లగొట్టింది.

13 ఏళ్లకు ఓటీటీలోకి

13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కోర్ట్ డ్రామా- నిర్దోషుల కోసం ప్రాణాలర్పించిన రియల్ లైఫ్ లాయర్ కథ!
13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కోర్ట్ డ్రామా- నిర్దోషుల కోసం ప్రాణాలర్పించిన రియల్ లైఫ్ లాయర్ కథ!

అలాంటి షాహిద్ ఓటీటీలోకి రావడానికి ఏకంగా 13 సంవత్సరాలు పట్టింది. ఒక విలువైన కథనాన్ని ఓటీటీ వేదికపైకి తీసుకురావడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టిందనే అంశంపై చిత్ర సహ రచయిత, ఎడిటర్ అపూర్వ అస్రానీ సంధించిన ప్రశ్నలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఉగ్రవాద నిరోధక చట్టాల కింద

మానవ హక్కుల లాయర్ షాహిద్ అజ్మీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అన్యాయంగా చిక్కుకున్న నిర్దోషుల తరఫున కోర్టుల్లో పోరాడి, ఆ ధైర్యానికి ప్రాణాలర్పించిన న్యాయవాది కథే ఇది. ఈ సినిమాలో టైటిల్ పాత్రలో నటించిన రాజ్‌కుమార్ రావు నటన భారతీయ సినిమా చరిత్రలోనే ప్రత్యేకంగా నిలిచిపోయింది.

అపూర్వ అస్రాని ఆవేదన.. సోషల్ మీడియాలో పోస్ట్

క్రైమ్, కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన షాహిద్ ఓటీటీ స్ట్రీమింగ్ కావడంపై అపూర్వ అస్రానీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. "జాతీయ అవార్డు గెలుచుకున్న 'షాహిద్' చిత్రం ఎట్టకేలకు ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు ఒక ఓటీటీ వేదిక దొరకడానికి 13 ఏళ్ల సమయం పట్టింది" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఏళ్లతరబడి జైళ్లలో

"2026లో 'షాహిద్' లాంటి కథనం ఓటీటీలోకి వచ్చిందంటే సమాజంలో భయ రాజకీయాలపై నిరసన పెరుగుతోందా? కారణం ఏదైనా సరే ఈ సినిమాపై నాకు ఎంతో గర్వంగా ఉంది" అని అస్రానీ వ్యాఖ్యానించారు. నిజాయితీతో కూడిన, ధైర్యవంతమైన సినిమాలను నిర్మించే రోజులను ఈ చిత్రం గుర్తుచేస్తుందని ఆయన వెల్లడించారు.

అవార్డుల పంట పండించిన అరుదైన చిత్రం

2012లో టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తొలిసారి ప్రదర్శితమైన ఈ చిత్రం, ఆ తర్వాత ముంబై ఫిల్మ్ ఫెస్టివల్, న్యూయార్క్, దుబాయ్, చికాగో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో విశేష ఆదరణ పొందింది. 61వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో రాజ్‌కుమార్ రావు ఉత్తమ నటుడిగా, హన్సల్ మెహతా ఉత్తమ దర్శకుడిగా అవార్డులు అందుకని సంచలనం సృష్టించారు.

షాహిద్ ఐఎమ్‌డీబీ రేటింగ్

మహమ్మద్ జీషాన్ ఆయూబ్, ప్రభ్లీన్ సంధు తమ పాత్రలతో కథకు ప్రాణం పోశారు. అంతేకాకుండా ఐఎమ్‌డీబీలో 8.2 రేటింగ్ కూడా సొంతం చేసుకుందీ సినిమా. అలాటి షాహిద్ ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్‌లో షాహిద్ ఓటీటీ రిలీజ్ అయింది.

షాహిద్ ఓటీటీ స్ట్రీమింగ్

భారతీయ డిజిటల్ మీడియాలో వినూత్న సినిమాలకు ఆదరణ పెరుగుతున్న వేళ, 13 ఏళ్ల తర్వాత అయినా 'షాహిద్' అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి రావడం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks