టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ బైకర్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా.. మేకర్స్ ఓ షాకిచ్చారు. మూవీ రిలీజ్ వాయిదా వేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. అయితే తెలుగు సినిమాలో ఇప్పటి వరకూ చూడని విధంగా ఈ మూవీని తీర్చిదిద్దే క్రమంలోనే ఈ ఆలస్యం జరిగిందని వివరణ ఇచ్చింది.
బైకర్ రిలీజ్ వాయిదా

శర్వానంద్ నటించిన బైకర్ మూవీ డిసెంబర్ 6న రిలీజ్ కావాల్సి ఉంది. బాలకృష్ణ నటించిన అఖండ 2తో ఇది పోటీ పడుతుందని భావించారు. కానీ సరిగ్గా పది రోజుల ముందు మేకర్స్ రిలీజ్ ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం యూవీ క్రియేషన్స్ ట్వీట్ చేసింది.
“బైకర్‌ను వాయిదా వేస్తున్నాం.. కొత్త రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఓ పెద్ద, మంచి ఎక్స్‌పీరియన్స్ ను అందించాలని ఎంతో జాగ్రత్తగా, ఓ ప్యాషన్ తో పని చేస్తున్నాం. బైకర్ మూవీ 3డీ, 4డీఎక్స్, మరెన్నో ఫార్మాట్లలో రిలీజ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.
తెలుగు సినిమా చూడని విధంగా..
ఈ ట్వీట్ కు మేకర్స్ ఓ పోస్టర్ కూడా జోడించారు. దానిపై మూవీ రిలీజ్ వాయిదాకు అసలు కారణమేంటో సుదీర్ఘ వివరణ ఇచ్చారు.
“బైకర్.. స్క్రీన్లకు మించిన అనుభవం.. ఈ బీస్ట్ ని తయారు చేయడానికి మా నటీనటులు, సాంకేతిక సిబ్బంది ఎన్నో రాత్రులు కష్టపడ్డాం.. కష్టపడుతున్నాం. మమ్మల్ని నమ్మండి.. మేము ఇప్పటి వరకూ చూపించిన దాని కంటే ఈ సినిమా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది. తెలుగు సినిమా ఇప్పటి వరకూ చూడని విధంగా ఉండబోతోంది. ఇలాంటి ఎక్స్ పీరియన్స్ కి, ఇలాంటి స్కేల్ కి.. మిమ్మల్ని ఊపిరి ఆడకుండా చేయడానికి, మీలో అడ్రినలిన్ పరుగెత్తేలా చేయడానికి, మీ గుండెలు వేగంగా కొట్టుకునేలా చేయాలన్నదే మా ప్రయత్నం. బైకర్ వాయిదా వేస్తున్నాం.. ఓ సినిమాగానే కాదు గతంలో ఎప్పుడూ చూడని ఓ అనుభవాన్ని ఇవ్వబోతున్నాం. బైకర్ థియేటర్లలో 3డీ, 4డీఎక్స్ ఫార్మాట్లలో రానుంది” అని ఆ పోస్టర్ పై రాసి ఉంది.
బైకర్ మూవీలో శర్వానంద్, మాళవికా నాయర్, అతుల్ కులకర్ణి నటిస్తున్నారు. ఈ సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ కోసం శర్వానంద్ పూర్తిగా సన్నగా మారిపోయి ఆశ్చర్యపరిచాడు. అతడు ఏకంగా 22 కిలోల బరువు కూడా తగ్గాడు. బైకర్ డిసెంబర్ రిలీజ్ వాయిదా పడటంతో సంక్రాంతి సమయానికి వస్తుందా లేదంటే ఇంకా ముందే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.
{{/usCountry}}బైకర్ మూవీలో శర్వానంద్, మాళవికా నాయర్, అతుల్ కులకర్ణి నటిస్తున్నారు. ఈ సినిమాను అభిలాష్ రెడ్డి డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ కోసం శర్వానంద్ పూర్తిగా సన్నగా మారిపోయి ఆశ్చర్యపరిచాడు. అతడు ఏకంగా 22 కిలోల బరువు కూడా తగ్గాడు. బైకర్ డిసెంబర్ రిలీజ్ వాయిదా పడటంతో సంక్రాంతి సమయానికి వస్తుందా లేదంటే ఇంకా ముందే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.
{{/usCountry}}