...
...
Next Story

Shriya Saran: ఆ సైజులు పెంచి చూపిస్తారు.. ఒంటిపై డ్రెస్ మాయమవుతుంది: డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలపై శ్రియా కామెంట్స్

Shriya Saran: ఏఐ డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలపై శ్రియా శరణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మధ్యే జాన్వీ కపూర్ చుట్టమల్లే సాంగ్ మార్ఫింగ్ వీడియోతోపాటు తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి కూడా వివరిస్తూ.. ఇలాంటి వాటిని ఖండించారు.

Published on: Oct 13, 2026, 16:10:39 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Shriya Saran: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను ఉపయోగించి సినీ హీరోయిన్లను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్న తీరుపై టాలీవుడ్, బాలీవుడ్ సీనియర్ నటి శ్రియా శరణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇటీవల యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించిన 'దేవర' సినిమాలోని ఫేమస్ 'చుట్టమల్లే' పాటను ఏఐ ద్వారా మోర్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ఈ డిజిటల్ దారుణాన్ని జాన్వీ కపూర్ తో పాటు ఎన్టీఆర్, చిరంజీవి తీవ్రంగా ఖండించారు.

Shriya Saran: ఆ సైజులు పెంచి చూపిస్తారు.. ఒంటిపై డ్రెస్ మాయమవుతుంది: డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలపై శ్రియా కామెంట్స్
Shriya Saran: ఆ సైజులు పెంచి చూపిస్తారు.. ఒంటిపై డ్రెస్ మాయమవుతుంది: డీప్ ఫేక్ ఫొటోలు, వీడియోలపై శ్రియా కామెంట్స్

ఈ క్రమంలోనే తనకు కూడా గతంలో ఇలాంటి భయంకరమైన అనుభవాలు ఎదురయ్యాయని శ్రియా శరణ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏఐ సాంకేతికత ఎంత మేలు చేస్తుందో, తప్పుడు చేతుల్లోకి వెళ్తే అంతకంటే ప్రమాదకరంగా మారుతుందని ఆమె హెచ్చరించారు.

"నా డ్రెస్సులు తీసేసి అసభ్యంగా మార్చేశారు" - శ్రియా ఆవేదన

ఈ డీప్ ఫేక్ వీడియోల అంశంపై న్యూస్18 మీడియా సంస్థతో శ్రియా శరణ్ మాట్లాడుతూ తన గోడును వెళ్లబోసుకున్నారు. "ఒక్కోసారి సోషల్ మీడియాలో నా ఫోటోలు చూస్తుంటే అందులో ఉన్నది నేనేనా కాదా అని నాకే సందేహం వస్తుంది. బూబ్స్ సైజులు పెంచేస్తారు. మనం వేసుకున్న జాకెట్లను, డ్రెస్సులను పూర్తిగా తీసేసి ఏఐ సహాయంతో అసభ్యకరంగా బాడీ షేప్‌ను మార్చేస్తున్నారు. ఇది నిజంగా చాలా బాధాకరం, పైగా తీవ్రంగా ఆగ్రహం తెప్పించే విషయం. ఏఐ అనేది మనుషులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి గానీ, ఒక మహిళ గౌరవాన్ని దెబ్బతీయడానికి కాదు" అని వ్యాఖ్యానించారు.

ఇటీవల 'దేవర' చిత్రంలోని 'చుట్టమల్లే' పాటకు సంబంధించిన జాన్వీ కపూర్ ఏఐ వీడియో సోషల్ మీడియాలో కల్లోలం సృష్టించింది. దీనిపై జాన్వీ కపూర్ కూడా తీవ్ర స్థాయిలో స్పందిస్తూ.. ఇది కేవలం మోర్ఫింగ్ మాత్రమే కాదని, ఒక రకమైన లైంగిక దాడితో సమానమని ఇన్‌స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. జాన్వీకి మద్దతుగా ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, విజయ్ దేవరకొండ, ఖుష్బూ వంటి ప్రముఖులు నిలిచి, ఏఐ వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

'దృశ్యం 3' సక్సెస్‌తో బాక్సాఫీస్ వద్ద శ్రియా జోరు

ఈ సినిమా విజయంపై మలయాళ ఒరిజినల్ హీరో మోహన్ లాల్ కూడా ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్‌లో విజయ్ సాల్గాంకర్ భార్య నందిని పాత్రలో శ్రియా శరణ్ అద్భుతమైన నటనను కనబరిచారు. ఒకవైపు వరుస బ్లాక్‌బస్టర్ సినిమాలతో దూసుకెళ్తున్నప్పటికీ, ఇలాంటి డిజిటల్ ఏఐ వేధింపులు హీరోయిన్ల భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks