Bhogi Raksha Bandhan Poster: హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా 'భోగి' (Bhogi) థియేట్రికల్ రిలీజ్ అనూహ్యంగా వాయిదా పడింది. మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో ఆగస్టు 28న విడుదల కావాల్సిన ఈ సినిమా థియేటర్లలోకి రావడం లేదని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. రిలీజ్ వాయిదా పడినా, రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
"గంగ ఒక్కడే... ప్రాణాలు ఐదు" - రాఖీ స్పెషల్ పోస్టర్ తెచ్చిన జోష్

రాఖీ పౌర్ణమి సందర్భంగా చిత్ర యూనిట్ వదిలిన స్పెషల్ పోస్టర్ ఆడియన్స్ హృదయాలను హత్తుకుంటోంది. "గంగ ఒక్కడే... ప్రాణాలు ఐదు" అనే పవర్ ఫుల్ క్యాప్షన్‌తో వచ్చిన ఈ పోస్టర్‌లో శర్వానంద్ తన ఐదుగురు అక్కాచెల్లెళ్ల మధ్య కూర్చుని తాటి ముంజలు తింటూ ఎంతో సంతోషంగా గడుపుతుండటం చూడొచ్చు.
అక్కాచెల్లెళ్ల అనురాగం, ఫ్యామిలీ బాండింగ్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందించిన ఈ పిక్ 'భోగి' సినిమాలో ఎమోషనల్ కంటెంట్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో క్లియర్ గ్లింప్స్ ఇచ్చింది. మాస్ యాక్షన్ మూవీగా ప్రచారం పొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో బలమైన ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
రిలీజ్ వాయిదా వెనుక అసలు కారణం ఇదే
ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రావలసిన 'భోగి' వాయిదా పడటానికి ప్రధాన కారణం వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్ అని మేకర్స్ స్పష్టం చేశారు. 1960ల కాలం నాటి తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక గ్రామ బ్యాక్‌డ్రాప్‌లో ఈ కథ సాగుతుంది.
ఆ నాటి విజువల్ స్కేల్, పీరియడ్ వాతావరణం బిగ్ స్క్రీన్‌పై గ్రాండ్‌గా కనిపించేలా చేయడానికి చిత్ర బృందం అదనపు సమయం తీసుకుంటోంది. విజువల్స్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్ కేకే రాధామోహన్, డైరెక్టర్ సంపత్ నంది రిలీజ్ డేట్‌ను వెనక్కి నెట్టారు. త్వరలోనే సరికొత్త వరల్డ్ వైడ్ రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
సంపత్ నంది - శర్వానంద్ కాంబో.. పాన్-ఇండియా రేంజ్ హంగామా
'రచ్చ', 'బెంగాల్ టైగర్', 'సీటీమార్' లాంటి మాస్ సినిమాలను అందించిన సంపత్ నంది.. ఈసారి శర్వానంద్‌తో కలిసి ఒక హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామాను డిజైన్ చేశారు. 'శర్వా-సంపత్ బ్లడ్ ఫెస్ట్' అనే టాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఫస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.
{{/usCountry}}'రచ్చ', 'బెంగాల్ టైగర్', 'సీటీమార్' లాంటి మాస్ సినిమాలను అందించిన సంపత్ నంది.. ఈసారి శర్వానంద్‌తో కలిసి ఒక హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామాను డిజైన్ చేశారు. 'శర్వా-సంపత్ బ్లడ్ ఫెస్ట్' అనే టాగ్ లైన్‌తో వస్తున్న ఈ సినిమా శర్వానంద్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఫస్ట్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కావడంతో అంచనాలు అంబరాన్ని తాకుతున్నాయి.
{{/usCountry}}ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శర్వానంద్ గతంలో చేసిన 'మహా సముద్రం', 'ఒకే ఒక జీవితం', 'మనమే' సినిమాల కంటే డిఫరెంట్ రోల్‌లో ఇందులో కనిపించబోతున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై లక్ష్మి రాధామోహన్ సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వసూళ్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి.
శర్వానంద్ ఈ ఏడాది ఇప్పటికే రెండు హిట్ సినిమాలు అందించాడు. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి, ఆ తర్వాత బైకర్ సినిమాలతో శర్వా తన రేంజ్ ఏంటో చూపించాడు. భోగితో హ్యాట్రిక్ హిట్స్ కొట్టాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.