సంక్రాంతి బరిలో నిలిచి అనూహ్యంగా హిట్ కొట్టిన మూవీ నారీ నారీ నడుమ మురారి. పెద్ద సినిమాల మధ్య ధైర్యంగా నిలిచి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందీ మూవీ. ఇప్పుడీ సినిమా సక్సెస్ మీట్ లో హీరో శర్వానంద్ చేసిన కామెంట్స్ ఆసక్తి రేపాయి. ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర మళ్లీ పెద్ద సినిమాలు చేసే వరకు తాను ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన మూవీస్ చేస్తానని అనడం గమనార్హం.
హీరో, ప్రొడ్యూసర్ కలిస్తే ఇలా ఉంటుంది

నారీ నారీ నడుమ మురారీ మూవీ హిట్ కావడంతో శర్వానంద్ మాంచి ఊపు మీదున్నాడు. సక్సెస్ సెలబ్రేషన్స్ లో కాస్త ఎమోషనల్ కూడా అయ్యాడు. ప్రొడ్యూసర్ అనిల్ సుంకర గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి.
“ఈ విజయానికి కారణమైన ఓ వ్యక్తిని అన్నా అని పిలవాలని అనిపిస్తోంది. అనిల్ సుంకరగారు.. థ్యాంక్స్ అనేది చాలా చిన్న పదం. థ్యాంక్స్ చెప్పి ఇక్కడితో రుణం తీర్చుకోవాలని అనుకోవడం లేదు. ఒక్కటి మాత్రం చెప్పగలను. హీరో, ప్రొడ్యూసర్ కలిసుంటే ఏమవుతుందో మేం చూపిస్తాం. నెక్ట్స్ సినిమాకు రూపాయి కూడా అడగను అని ప్రామిస్ చేస్తున్నాను. మళ్లీ మా అనిల్ గారు పెద్ద సినిమాలు చేసే వరకు నేను రూపాయి కూడా తీసుకోను. ఏడేళ్ల నుంచి కష్టపడుతున్నాం. ఒక్క హిట్ వాల్యూ తెలుసు మాకు. ఆ హిట్టు మీరు మాకిచ్చారు” అని శర్వానంద్ అన్నాడు.
మల్టీస్టారర్‌కు రెడీ
ఇక శ్రీవిష్ణుతో మల్టీస్టారర్ మూవీకి కూడా శర్వా సై అన్నాడు. అనిల్ ప్రొడక్షన్ లోనే తనకు, శ్రీవిష్ణకు కలిపి ఓ కథ రాయాలని, తాను చేస్తానని చెప్పాడు. మీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, మీ తర్వాతి కథ కూడా అదిరిపోయేలా ఉందని విన్నాను అని శర్వా.. శ్రీవిష్ణును ఉద్దేశించి అన్నాడు. క్యామియో తాను చేస్తాను కానీ.. పూర్తిస్థాయి మల్టీస్టారర్ కు కూడా రెడీ అని స్పష్టం చేశాడు.
నారీ నారీ నడుమ మురారి విశేషాలు
శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, వీకే నరేష్, వెన్నెల కిశోర్ లాంటి వాళ్లు నటించిన మూవీ నారీ నారీ నడుమ మురారి. దీనిని రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశాడు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించాడు. జనవరి 14న రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
{{/usCountry}}శర్వానంద్, సంయుక్త మీనన్, సాక్షి వైద్య, వీకే నరేష్, వెన్నెల కిశోర్ లాంటి వాళ్లు నటించిన మూవీ నారీ నారీ నడుమ మురారి. దీనిని రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేశాడు. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించాడు. జనవరి 14న రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
{{/usCountry}}ఇద్దరు అమ్మాయిల మధ్య హీరో నలిగిపోయే స్టోరీ ఇది. సింపుల్ స్టోరీ అయినా కూడా సినిమా చూసిన ప్రేక్షకుడుకి మాత్రం అంతకుమించిన ఎక్స్‌పీరియెన్స్ కలుగుతుంది. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు నవ్విస్తూనే ఉంటుంది. వరుసగా ఫ్లాప్స్ చూసిన శర్వానంద్‌కు ఇది గట్టి కమ్‌బ్యాక్ అని చెప్పొచ్చు.