Manju Warrier: మలయాళ హీరోయిన్‌కు షాకింగ్ అనుభవం-మంజు వారియర్‌కు పబ్లిక్‌గా లిప్ కిస్ ఇచ్చిన అభిమాని-వీడియో వైరల్
Manju Warrier: మలయాళ స్టార్ హీరోయిన్ మంజు వారియర్ కు షాకింగ్ అనుభవం ఎదురైంది. ఓ పబ్లిక్ ఈవెంట్లో ఓ ఫ్యాన్ అందరి ముందు హీరోయిన్ కు లిప్ కిస్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా మలయాళం, తమిళ భాషల్లో మంజు వారియర్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన నటనతో 'లేడీ సూపర్ స్టార్'గా ఎదిగిన ఆమెకు సాధారణంగానే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయితే తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమెకు ఒక అభిమాని వల్ల షాకింగ్ అనుభవం ఎదురైంది. వేదికపై ఉన్న మంజు వారియర్ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చిన ఓ ఫ్యాన్ ఆమెను గట్టిగా హత్తుకుని ఏకంగా పెదవులపై ముద్దు పెట్టుకున్నారు.

మంజు వారియర్ కు ఫ్యాన్ కిస్
తాజాగా కేరళలోని పలక్కాడ్ లో ఓ జువెల్లరీ షో రూమ్ ఈవెంట్ కు మంజు వారియర్ గెస్ట్ గా వెళ్లింది. అక్కడ బయట ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఆమె మాట్లాడింది. ఆ సమయంలోనే ఓ లేడీ ఫ్యాన్ దూసుకొచ్చింది. మంజు వారియర్ ను హగ్ చేసుకోవడమే కాకుండా ఆమెకు లిప్ కిస్ కూడా ఇచ్చింది. ఈ అనూహ్య ఘటనతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
నవ్వుతూ
మంజు వారియర్ కు ఓ లేడీ ఫ్యాన్ పబ్లిక్ గా లిప్ లాక్ ఇవ్వడం కలకలం రేపుతోంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది, నిర్వాహకులు ఆ అభిమానిని పక్కకు లాగేసి, స్టేజ్ పై నుండి కిందకు దించేశారు. ఈ షాకింగ్ ఘటన తర్వాత మంజు వారియర్ నవ్వుతూ పరిస్థితిని ప్రశాంతంగా ఉంచేందుకు ట్రై చేసింది.
రియాక్షన్
ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మంజు వారియర్ పట్ల ఆ అభిమానికి ఉన్నది ప్రేమో లేక అత్యుత్సాహమో అర్థం కావడం లేదని కొందరు అంటుంటే, సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
ఐ లవ్యూ
అయితే మంజు వారియర్ కు ముద్దు పెట్టిన తర్వాత ఆ లేడీ ఫ్యాన్ గట్టిగట్టిగా అరిచింది. తనకు మంజు వారియర్ అంటే ప్రేమ అని, అందుకే ముద్దు పెట్టానని ఆ అభిమాని చెప్పడం గమనార్హం. ఏదేమైనా సెలబ్రిటీలకు పబ్లిక్ లో ఇలాంటి షాకింగ్ ఘటనలు ఎదురవడం హాట్ టాపిక్ గా మారింది.
సెకండ్ ఇన్నింగ్స్‌లో
వ్యక్తిగత కారణాలతో సినిమాలకు కొన్నాళ్లు విరామం ప్రకటించిన మంజు వారియర్, 'హౌ ఓల్డ్ ఆర్ యు' చిత్రంతో తన రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు. కేవలం కమర్షియల్ చిత్రాలే కాకుండా, సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే సున్నితమైన కథాంశాలను ఎంచుకుంటూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. మలయాళంలో ఎంతటి స్టార్ డమ్ ఉందో, ఇప్పుడు తమిళనాడులోనూ ఆమెకు అంతే ఆదరణ లభిస్తోంది.
మంజు వారియర్ ముద్ర
ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన 'అసురన్' సినిమాతో ఆమె తమిళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఎదిగిన కొడుకు ఉన్న తల్లి పాత్రలో ఆమె చూపించిన పరిణతి చెందిన నటన ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ముఖ్యంగా దక్షిణ తమిళ యాసను పక్కాగా పలికి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఇక ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన 'వేట్టయన్' సినిమాలో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని 'మనసిలాయో' పాటలో మంజు వారియర్ వేసిన స్టెప్పులు ట్రెండింగ్ అవుతూనే ఉన్నాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


