సంక్రాంతి సెంటిమెంట్ ను ఫాలో అవుతూ మరోసారి హిట్ కొట్టేశాడు శర్వానంద్. అతను హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ నారీ నారీ నడుమ మురారి. సంక్రాంతి 2026 సందర్భంగా జనవరి 14న రిలీజైంది ఈ సినిమా. మొదటి నుంచి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ టైటిల్ తో నందమూరి బాలకృష్ణ గతంలో బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ సినిమాపై బాలకృష్ణ రియాక్షన్ ఇంట్రెస్టింగ్ గా మారింది.
నారీ నారీ నడుమ మురారిపై బాలకృష్ణ

నారీ నారీ నడుమ మురారి సినిమాలో శర్వానంద్ హీరో. అయితే గతంలో ఇదే టైటిల్ తో బాలకృష్ణ సినిమా తీసి హిట్ కొట్టారు. ఇప్పుడీ టైటిల్ ను శర్వానంద్ వాడుకున్నాడు. ఇప్పుడు కూడా మూవీ హిట్ అయింది. ఈ నేపథ్యంలో తన పరువు నిలబెట్టావని బాలకృష్ణ తనతో అన్నారని శర్వానంద్ వెల్లడించాడు.
ముహూర్తం కూడా
నారీ నారీ నడుమ మురారి మూవీ హిట్ తో తన పరువు నిలబెట్టావని బాలకృష్ణ అన్నారని శర్వానంద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వెల్లడించాడు.
‘‘నారీ నారీ నడుమ మురారి టైటిల్ అనుకున్నాం. సూపర్ గా ఉంది. మరి ఒకసారి బాలయ్య బాబును అడుగుదామని అన్నా. నేను కాల్ చేశా. బాబు ఇలా పెట్టుకుందామని అనుకుంటున్నా ఇలా అని అడిగా. ‘హేయ్.. నువ్వు అడగటం ఎందుకు? నువ్వు నావాడివి. నువ్వు శుభ్రంగా పెట్టుకో’ అని అన్నారు. అంతే కాదు ముహూర్తం కూడా ఆయనే పెట్టారు’’ అని శర్వానంద్ తెలిపాడు.
పరువు నిలబెట్టావని
‘‘అన్ స్టాపబుల్ షోలో టైటిల్ లాంఛ్ చేశారు. అదంతా అయిపోయింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేనే వేరే పని మీద కాల్ చేశా. థ్యాంక్యూ యూ సర్ అని చెప్పా. ‘హేయ్.. విన్నా. నా పరువు నిలబెట్టావ్. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి’ అని అన్నారు’’ అని శర్వానంద్ వెల్లడించాడు.
ఇద్దరు భామలు
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ 1990లో రిలీజైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన శోభన, జూహీ చావ్లా హీరోయిన్లు. తన బావ కూతుర్లయిన వీళ్లిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని బాలకృష్ణ అనుకుంటాడు. కానీ ఇద్దరూ బాలయ్యనే కావాలంటారు. ఈ మూవీకి ఎ.కోదండరామిరెడ్డి డైరెక్టర్. కె.మురారి నిర్మించారు. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది.
{{/usCountry}}నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నారీ నారీ నడుమ మురారి మూవీ 1990లో రిలీజైంది. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన శోభన, జూహీ చావ్లా హీరోయిన్లు. తన బావ కూతుర్లయిన వీళ్లిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని బాలకృష్ణ అనుకుంటాడు. కానీ ఇద్దరూ బాలయ్యనే కావాలంటారు. ఈ మూవీకి ఎ.కోదండరామిరెడ్డి డైరెక్టర్. కె.మురారి నిర్మించారు. ఈ మూవీ అప్పట్లో పెద్ద హిట్ గా నిలిచింది.
{{/usCountry}}