Shruthi Haasan: శృతి హాసన్‌కు బాంబే హైకోర్టు గుడ్ న్యూస్.. పర్సనాలిటీ రైట్స్ కేసులో విజయం
Shruthi Haasan: శృతి హాసన్ పర్సనాలిటీ రైట్స్ విషయంలో బాంబే హైకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆమె అనుమతి లేకుండా ఎలాంటి కంటెంట్ వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది.
Shruthi Haasan: పాన్-ఇండియా స్టార్ హీరోయిన్ శృతి హాసన్ చట్టపరంగా ఒక పెద్ద విజయం సాధించారు. తన అనుమతి లేకుండా సోషల్ మీడియా వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న అభ్యంతరకర కంటెంట్, మార్ఫింగ్ విజువల్స్ పై శృతి హాసన్ వేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు అత్యంత కీలక తీర్పు వెలువరించింది. ఆ వివాదాస్పద కంటెంట్‌ను వెంటనే డిలీట్ చేయాలని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను న్యాయస్థానం ఆదేశించింది.

పర్సనాలిటీ రైట్స్ కాపాడాలంటూ కోర్టు మెట్లు ఎక్కిన శృతి
డిజిటల్ మీడియాలో తన పేరు, ముఖం, వాయిస్ అనధికారికంగా వాడటమే కాకుండా, తన ఇమేజ్‌కు నష్టం కలిగించేలా కొందరు కంటెంట్ క్రియేట్ చేస్తున్నారంటూ శృతి హాసన్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన పర్సనాలిటీ, పబ్లిసిటీ రైట్స్‌కు రక్షణ కల్పించాలని ఆమె పిటిషన్‌లో కోరారు.
ఈ కేసు విచారణ చేపట్టిన హైకోర్టు.. ఆన్‌లైన్ వేదికల్లో సర్క్యులేట్ అవుతున్న సదరు కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, భవిష్యత్తులో అలాంటి మెటీరియల్ మళ్లీ సోషల్ మీడియాలో వ్యాప్తి కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. డిజిటల్ యుగంలో సెలబ్రిటీల హక్కుల పరిరక్షణకు ఈ రూలింగ్ ఒక బెంచ్ మార్క్‌గా నిలవనుంది.
డీప్‌ఫేక్, ఏఐ మార్ఫింగ్ బెడదపై గట్టి దెబ్బ
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో డీప్‌ఫేక్స్ తయారు చేయడం, హీరోయిన్ల ఫోటోలను మోర్ఫింగ్ చేయడం విపరీతంగా పెరిగిపోయింది. గతంలో బాలీవుడ్ దిగ్గజాలు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ కూడా తమ పర్సనాలిటీ రైట్స్ రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకున్నారు.
ఇప్పుడు శృతి హాసన్ కూడా అదే బాటలో నడిచి తన బ్రాండ్ ఇమేజ్‌కు, పర్సనల్ లైఫ్‌కు భంగం కలిగించే కంటెంట్‌పై లీగల్ యాక్షన్ తీసుకున్నారు. ఒక స్టార్ సెలబ్రిటీ అనుమతి లేకుండా వారి రూపాన్ని కమర్షియల్ ప్రయోజనాల కోసం లేదా అసభ్యకర రీతిలో వాడటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఈ తీర్పు మరోసారి నిరూపించింది.
వరుస ప్రాజెక్టులతో శృతి హాసన్ స్పీడ్
లోకనాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చినా, తన సొంత టాలెంట్‌తో సౌత్ నుంచి నార్త్ వరకు శృతి హాసన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో 'గబ్బర్ సింగ్', 'రేసు గుర్రం', 'క్రాక్', 'వాల్తేరు వీరయ్య', 'వీరసింహారెడ్డి' లాంటి భారీ బ్లాక్‌బస్టర్లతో గోల్డెన్ హ్యాండ్‌గా మారారు.
ఇటీవలే రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన 'సలార్: పార్ట్ 1 - సీజ్ ఫైర్' సినిమాలో ఆద్య క్యారెక్టర్‌లో మెప్పించిన శృతి, ప్రస్తుతం సలార్ సీక్వెల్ లో నటించనుంది. ఆ మధ్య వారణాసి మూవీలో సంచారి అనే పాట కూడా పాడటం విశేషం. ఇక పెద్దిలోనూ ఓ స్పెషల్ సాంగ్ లో రామ్ చరణ్ తో స్టెప్పులేసింది. ఒకవైపు వరుస బిగ్ ప్రాజెక్టులతో కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే, తన డిజిటల్ రైట్స్ విషయంలో శృతి హాసన్ తీసుకున్న ఈ లీగల్ నిర్ణయాన్ని సినీ పరిశ్రమ స్వాగతిస్తోంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


