Shruti Haasan Suhasini Interview Kamal Haasan: దక్షిణాది చిత్ర పరిశ్రమలో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోలు, దర్శకుల కుమారులు మాత్రమే వెండితెరపై అడుగుపెట్టేవారు. ఆడపిల్లలను మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంచే సంప్రదాయం బలంగా ఉండేది.

ఆ మూస ధోరణిని బద్దలు కొట్టి, తండ్రి కమల్ హాసన్ బాటలోనే నడుస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు శ్రుతి హాసన్. తాజాగా తన అక్క (పెద్దనాన్న కూతురు), ప్రముఖ నటి సుహాసిని మణిరత్నంతో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో శ్రుతి హాసన్ తన సినీ ప్రయాణం, తండ్రి కమల్ వ్యక్తిత్వం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
సుహాసిని ప్రశ్నకు శ్రుతి అదిరిపోయే పంచ్
'గలాట్టా' (Galatta) మీడియా వేదికగా సుహాసిని, శ్రుతి హాసన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందులో భాగంగా కొన్ని ప్రశ్నలకు ఘాటుగా, సరదాగా సమాధానాలు చెప్పాలని సుహాసిని కోరారు. "నీ పెళ్లెప్పుడు?" అని సుహాసిని అడగ్గానే, శ్రుతి ఏమాత్రం తడుముకోకుండా "మరి మణిరత్నం గారికి మీరు ఎప్పుడు విడాకులు ఇస్తున్నారు?" అంటూ ఎదురుప్రశ్న వేసి నవ్వులు పూయించారు.
ఇతర రంగాలను కాదని సినిమాల్లోకే ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు శ్రుతి సూటిగా బదులిచ్చారు. "నాకు నటి కావాలనిపించింది, అందుకే వచ్చాను. దక్షిణాది సినిమాల్లో తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరూ (సుహాసిని), నేను, రేఖ గారు.. ఇలా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు" అని శ్రుతి వివరించారు. ఈ క్రమంలో గతంలో తన తండ్రి కమల్ హాసన్‌కు ఎదురైన ఒక ప్రశ్నను ఆమె గుర్తు చేసుకున్నారు.
ఏం తెలియని కుటుంబంలోకి ఎలా పంపిస్తారు
"శ్రుతిని సినీ పరిశ్రమలోకి రావడానికి మీరెలా ఒప్పుకున్నారు అని ఒకరు మా నాన్నను అడిగారు. దానికి ఆయన బదులిస్తూ.. అసలు ఏమీ తెలియని కొత్త కుటుంబంలోకి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసి మీ కూతురిని ఎలా పంపిస్తారు? ఇది మా కుటుంబం. నా కూతురు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది అని సమాధానమిచ్చారు" అని శ్రుతి హాసన్ వెల్లడించారు.
{{/usCountry}}"శ్రుతిని సినీ పరిశ్రమలోకి రావడానికి మీరెలా ఒప్పుకున్నారు అని ఒకరు మా నాన్నను అడిగారు. దానికి ఆయన బదులిస్తూ.. అసలు ఏమీ తెలియని కొత్త కుటుంబంలోకి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసి మీ కూతురిని ఎలా పంపిస్తారు? ఇది మా కుటుంబం. నా కూతురు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది అని సమాధానమిచ్చారు" అని శ్రుతి హాసన్ వెల్లడించారు.
{{/usCountry}}సినిమా ప్రపంచాన్ని తన తండ్రి ఎంత ఉన్నత స్థానంలో చూస్తారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని శ్రుతి హాసన్ చెప్పుకుంటూ మురిసిపోయారు. కమల్ హాసన్ కేవలం తండ్రిగా మాత్రమే కాకుండా, ఒక నటుడిగానూ తనకు నిత్యం స్ఫూర్తినిస్తారని శ్రుతి చెప్పారు.
72 ఏళ్ల వయసులోనూ అదే తపన.. మేకప్ పిచ్చి ఆయన నుంచే!
72 ఏళ్ల వయసులోనూ ఆయన పని పట్ల చూపే అంకితభావం, సూక్ష్మ పరిశీలన, కచ్చితత్వం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని శ్రుతి హాసన్ అన్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మేకప్ సామాన్లను దొంగిలించే అలవాటు తనకు ఉండేదని శ్రుతి నవ్వుతూ చెప్పారు. అయితే తన తల్లి సారికకు మేకప్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదని, చెల్లెలు అక్షర హాసన్ కూడా అమ్మ పోలికతోనే మేకప్‌కు దూరంగా ఉంటుందని తెలిపారు.
"ఒకరోజు నాన్న నన్ను పిలిచి, నీకు నిజంగా మేకప్ అంటే అంత ఇష్టమా అని అడిగారు. దానికి నేను.. దశావతారం లాంటి సినిమాల్లో రకరకాల గెటప్పులు, మేకప్ వేసుకునే మీరు నన్ను ఈ ప్రశ్న అడగకూడదు అని బదులిచ్చాను. ఆయన నవ్వేసి సరే అని ఊరుకున్నారు. నాకు మేకప్ మీద ఉన్న ప్రేమ ఆయన నుంచే వచ్చిందని ఎప్పుడూ చెబుతుంటాను" అని శ్రుతి హాసన్ పేర్కొన్నారు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ
తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ శ్రుతి హాసన్ తన జోరు కొనసాగిస్తున్నారు. గతేడాది (2025) లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా రూపొందిన 'పెద్ది' సినిమాలో 'హెల్లల్లల్లో' (Hellallallo) అనే ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడి అలరించారు.
ప్రస్తుతం తమిళంలో 'ట్రైన్' (Train) చిత్రంతో పాటు, తెలుగులో 'ఆకాశంలో ఒక తార' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు శ్రుతి హాసన్. సినిమా కుటుంబం నుంచి వచ్చినా, కేవలం వారసత్వంతో కాకుండా తన ప్రతిభతోనే శ్రుతి హాసన్ దక్షిణాది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.