Sharwanand: శర్వానంద్ లీడ్ రోల్లో నటించిన మూవీ బైకర్. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 3) థియేటర్లలోకి రిలీజైన ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, మంచి కలెక్షన్లు రావడంతో తొలి రోజే మూవీ టీమ్ బంపర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో శర్వానంద్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రభాస్ అన్నకి థ్యాంక్స్

బైకర్ సినిమాకు మొదటి నుంచి రెబల్ స్టార్ ప్రభాస్ అండగా ఉంటున్నాడు. మూవీ రిలీజ్ కు ముందు సోషల్ మీడియా ద్వారా బాగానే ప్రమోట్ చేశాడు. అయితే ఇంత చేసిన శర్వానంద్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేదంటూ వచ్చిన విమర్శలకు తాజాగా అతడు సమాధానమిచ్చాడు. ఎవరేమనుకున్నా తనకు సంబంధం లేదని, తనకు ఎక్స్‌ప్రెస్ చేయడం రాదని, మనమేంటో మనకు తెలుసు అని అన్నాడు.
“ముందుగా ప్రభాస్ అన్నకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. మేం ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ చేయగానే ఫస్ట్ ట్వీట్ ఆయనే వేశారు. మొన్న రిలీజ్ కు ముందు ఓ చిన్న యాడ్ లాగా చేశారు. ప్రభాస్ అన్న ఐలవ్యూ.. నా గుండెలో మీరు ఎప్పుడూ అక్కడ ఉంటారు. ఎవరేం అనుకున్నా నేను పట్టించుకోను. నాకు ఎక్స్‌ప్రెస్ చేయడం రాదు. మనమేంటో మనిద్దరికీ తెలుసు” అని శర్వానంద్ అన్నాడు.
బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తామని ముందే చెప్పా
ఇక బైకర్ సినిమా గురించి కూడా శర్వానంద్ మాట్లాడాడు. సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని, ఇప్పుడు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తానని ముందే చెప్పి ఇచ్చానని అన్నాడు.
“ఈ సినిమాకు ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్ వంశీ అన్న. యూవీ క్రియేషన్స్ లో నేను నాలుగు సినిమాలు చేశాను. అన్నీ హిట్టే. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు.. ఇప్పుడు బైకర్. అందుకే ఫస్ట్ హీరో ప్రొడ్యూసర్ అని అన్నాను. ఇక సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పాను ఇచ్చాను. ఇప్పుడు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తానన్నాను. కొట్టాను. దీనికి కారణమైన ప్రేక్షకులు, మీడియా అందరికీ థ్యాంక్స్” అని శర్వానంద్ అన్నాడు.
ఈ సినిమాలో ఇద్దరం హీరోలమే
{{/usCountry}}“ఈ సినిమాకు ఫస్ట్ హీరో మా ప్రొడ్యూసర్ వంశీ అన్న. యూవీ క్రియేషన్స్ లో నేను నాలుగు సినిమాలు చేశాను. అన్నీ హిట్టే. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా, మహానుభావుడు.. ఇప్పుడు బైకర్. అందుకే ఫస్ట్ హీరో ప్రొడ్యూసర్ అని అన్నాను. ఇక సంక్రాంతికి బ్లాక్‌బస్టర్ ఇస్తానని చెప్పాను ఇచ్చాను. ఇప్పుడు బంపర్ బ్లాక్‌బస్టర్ ఇస్తానన్నాను. కొట్టాను. దీనికి కారణమైన ప్రేక్షకులు, మీడియా అందరికీ థ్యాంక్స్” అని శర్వానంద్ అన్నాడు.
ఈ సినిమాలో ఇద్దరం హీరోలమే
{{/usCountry}}ఇక ఈ బైకర్ మూవీలో నటించిన రాజశేఖర్ గురించి కూడా శర్వా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. సింప్లిసిటీ ఎలా ఉంటుందో ఆయన నుంచి నేర్చుకోవాలని అతడు అన్నాడు. బైకర్ సినిమాలో తాము ఇద్దరం హీరోలమే అని, సినిమా చూసిన తర్వాత అందరూ అదే అంటున్నారని కూడా శర్వానంద్ చెప్పాడు.
“మొన్న మీరు ఇది శర్వా సినిమా అని అన్నారు. కానీ ఇప్పుడు సినిమా చూసినవాళ్లు మాత్రం ఇది రాజశేఖర్ సినిమా, శర్వా సినిమా అనే అంటున్నారు. ఆయన ఇప్పటికీ మనందరికీ హీరోనే. ఇందులో మీరు నటించడం మాకు గౌరవం” అని శర్వానంద్ అన్నాడు.
బైకర్ మూవీకి తొలి షో నుంచే పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తొలి రోజు ఈ సినిమా ఇండియాలో రూ.2.1 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. అయితే ఈ మూవీకి సంగీత్ శోభన్ నటించిన రాకాస నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.