Shruti Haasan: మీరెప్పుడు విడాకులు తీసుకుంటారు- అక్క సుహాసినికి శ్రుతి హాసన్ ప్రశ్న- కమల్ హాసన్‌లాగే మేకప్ పిచ్చి!

Shruti Haasan Suhasini Interview Kamal Haasan: సినీ కుటుంబాల నుంచి అబ్బాయిలు హీరోలుగా రావడం మామూలే కానీ, అమ్మాయిలు తెరపైకి రావడానికి ఒకప్పుడు ఎన్నో అడ్డంకులు ఉండేవి. తన కూతురు శ్రుతి హాసన్‌ను ఇండస్ట్రీలోకి ఎందుకు పంపారని ప్రశ్నించిన వారికి కమల్ హాసన్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.

Published on: Nov 15, 2026, 14:31:06 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Shruti Haasan Suhasini Interview Kamal Haasan: దక్షిణాది చిత్ర పరిశ్రమలో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. కానీ ఒకప్పుడు స్టార్ హీరోలు, దర్శకుల కుమారులు మాత్రమే వెండితెరపై అడుగుపెట్టేవారు. ఆడపిల్లలను మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంచే సంప్రదాయం బలంగా ఉండేది.

మీరెప్పుడు విడాకులు తీసుకుంటారు- అక్క సుహాసినికి శ్రుతి హాసన్ ప్రశ్న- కమల్ హాసన్‌లాగే మేకప్ పిచ్చి!
మీరెప్పుడు విడాకులు తీసుకుంటారు- అక్క సుహాసినికి శ్రుతి హాసన్ ప్రశ్న- కమల్ హాసన్‌లాగే మేకప్ పిచ్చి!

ఆ మూస ధోరణిని బద్దలు కొట్టి, తండ్రి కమల్ హాసన్ బాటలోనే నడుస్తూ అగ్ర కథానాయికగా ఎదిగారు శ్రుతి హాసన్. తాజాగా తన అక్క (పెద్దనాన్న కూతురు), ప్రముఖ నటి సుహాసిని మణిరత్నంతో జరిగిన ప్రత్యేక చిట్‌చాట్‌లో శ్రుతి హాసన్ తన సినీ ప్రయాణం, తండ్రి కమల్ వ్యక్తిత్వం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.

సుహాసిని ప్రశ్నకు శ్రుతి అదిరిపోయే పంచ్

'గలాట్టా' (Galatta) మీడియా వేదికగా సుహాసిని, శ్రుతి హాసన్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందులో భాగంగా కొన్ని ప్రశ్నలకు ఘాటుగా, సరదాగా సమాధానాలు చెప్పాలని సుహాసిని కోరారు. "నీ పెళ్లెప్పుడు?" అని సుహాసిని అడగ్గానే, శ్రుతి ఏమాత్రం తడుముకోకుండా "మరి మణిరత్నం గారికి మీరు ఎప్పుడు విడాకులు ఇస్తున్నారు?" అంటూ ఎదురుప్రశ్న వేసి నవ్వులు పూయించారు.

ఇతర రంగాలను కాదని సినిమాల్లోకే ఎందుకు వచ్చారన్న ప్రశ్నకు శ్రుతి సూటిగా బదులిచ్చారు. "నాకు నటి కావాలనిపించింది, అందుకే వచ్చాను. దక్షిణాది సినిమాల్లో తండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అమ్మాయిలు చాలా తక్కువ మంది ఉన్నారు. మీరూ (సుహాసిని), నేను, రేఖ గారు.. ఇలా వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు" అని శ్రుతి వివరించారు. ఈ క్రమంలో గతంలో తన తండ్రి కమల్ హాసన్‌కు ఎదురైన ఒక ప్రశ్నను ఆమె గుర్తు చేసుకున్నారు.

ఏం తెలియని కుటుంబంలోకి ఎలా పంపిస్తారు

"శ్రుతిని సినీ పరిశ్రమలోకి రావడానికి మీరెలా ఒప్పుకున్నారు అని ఒకరు మా నాన్నను అడిగారు. దానికి ఆయన బదులిస్తూ.. అసలు ఏమీ తెలియని కొత్త కుటుంబంలోకి పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసి మీ కూతురిని ఎలా పంపిస్తారు? ఇది మా కుటుంబం. నా కూతురు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది అని సమాధానమిచ్చారు" అని శ్రుతి హాసన్ వెల్లడించారు.

సినిమా ప్రపంచాన్ని తన తండ్రి ఎంత ఉన్నత స్థానంలో చూస్తారో చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని శ్రుతి హాసన్ చెప్పుకుంటూ మురిసిపోయారు. కమల్ హాసన్ కేవలం తండ్రిగా మాత్రమే కాకుండా, ఒక నటుడిగానూ తనకు నిత్యం స్ఫూర్తినిస్తారని శ్రుతి చెప్పారు.

72 ఏళ్ల వయసులోనూ అదే తపన.. మేకప్ పిచ్చి ఆయన నుంచే!

72 ఏళ్ల వయసులోనూ ఆయన పని పట్ల చూపే అంకితభావం, సూక్ష్మ పరిశీలన, కచ్చితత్వం చూస్తే ఆశ్చర్యం వేస్తుందని శ్రుతి హాసన్ అన్నారు. చిన్నప్పుడు తల్లిదండ్రుల మేకప్ సామాన్లను దొంగిలించే అలవాటు తనకు ఉండేదని శ్రుతి నవ్వుతూ చెప్పారు. అయితే తన తల్లి సారికకు మేకప్ అంటే పెద్దగా ఆసక్తి ఉండదని, చెల్లెలు అక్షర హాసన్ కూడా అమ్మ పోలికతోనే మేకప్‌కు దూరంగా ఉంటుందని తెలిపారు.

"ఒకరోజు నాన్న నన్ను పిలిచి, నీకు నిజంగా మేకప్ అంటే అంత ఇష్టమా అని అడిగారు. దానికి నేను.. దశావతారం లాంటి సినిమాల్లో రకరకాల గెటప్పులు, మేకప్ వేసుకునే మీరు నన్ను ఈ ప్రశ్న అడగకూడదు అని బదులిచ్చాను. ఆయన నవ్వేసి సరే అని ఊరుకున్నారు. నాకు మేకప్ మీద ఉన్న ప్రేమ ఆయన నుంచే వచ్చిందని ఎప్పుడూ చెబుతుంటాను" అని శ్రుతి హాసన్ పేర్కొన్నారు.

వరుస సినిమాలతో ఫుల్ బిజీ

తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తూ శ్రుతి హాసన్ తన జోరు కొనసాగిస్తున్నారు. గతేడాది (2025) లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఈ ఏడాది బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా రూపొందిన 'పెద్ది' సినిమాలో 'హెల్లల్లల్లో' (Hellallallo) అనే ఐటమ్ సాంగ్‌లో ఆడిపాడి అలరించారు.

ప్రస్తుతం తమిళంలో 'ట్రైన్' (Train) చిత్రంతో పాటు, తెలుగులో 'ఆకాశంలో ఒక తార' సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నారు శ్రుతి హాసన్. సినిమా కుటుంబం నుంచి వచ్చినా, కేవలం వారసత్వంతో కాకుండా తన ప్రతిభతోనే శ్రుతి హాసన్ దక్షిణాది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More