Shrasti Verma Jani Master: కేసు ఉందనే మైండ్ గేమ్స్-నాలుగేళ్లు వేధింపులు-జానీ మాస్టర్ పై నిప్పులు చెరిగిన శ్రష్టి వర్మ
Shrasti Verma Jani Master: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారంలో కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ శ్రష్టి వర్మ నిప్పులు చెరిగింది. ఆమె పోస్టులు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. లీగల్ కేసుల నుంచి తప్పించుకోవడానికి జానీ మాస్టర్ మైండ్ గేమ్స్ ఆడుతున్నారని శ్రష్టి ఆరోపించింది.
Shrasti Verma Jani Master: టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌లో అంతర్గత విభేదాలు, వివాదాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఉన్న లీగల్ ఇష్యూస్ ఒకవైపు నడుస్తుండగానే, అసోసియేషన్ వేదికగా జరుగుతున్న పరిణామాలు పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ సంచలన ఆరోపణలు చేసింది.

శ్రష్టి వర్మ ఆరోపణలు
తాజాగా డ్యాన్సర్ల అసోసియేషన్ వివాదం నేపథ్యంలో ఓ కెమెరా ముందు కోపంగా మాట్లాడుతున్న జానీ మాస్టర్ వీడియోను శ్రష్టి వర్మ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది. దీనికి క్యాప్షన్ గా శ్రష్టి రాసుకొచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
‘‘ఈ మనిషి ప్రదర్శిస్తున్న అగౌరవ, దూకుడు ప్రవర్తన ఈనాటిది కాదు. గత నాలుగు సంవత్సరాలుగా నేను ఇలాంటి వేధింపులు ఎదుర్కొననా. అయితే, ప్రస్తుతం లీగల్ కేసు ముదురుతున్న తరుణంలో ఈ ప్రవర్తన అంతా కోర్టులో తనకు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యంగా మారుతుందని అతను గ్రహించాడు’’ అని శ్రష్టి రాసుకొచ్చింది.
మైండ్ గేమ్స్
చట్టపరమైన ఇబ్బందుల నుంచి బయటపడటానికి, మీడియా దృష్టిని మళ్లించి ప్రజల్లో తనపై ఒక సానుకూల ముద్ర వేయించుకునేందుకు జానీ మాస్టర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని శ్రష్టి వర్మ ఆరోపించింది. అందుకోసం రకరకాల మైండ్ గేమ్స్, ఇమేజ్ మేనేజ్‌మెంట్ వ్యూహాలను వాడుతున్నారని మండిపడింది. అయితే పబ్లిక్ నరేటివ్‌ను మార్చడానికి ఎన్ని డ్రామాలు ఆడినా అసలు నిజాలు మారవని, లీగల్ ప్రాసెస్ ద్వారా నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయని ఆమె పేర్కొంది.
ఎదుగుదలను జీర్ణించుకోలేక
శ్రష్టి వర్మ మరో పోస్టులో ఇంకో వీడియో పోస్టు చేసింది. అందులో డ్యాన్సర్స్ అసోషియేషన్ కు చెందిన ఓ వ్యక్తి మాట్లాడారు. ‘‘బీబీ జోడీ గెలిచిన తర్వాత శ్రష్టి వర్మకు సన్మానం చేద్దామనుకున్నాం. కానీ అడ్డుకున్నారు. పాత వివాదాన్ని తెరపైకి తెచ్చారు’’ అని ఆ వ్యక్తి చెప్పారు. దీన్ని ప్రస్తావిస్తూ శ్రష్టి వర్మ ఘాటు వ్యాఖ్యలు రాసుకొచ్చింది.
ఈ వివాదంలో కేవలం వ్యక్తిగత వేధింపులే కాకుండా, వృత్తిపరమైన అవకాశాలను దెబ్బతీసే పెద్ద కుట్ర దాగి ఉందనే విషయాన్ని శ్రష్టి వర్మ హైలైట్ చేసింది. తాను కెరీర్‌లో పురోగతి సాధిస్తూ, తన డ్యాన్స్ వర్క్‌కు పరిశ్రమ నుంచి ప్రశంసలు అందుకుంటున్న ప్రతిసారీ, TFTDDA ప్రెసిడెంట్ దానిని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని ఆమె ఆరోపించింది.
వ్యక్తిగత కక్షలు
తన ఎదుగుదలను, వ్యక్తిగత ప్రతిష్టను మార్కెట్లో తగ్గించడమే లక్ష్యంగా వెనుక ఉండి కొన్ని శక్తులు ప్రణాళికలు రచిస్తున్నాయని శ్రష్టి వర్మ సంచలన వ్యాఖ్యలు చేసింది.
"వ్యక్తిగత కక్షలు ఏవైనా ఉంటే అవి పక్కన పెట్టాలి. కేవలం వ్యక్తిగత విభేదాల కారణంగా ఒకరి ప్రొఫెషనల్ లైఫ్‌ను, వారికి వచ్చే కెరీర్ అవకాశాలను ఎలా అడ్డుకుంటారు?" అని శ్రష్టి ప్రశ్నించింది.
ఏమైందంటే?
తాజాగా డ్యాన్సర్ల అసోసియేషన్ వ్యవహారంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య వాగ్వాదం జరిగిందనే వార్తలు వచ్చాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి ఈ ఇద్దరినీ పిలిచి మాట్లాడారు. దీంతో శేఖర్ తో తనకు ఎలాంటి గొడవ లేదని జానీ చెప్పుకొచ్చాడు. చిరంజీవితో కలిసి శేఖర్, తాను లంచ్ చేసిన ఫొటోలను కూడా రిలీజ్ చేశాడు. ఈ నేపథ్యంలో శ్రష్టి వర్మ సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.
ఆ కేసు
గతంలో జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసినప్పుడు అతను వేధించాడని శ్రష్టి వర్మ ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు 2024లో జానీ మాస్టర్ పై పోక్సో కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీసులు అతన్ని గోవాలో అరెస్టు చేశారు. నెల రోజుల పాటు జైల్లో ఉన్న అతను.. ఇప్పుడు బెయిల్ పై బయట ఉన్నాడు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


